Saturday, November 11, 2023

****అలాగే మనిషి ఈ ప్రపంచం యొక్క ఆకర్షణల్లొ , బంధాల్లో .....

 చూడటానికి జ్ఞాని, అజ్ఞాని చేయుకర్మలు ఒకేలా వుంటాయి. 
అజ్ఞాని, నేను చేస్తున్నానని భావిస్తూ (కర్తృత్యము) ఫలితముల యందు ఆసక్తితో కర్మలను ఆచరిస్తూ, వాటి ఫలితాన్ని అనుభవించుటకు ఈ జన్మ చాలకపోతే ఇంకొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. దానినే ప్రారబ్ధకర్మ అంటారు. కర్మఫలితాలతో బంధము ఏర్పడుతుంది.

జ్ఞాని, ఆత్మస్థితి యందుండి, ఎటువంటి ఫలితములను ఆశింపకా దైవబుద్ధితో కర్మలు చేస్తాడు. అది యజ్ఞంగా, యోగంగా మారి బంధమును కలిగించదు. సాధనతో ఆత్మజ్ఞానము పొంది బంధాలనుండి విముక్తి పొందుతాడు.

ఈ కర్తృత్యమును మానవుడు అనవసరంగా తన నెత్తినవేసుకొని బాధపడుతున్నాడు. తను తెచ్చింది లేదు, వెంట తీసుకుపోతున్నది లేదు! తానూ పుట్టక మునుపు, మరణము పిమ్మట ఇదంతా ఎవరిదో? అది ఎవరో తెలుసుకొనుటకు సాధనచేయాలి! అప్పుడు బ్రహ్మాండమును నడుపువాడు దైవమని తెలుస్తుంది.

అతడినే పరమాత్మ అన్నారు విజ్ఞులు. అతని ప్రమేయంతోనే విశ్వముదయించిది. అతని అంశయే ఈ చరాచర జగత్తు. మానవుడు కేవలం నిమిత్తమాత్రుడు. మనతో పనులు చేయుంచునదియు అతడే. అతడే సూత్రధారి. అనంత కాలమును, అనంత సృష్టిని అతడే నడుపుతున్నాడు. ఇక డబై, ఎనభై యేళ్లు జీవించే మానవుడు తానె అంతా చేస్తున్నానని అనుకోవడము హాస్యాస్పదము.

కావునా "నా ఆత్మయే నీవు", "నాచే చేయిస్తున్నది నీవు" అన్న సంకల్పంతో కర్మలుచెయ్యాలని గీత సూచించింది. ఎవరి కర్మ శుద్ధముగా, పాపరహితముగా వుంటుందో అతడు ఎవరికీ భయపడ నవసరంలేదు. అందుకే మానవుడు ముందుగా నమస్కరించవలసినది కర్మకే (తస్మై నమః కర్మణే).

అయితే, బలవంతముగా మానవునిచేత కర్మలను చేయించేది ఏది? అన్న సంశయం కలుగుతుంది! కామమే (కోరికలు) మనుజులచేత బలవంతంగా కర్మలను చేయిస్తుంది. కామము తీరకపోతే క్రోధంగా(కోపంగా) మారుతుంది. కామాన్నే క్రోధమని చెప్పవచ్చు. ఇదే మానవునికి మహాశత్రువు, మహాపాపకారి. ధూళి అద్దమును కప్పేసినటులు కోపము మనుజుని జ్ఞానాన్ని కమ్మేస్తుంది.కామానికి ఆధారములు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి. ఇంద్రియముల కంటే బలీయమైనది మనస్సు. మనస్సు కంటే అత్యంత బలమైనది బుద్ధి.

అంటే, ఇంద్రియములను, మనస్సును అదుపులో పెట్టుకొని, బుద్ధితో ఆత్మను కనుగొని, జ్ఞానంతో పరమాత్మను చేరుకోవాలన్న మాట! ఎందుచేతనంటే మానవుడు ఏ యుగంలో పుట్టినప్పటికీ తనలో యున్న ఇంద్రియములు, మనస్సు, బుద్ధి యొక్క వికారములు మారలేదు. వీటి వికారముల వలన తనలో నున్న అఖండమైన ఆత్మశక్తిని కనుగొనలేక వివిధ కర్మలు చేస్తూ వాటి ఫలములు పొందుతూ, సుఖదుఃఖములను అనుభవిస్తూ, తుదకు మరణించి మరల జన్మించి ఈ భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ జన్మకర్మల తత్వమును పూర్తిగా అర్ధంచేసుకుని తదనుగుణంగా జీవించువాడు మరణానంతరము తిరిగి జన్మనెత్తడు.

జీవితం సముద్రం ఒడ్డున మెరిసే నీటి బుడగ లాంటిది.  నీటి బుడగ దూరం నుండి చూసినప్పుడు చాలా అందంగా కనబడుతుంది. తెల్లవారు జామున వచ్చే లేత సూర్య కిరణాలు దానిపై పడినప్పుడు ఏడు రంగుల ఇంధ్రధనస్సు ఏర్పడుతుంది ఆ ఇంధ్రధనస్సు యెక్క రంగులతో మెరిసిపోతుంది. ఇదంతా దూరం నుండి చూసినప్పుడు, కాని దగ్గరకు వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు అది పగిలిపోయి మాయమైపోతుంది. 

