200223j1726. 210223-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*కలౌ కపిః*
➖➖➖✍️
*కలి ప్రభవాన విపరీత, వైచిత్ర్య దృక్కులు గల మనుజునికూడా అనుగ్రహించి సమాధాన పరచగల భక్త సులభుడు, దయాళువు ఒక్కడే ఒక్కడు. ఆయనే మన ఆంజనేయస్వామి వారు.*
*అందుకే ‘కలౌ కపిః’ అన్నారు.*
*ఆంజనేయః పూజితశ్చేత్ పూజితస్సర్వ దేవతాః*
*హనుమన్మ హిమశక్యో బ్రహ్మణాపిన వర్ణితుం*
*బ్రహ్మదేవుడు కూడా వర్ణింపజాలని మహిమ హనుమన్మహిమ !*
*ఆయనను పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే.*
*రామాయణ మహాయఙ్ఞంలో రాముడు "యాజి" కాగా, సహకార్య నిర్వాహణ పరతంత్రుడైన శ్రీ ఆంజనేయస్వామి ఋత్విజుడయ్యాడు.*
*శ్రీ హనుమంతుడు ఒక మంత్రి ( సుగ్రీవునకు), సేనానాయకుడు (వానర సేనకు) సలహాదారుడు (విభీషణునకు అభయమిచ్చినప్పుడు), దౌత్య నీతివేత్త(హనుమద్రాయబారం), మహాసత్త్వుడు(వార్ధిలంఘనం), కార్యశీలి(సంజీవన పర్వత హరణం) , ఘనకార్యనిర్వాహణతంత్రయఙ్ఞుడు (అహిరావణుని బంది నుండి రామలక్ష్మణులను విడిపించుట), గొప్ప ఆర్ధిక శాస్త్రవేత్త(కోసలరాజు కోశాగారం నింపుట), ఆడిన మాట తప్పని సత్య శీలి(యయాతి రక్షణ), వినయశీలి (తనకన్న హీనసత్వులైన జాంబవాదుల గౌరవించుట), కర్తవ్యవిమూఢత నెఱుగని మహాతపస్వి(శ్రీ రామ దాస్యత్వం), సత్య సౌర్యధుని, స్థితి ప్రఙ్ఞుడు, కళానిధి, ప్రఙ్ఞాధౌరేయుడు.*
*తన జీవితమంతా ఇతరుల సేవలో వినియోగించిన నిస్స్వార్ధ జీవి! *
*ఆయన మనకు ఆదర్శప్రాయుడు, ఇదే హనుమ తత్త్వం. ఇదే హనుమద్ధర్మం. ఈ హనుమ తత్త్వాన్ని అవగాహన చేసుకుని, ఈ సద్గుణ సిద్ధికి నిత్య సాధకులమై, ఆయన మార్గాన మనోవాక్కాయ కర్మలచే చరించడమే సత్యమైన హనుమత్సేవ!*
*ఆ త్రిమూర్త్యాత్మకుని అనుగ్రహాన్ని పొందడానికి ఇదే ఏకైక సాధన.*✍️
🙏జై శ్రీరామ్🙏🏻
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
No comments:
Post a Comment