మహనీయులు 🙏
చాలామంది మహనీయులు ఈనాటికి ఎందరో ఉన్నారు. విద్యార్థన పదములు తమకు దారి దీపాలుగా నిలిచిన గురువులను ఆజన్మాంతము ఆరాధించుకుంటున్నారు. ఉదాహరణకు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఓసారి భారతరత్న విశిష్ట అతిథిగా తమిళనాడులో జరిగిన ఓ సభకు హాజరయ్యారు. అనుకోకుండా వచ్చిన పౌరుల్లో 90 ఏళ్లు పైబడిన వృద్ధుడు కనిపించారు. ఆయన తనకు రామనాథపురం ఉన్నత పాఠశాలలో పాఠాలు చెప్పిన ప్రధాన ఉపాధ్యాయుడని గుర్తుపట్టారు. వెంటనే తన గురువును వేదికపైకి పిలిపించారు. స్వయంగా ఆయనను తోడుకొని వచ్చి తన ఉన్నతాసనంలో కూర్చోబెట్టి పాదాభివందనం చేశారు. నేను
నాలాంటివాళ్లు ఇంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నారంటే దానికి కారణము కేవలం ప్రాథమిక ఉన్నత పాఠశాల అధ్యాపకులే. వారు వేసిన విద్య అనే బీజం ఈస్థాయికి తీసుకొని వస్తుంది అన్నారు. మాజీ ప్రధాన ఉపాధ్యాయులవారు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతిగారు వచ్చారంటే చూడటానికి మాటలు వినటానికి వచ్చాను నాకు తెలియదు, నా విద్యార్థి అని. ఇప్పుడు నేను తెలుసుకున్నాను నాకు చాలా గర్వంగా ఉంది, నాదగ్గర చదువుకున్న విద్యార్థి ఈ స్థాయికి ఎదిగాడని కన్నీరు పెట్టారు
No comments:
Post a Comment