జీవితం కూడా అంతే నీటి బుడగ లాంటిది. దూరం నుండి చూసినప్పుడు చాలా అందంగా కనబడుతుంది. కాని జీవితం లోతుల్లోకి వెళ్లి చూస్తే మనిషి ఇంత ఆశలతో కోరికలతో తలమునకలై జీవిస్తుంటే మరణం అనేది వచ్చి అన్నిటిని కూల్చేసి జీవితం  అశాశ్వతమైనది నీటి బుడగలాంటిది అనే సత్యం ప్రకటిస్తుంది. దీనినే మృగమరీచిక అంటారు. 

దూరం నుండి అందంగా ఉండేవన్ని దగ్గరకు వచ్చాక సత్యం ప్రకటిటమయ్యాక అందంగా ఉండవు. అదంతా మన భ్రమ. అందుకే మనిషి జీవితం బురదలో కమలంలా ఉండాలి. దేన్ని ఆశించకుండా, అతిగా వెళ్లకుండా సమంగా ఉండాలి. ఏలాగైతే పువ్వులో మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద పువ్వుకు ఎలాంటి హాని చేయకుండా తీయదనాన్ని ఎలా రుచి చూస్తుందో  అలాగే మనిషి ఈ ప్రపంచం యొక్క ఆకర్షణల్లొ , బంధాల్లో చిక్కుకోకుండా స్థితప్రజ్ఞాతతో జీవించాలి. అలా కాకుండా కొన్ని తుమ్మెదలు పూలల్లో మకరందాన్ని ఆస్వాదిస్తూ తమని తాము మర్చిపోయి ఆ పువ్వు ముడుచుకున్నప్పుడు ఆ రెక్కల మధ్యల్లో పడి చచ్చిపోతాయి. 

చాలా మంది మనుషుల జీవితాలు కూడా అలాగే ఆకర్షణల్లో చిక్కుకొని మరణిస్తారు. జీవితమంటే తామరాకు మీద నీటి బిందువులా నిర్లిప్తంగా ఉండాలి. జ్ఞానోదయం పొందడానికి అదే తొలి అడుగు అవుతుంది.

ద్రౌపతి వస్త్రాపహరణం నుండి ఏమి తెలుసుకోవాలి?

ద్రౌపది మహారాణి. భర్తలు జూదంలో ఓడిపోయారు. వస్త్రాలు తీసేయడానికి సిద్దంగా ఉన్నారు. అక్కడ వేలమంది జనం చూస్తున్నారు. పాండవులు సామాన్యులు కాదు. భీముడికి వెయ్యి ఏనుగుల బలం ఉంది. ఒక్కొక్కరిని ఒక్క పిడికిలి దెబ్బతో చంపేయగల సమర్థవంతుడు. అర్జునుడిని మించిన విలుకాడు భూమండలంలో లేడు. బాణ వర్షంలో మొత్తాన్ని ముంచేసి యమపురికి పంపగలడు. అయినా అన్న మాటకి కట్టుబడి మిన్నకుండి పోయారు.

వస్త్రాలు లాగుతున్న కొద్దీ గుట్టలు గుట్టలుగా వస్తూనే ఉన్నాయి. అయినా దుర్యోధనుడికి అర్ధం కాలేదు. ఏక వస్త్రం కట్టుకున్న స్త్రీ నుండి ఎందుకు వస్తాయి అన్ని చీరలు? కనీసం ఆలోచన చేయలేదు. పాండవులకు దైవానుగ్రహం వలన దైవసాయం అందుతుందనే జ్ఞానం కాస్త కూడా లేదు. కారణం వాడు మూర్ఖుడు. 

అంతటి వీరులై ఎందుకు ఊరుకున్నారు? వస్త్రాలు అలా ఎందుకు వస్తున్నాయి? అని కాస్త అలోచించి ఉంటే అక్కడే ఆగిపోయేవాడు. వారి ధర్మం వారిని రక్షిస్తుంది అని తెలుసుకోలేక పోయాడు. నిండు సభలో ఆ దారుణాన్ని చూస్తూ ఉన్న ఎవరినీ ధర్మం వదిలిపెట్టలేదు. స్వచ్చంద మరణం ఉన్న భీష్ముడితో సహా మొత్తాన్ని మట్టిలో కలిపేసింది. 

ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే!
నువ్వెంత ధర్మంగా ఉన్నా, దైవానుగ్రహం ఉన్నా, సాక్షాత్తు దైవమే నీకు తోడున్నా మూర్ఖులు నిన్ను వదిలిపెట్టరు. వెంటాడుతూనే ఉంటారు. అయినా ధర్మంగా జీవిస్తే శాశ్వత ఆనందం పొందుతారు. మోక్షం సాధించగలుగుతారు.

