110223f1147. 120223-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*మహామ్మద్ ఘోరీని వణికించిన… *
*వీరనారి నాయకీ దేవి...!*
➖➖➖✍️
*చుట్టూ పరికించి చూశాడు మహమ్మద్ ఘోరి !*
*ఒక స్త్రీ, ఆమెతోపాటు ఒకసైనిక పటాలం అజాగ్రత్తగా ఉన్న తన సైనికులను ఊచకోత కొయ్యటం కనిపించింది ! ఎటుచూసినా ఆ వీరవనితచేతిలోని కత్తి తళత్తళలే కనిపించాయి !*
*మహమ్మద్ ఘోరీ తేరుకుని తన సైనికులను సన్నద్ధం చేసేలోపులోనే ఆ వనిత అక్కడ లేదు ఆమెతో వచ్చిన సైనిక పటాలము కూడా లేదు అంతా ఆరావళి కొండలలో మటుమాయమయ్యారు. ఎంత గాలించినా ఎవరూ కనపడలేదు వారికి ! సైనికుల ప్రాణనష్టం భారీగా జరిగింది ఘోరీ వైపు !*
*ఆవిడ !! ఆ ధీరమూర్తి!! పేరు నాయికిదేవి! చాళుక్యరాజవంశాన్ని మెట్టిన వనిత ! గోవాకు చెందిన ఒక మహామండలేశ్వరుడైన పరమార్ది కూతురు.*
*నాయికిదేవి సోలంకి వశస్తుడైన అజయపాలడి సతీమణి !* *అనహిలవాడను రాజధానిగా చేసుకొని నేటి రాజస్థాన్, గుజరాత్ లోని కొన్నిప్రాంతాలకు అజయపాలుడు రాజు !*
*అజయపాలుడి హఠాన్మరణంతో పసివాడైన కొడుకును గద్దెనెక్కించి ప్రతినిధిగా తాను రాజ్యం పరిపాలించింది నాయికిదేవి !*
*నాయికిదేవి చిన్నతనంలోనే గుర్రపుస్వారీ , ఖడ్గచాలనం ఇత్యాది యుద్ధవిద్యలలో శిక్షణ పొందింది ! రాజనీతి చతరురాలు యుద్ధవ్యూహాలలో మేటి !*
*ఆ రాజ్యాన్ని దాని వైభవాన్ని గురించివిన్నాడు మహమ్మద్ ఘోరి !*
*ఒక ఆడుది, ఒక పసివాడు పరిపాలించే రాజ్యాన్ని సునాయాసంగా కొల్లగొట్టవచ్చు అనుకున్నాడు !*
*అనుకున్నదే తడవుగా ఆఫ్ఘనిస్తాన్ నుండి లక్ష సైన్యంతో బయలు దేరాడు !*
*వేగులద్వారా మహమ్మద్ ఘోరీ కదలికలు వాడి ఆలోచనలు పసిగట్టింది నాయికిదేవి !*
*కానీ వాడి సైన్యం చాలా పెద్దది. తన వద్ద అంత సైనిక సంపత్తి లేదు ఎలా?*
*తల వంచటంకంటే ఎదిరించి నిలబడటంలోని ఔన్నత్యం తెలిసిన వనిత కనుక తన చుట్టుపక్కల ఉన్న తోటి రాజుల సహాయాన్ని అర్ధించింది!*
*రాజులైన.....*
*కీర్తిపాలుడు సరేనన్నాడు*
*ధరావర్షుడు నేను సిద్ధం అన్నాడు.*
*కల్హణదేవుడు ఘోరీతో కలహానికి నాదే ముందడుగు అని కబురంపాడు !*
*అనుకున్నట్లుగా సైన్యం సమకూరింది! అయినా వాడి సైన్యం ముందు చాలా చాలా తక్కువ !*
*ఆలోచించింది రాణి- ఏమి చేయాలా అని !*
*ఒకరోజు ఒకరాయబారి ఘోరీవద్దనుండి కబురు తెచ్చాడు !*
*దాని సారాంశమిది… "నీవు నీకొడుకుతోసహా నావద్దకు వచ్చి… నీ రాజ్యంలోని స్త్రీలను, సంపదను నాకు సమర్పించి లొంగిపోతే ఏవిధమైన ప్రాణనష్టముండదు" అని ..!*
*కాస్త ఆలోచించింది రాణి. “సరే! నీవు చెప్పినట్లే చేస్తాను! నీవు ఆరావళి పర్వత శ్రేణి వద్దగల ప్రాంతానికి వచ్చినవెంటనే నా అంతట నేనే వచ్చి లొంగిపోతాను.” అని కబురుపెట్టింది !*
*ఆరావళి పర్వతశ్రేణులలో ప్రతి కొండ,కోన, లోయ మలుపులు గుహలు చాటుమాటుప్రదేశాలు తన వద్ద ఉన్న అన్ని రాజ్యాల సైనికులకు తెలుసు ! నిజానికి ఆ దారులు కొట్టిన పిండి వారికి !*
*అప్పటికప్పుడు ఆమె యుద్ధవ్యూహం నిర్ణయించుకున్నది ! అది గెరిల్లా వ్యూహం !*
*అక్కడ !! విడిదిలో రాణి వచ్చి లొంగిపోతుంది అన్న ధ్యాసలో ఉండి కాస్త యుద్ధ సన్నద్ధత తగ్గి గానాబజానాలో మునిగిపోయారు ఘోరిసైనికులు !*
*ఎక్కడనుండి ఏ కొండ ఈనిందో తెలియదు వచ్చారు మిడతలదండులాగ మీదపడ్డారు. అదనుచూసి పదునైన కోలుకోలేని దెబ్బతీసి గుట్టలలోకి పారిపోయారు! వారి వెంటపడ్డారు కొందరు ఘోరీ సైనికులు !*
*సైన్యం అలా చీలి పోగానే గుట్టలలో ఇంకొక వైపునుండి మరొకబృందం మిగిలిన సైన్యాన్ని ఇదే తరహాలో చావుదెబ్బకొట్టింది! ఇలా బృందాలు బృందాలుగా వారు వస్తూనే ఉన్నారు!*
*ఈ విధమైన యుద్ధంలో గుట్టలలో కెళ్ళిన ఘోరీసైనికులు గుట్టలలోనే మట్టుబెట్టబడ్డారు !*
*లక్ష ఉన్న సైన్యం కాస్త ఘోరి, అతని అంగరక్షకదళం మాత్రమే మిగిలారు! ఒక్కసారిగా వెన్నులో చలి పుట్టింది వాడికి !*
*బ్రతుకు జీవుడా అంటూ మృత్యుభయంతో ప్రాణాలరచేతబట్టుకొని గాంధారం వైపు పరుగులుతీసి ఇల్లు చేరుకున్నాడు !!*
*మరి జీవితంలో బ్రతికి ఉండగా గుజరాత్ వైపు కన్నెత్తి చూడలేదు!*
*ఇదీ వీరనారి ‘నాయికిదేవి’ సాహసోపేతమైన వీరగాధ !.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment