Saturday, November 4, 2023

సాధన చతుష్టయం, నౌకాగ్ర కాకవత

 *ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *వివేకం, వైరాగ్యం, ఇంద్రియ నిగ్రహం, మోక్షం అనబడే ఈ నాలుగింటిని సాధన చతుష్టయం అంటారు.*
💖 *~వీటిని గుర్తెరిగి సాధన సాగిస్తే ‘బ్రహ్మ విచారణ’ కలుగుతుంది. సాధనా క్రమంలో అవరోధాలు ఎన్నో వస్తుంటాయి. వాటిని ‘నౌకాగ్ర కాకవత’ పద్ధతిలో అధిగమించాలని చెబుతారు ప్రాజ్ఞులు. ఇంతకీ ‘నౌకాగ్ర కాకవత’ అంటే ఏమిటీ*
❤️ *ఒకానొక నౌకాశ్రమంలో నావ ఒకటి సముద్రయానానికి సిద్ధంగా ఉంది.*

💞 *ఆ నావలో తెరచాప కట్టడానికి పొడవాటి కఱ్ఱ ఒకటి ఉంది. దానిపై ఒక కాకి వాలింది. ఇంతలో నావ బయల్దేరింది. ఈ విషయాన్ని కాకి గుర్తించలేదు. కాసేపట్లోనే నావ సముద్రంలో నాలుగు మైళ్ల దూరం వరకు వెళ్లిపోయింది. అప్పుడు కాకి దిక్కులు చూడటం మొదలు పెట్టింది. ఎక్కడికి వెళ్లాలన్నా చుట్టూ సముద్రం. కనుచూపు మేరలో తీరం కనిపించడం లేదు. కాకి ఎగురుతోంది. కొంత దూరం వెళ్లి మళ్లీ వచ్చి ఆ కఱ్ఱపైన వాలుతోంది. ఏం చేయాలో అర్థం కాక ఆ నావ అవతలి తీరం చేరే వరకూ ఆ కఱ్ఱ మీదనే కాకి అలాగే కూర్చుండిపోయింది.*
💓 *’బ్రహ్మ విచారణ’ చేయాలంటే వివేకం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కావాలి. వైరాగ్య చింతన ఏర్పడాలి. అప్పుడే మోక్షం వైపు అడుగులు పడతాయి. ఇవి జరగాలంటే సాధనలో వైక్లభ్యం కలిగించే అవకాశాలన్నింటినీ వదులుకోవాలి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే ఇంద్రియ సుఖాలు కలిగించే కొమ్మలపై వాలిపోయే అవకాశం లేకుండా చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అప్పుడు కలిగి మనసులో పరమాత్మ గురించి ఆలోచన మొదలవుతుంది. అక్కణ్ణుంచి వైరాగ్యం పుడుతుంది. చివరకు మోక్ష సాధనే లక్ష్యంగా బ్రహ్మవిచారణకు అవకాశం ఏర్పడుతుందా మనసులో.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*

No comments:

Post a Comment