0204. 2-1. 240223-1
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀779..
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*ఇద్దరు ప్రాణస్నేహితులు ఒకరోజు ఎడారిలో నడుచుకుంటూ వెళుతున్నారు. వారు వెళ్లే క్రమంలో ఇద్దరి మధ్య వాదన జరిగి ఒక స్నేహితుడు, ఇంకో స్నేహితుణ్ణి చెంపపై కొట్టాడు.*
*కానీ చెంప దెబ్బ తిన్న స్నేహితుడు మారుమాట్లాడకుండా ఇసుక పై ఇలా రాశాడు. "ఈ రోజు నా ప్రాణ స్నేహితుడు నన్ను చెంపదెబ్బ కొట్టాడు".*
*వారు అలానే నడుచుకుంటూ వెళ్లగా, చివరకి ఒక ఒయాసిస్ దగ్గర ఆగారు. అక్కడ స్నానం చేయాలని అనుకున్నారు. ఇంతకుముందు చెంపదెబ్బ తిన్న వ్యక్తి ఆ ఒయాసిస్ లో మునిగిపోసాగాడు. కానీ ఇంకో స్నేహితుడు అతనిని కాపాడాడు.*
*బయటకు వచ్చిన ఆ స్నేహితుడు ఒక రాయిపై ఇలా చెక్కాడు… "ఈ రోజు నా స్నేహితుడు నా ప్రాణాలు కాపాడాడు".*
*చెంపపై కొట్టిన, ప్రాణాలు కాపాడిన స్నేహితుడు అతనిని ఇలా అడిగాడు... "నేను నిన్ను కొట్టినపుడు ఇసుకపై రాశావు, ఇప్పుడేమో రాయిపై రాశావు. ఎందుకు?”అని.*
*అప్పుడు ఇంకో స్నేహితుడు ఇలా అన్నాడు. "మనల్ని ఎవరైనా బాధపెడితే ఇసుకపై రాసుకోవాలి, క్షమా గుణము అనే గాలి దాన్ని చెరిపి వేస్తుంది. కానీ మనకు ఎవరైనా మంచి చేస్తే, దానిని రాయిపై చెక్కితే ఎవరూ కూడా చెరిపి వేయలేరు."*
*కథలోని నీతి:*
*మనల్ని ఎవరైనా బాధ పెడితే క్షమించాలి. మనకు ఎవరైనా మంచి చేస్తే మనసులో నిలుపుకోవాలి.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment