Wednesday, November 29, 2023

మన దివ్యత్వాన్ని ఎలా గుర్తిస్తాం? ఆత్మతో సంపూర్ణంగా ఏకం కావటమెలా?

🔺 *పత్రీజీ సమాధానాలు* 🔺
🌹 *చాప్టర్ -- 5 :---  ఆధ్యాత్మిక శాస్త్రం* 🌹
 🌷 *Part --24*🌷

🍁  *ప్రశ్న :--- మన దివ్యత్వాన్ని ఎలా గుర్తిస్తాం? ఆత్మతో సంపూర్ణంగా ఏకం కావటమెలా?* 

🍀 *పత్రీజీ :--*- రెండే రెండు అంశాలు ఉన్నాయ. అవేమిటంటే... భౌతికత, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అందరినీ కలుపుకుపోతుంది. భౌతికత అందరినీ విడదీస్తుంది. మీ దేహం వేరు, నా దేహం వేరు. మీ మనస్సు వేరు, నా మనస్సు వేరు. కానీ మనందరి ఆత్మ ఒక్కటే! 

🌿 మన అందరి శరీరం - మనస్సు స్థాయిల్లో వేర్వేరుగా ఉన్నాం. మన శరీరం మనస్సు అనేవి' మన సంస్కృతి, సమాజం చేత ఏర్పడ్డాయి. మన ఆత్మ అనేది దివ్యమైనది. మనందరి దివ్యత్వ మూలం ఒక్కటే. మన శరీరం - మనస్సుల మూలాలు రకరకాలు. కానీ మీ ఆత్మ యొక్క మూలం, మరి నా ఆత్మ యొక్క మూలం ఒక్కటే. 

🌳 ఆత్మానుసంధాన ప్రక్రియలో మనమంతా కలుస్తాం. ఏకం అవుతాం. కనుక భిన్నత్వం అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ మనమంతా దాన్ని అధిగమిస్తాం. ఒక శిశువు యువతగా మారటం సహజం. శిశువు ఎప్పటికీ శిశువుగానే ఉండదు. శిశువు ఎదుగుతూ ఉంటుంది. ఆత్మ కూడా పరిణామం చెందుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ శరీరం మనస్సులతో బంధరాహిత్యంలో ఉంటుంది. శరీరం - మనస్సు నుంచి ఆత్మ ముక్తి పొందాలి. 

🌸 నేను నా వర్తమాన కాలాన్ని మీతో స్నేహం చెయ్యటానికి ఎలా ఉపయోగిస్తున్నానో చూడండి. నేను ఇక్కడ బెంగళూర్లోనే ఉండి పాకిస్తాన్లో ఉన్న మీతో మాట్లాడుతున్నాను.. ఇలా నా భవిష్యత్ ను సృష్టించుకుంటున్నాను. నేను మీతో మాట్లాడకుండా ఉండటాన్ని ఎంచుకుని వుండవచ్చు లేదా ప్రొద్దున్నే లేవకుండా పడుకుని ఉండవచ్చు. కానీ ఉదయాన్నే లేచి మీతో ఎందుకు మాట్లాడుతున్నాను? నా సమయాన్ని మీకోసం ఎందుకు వెచ్చిస్తున్నాను? ఎందుకంటే నాకు బంగారు భవిష్యత్ కావాలని నేను ఎంచుకున్నాను. నాకు మీతో మైత్రి కావాలి. మరి ఇప్పుడు నా సమయాన్ని మీకు ఇవ్వకపోతే మీ స్నేహం భవిష్యత్లో నాకు ఉండదు. 

🏵️ ఈనాటి మాటలు మీరు ఎప్పటికీ మరిచిపోరు కదూ! మీరెప్పుడైనా ఇండియా వస్తే మా ఇంటిని సందర్శించమని ఆహ్వానిస్తాను. ఇది చక్కని భవిష్యత్కు నాంది పలుకుతుంది.

No comments:

Post a Comment