ఇహలోక బంధాలు, వాటి వలన కలుగు సుఖములు గురించి అతిగా ఆలోచించడం వలనే మానవుడు మనశ్శాంతిని కోల్పోతున్నాడు. మనశ్శాంతి మానవుని సహజ సంపద. అది పుట్టుకతోనే ఉంటున్నది. కానీ వయసు పెరుగుతున్న కొలది 'నేను, నాది' అనే అహంకార, మమకార, అనురాగాలు పెంచుకోవడం మూలానా అది క్రమేపి తగ్గిపోతూ ఉంటుంది. ఫలితంగా మనిషి నిరంతరం ఏదో ఓ చింతతో బాధపడుతూ ఉంటుంటాడు. కడుపు నిండినంత చాలు ఆకలి తీరడానికి. అంతకు మించి ఎక్కువైతే మనకే ప్రమాదం. బంధుమిత్రులకు  చేయగలిగినంత చేయండి. వారి బుుణబంధ విముక్తికి అవి చాలు. ఈ బంధాలు గురించి ఎంత తక్కువుగా ఆలోచిస్తే అంత మనశ్శాంతి అన్న విషయం మరువకూడదు.
   
ఎంతటి గొప్పవారు అయిన ఎంతటి గొప్ప సాధకులు అయినాకూడా ప్రతిరోజూ సాధన ద్వారా ఆత్మ శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని పొందవలసి ఉంటుంది.  చాలామంది కొంతవరకు మాత్రమే సాధన చేస్తూ కొంత పేరు ప్రతిష్ఠలు వచ్చాక చుట్టూ చేరే వంది మాగధులు శిష్యులు ద్వారా వదిలించు కోవలసిన అహం అహంకారాలు మూట గట్టుకొని    మాయ ప్రపంచంలో జీవిస్తారు.

అందుకే వారు అనుకున్న అధ్యాత్మిక గమ్యాలు అగమ్య గోచరంగా మారుతాయి.

ఆధ్యాత్మికత సత్యాలు ఆచరించిన వారే వెదిగి పోయి ఒదిగి ఉంటారు.

నేను కనే ఈ ప్రపంచం, నా 'కల' ప్రపంచమేనా
నీవు నాతో ఉంటే ఇది నా ప్రపంచమే
కల కాదు కల కానీ నిజం
ఆ నిజమే ఆత్మతత్వం
నా ప్రయాణం ఆ తత్వం వైపు
 ఎన్నో జన్మల నిరీక్షణ ఈ జన్మలో నాకు దక్కింది
పూర్వాశ్రమ జ్ఞాపకాలు అన్నీ కూడా ఒక మేలుకొలుపులా
 గుర్తుకు తెచ్చి తత్వాన్ని బోధించి నీవే శరణమని 
గతి నీవే గమ్యం నీవే 
గురి నీవే వడి నీవే 
శరణ నీవే శరణం నీవే
 ఈ జగత్ స్వప్నం నుండి 
వాస్తవమైన ని ఆత్మ తత్వంలోకి చేర్చేది నీవు.

ఒక శిల్పి కొండలో ఉన్న రాయిని చూడడు. రాయిలో ఉన్న దైవాన్ని చూస్తాడు. తాను చూసిన దైవ రూపాన్ని తీసుకు రావడానికి రాయిలో అవసరం లేని దానిని మొత్తం చెక్కి , అవసరం ఉన్న దానిని ఉంచి దేవుని రూపాన్ని విగ్రహంగా  మలుస్తాడు. 

అదే సగటు మనిషి కొండలో ఉన్న రాయిని రాయి లాగే చూస్తాడు. 

ఆత్మ తత్వం అనుభవించిన ఆత్మ జ్ఞాని, సద్గురువుగా మారి తన శిష్యునికి ,తనలో ఉన్న ఆత్మ తత్వాన్ని తనకి చూడడం ఎలాగో నేర్పించి ,తనను తాను ఒక శిల్పిలా మార్చుకుని తనలో దైవత్వానికి అనువుగా లేని దుర్గుణాలను, మాలిన్యాలను తనకు తానే వదిలించుకునేలా నేర్పించి, తనను తానే రాయిలా ఉన్న తనను, తాను చెక్కకుని  ఒక శిల్పంలా మార్చుకుని, ఒక దేవునిగా మారే విధంగా చేయ గలడు సద్గురువు.

రెండవ విషయమేమంటే, *కర్మ లేదా జ్ఞానము యొక్క ఫలితం మంచిదైనా లేక సంతోషకరమైనది అయినా, కొంత తప్పిదానికి లేదా అపార్థం చేసుకునేందుకూ అవకాశం ఉంది.*
 ఎందుకంటే *హృదయం యొక్క రహస్యాలలోత మనము తెలుసుకోలేము కాబట్టి. సంతోష, పారవశ్యాలు సంపూర్ణమైనవి, లేదా సత్యమైనవి,*
 ఇతి బాధలు మాత్రం భ్రమే. కొందరు *జ్ఞానాన్ని తమ లక్ష్యంగా చేసుకొని నిశ్శబ్దంగా ఉండిపోతే, మరికొందరు మోక్షాన్ని ఆదర్శంగా తీసుకున్నారు.*

No comments:

Post a Comment