2801. 2-4. 090323-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*భార్యాభర్తల బంధం…*
*స్వర్గతుల్యం కావాలంటే..*
➖➖➖✍️
*భార్యాభర్తల అనుబంధం గురించి కొన్ని అమృత వాక్యాలు మీకోసం...! *
**నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.*
**తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ... తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.*
**అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.*
*అహంకారి భార్య దొరికితే అంబానీ అయినా సన్యాసంలో కలవాల్సిందే.*
**ప్రతి భర్త తన భార్యను... మరో తల్లి రూపంగా భావిస్తే.. ప్రతిభార్య తనభర్తను, మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ... ఎప్పటికీ...!*
**భార్యకు సేవ చేయడం అంటే.. బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం! బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.*
**సంసారం అంటే కలసి ఉండడమే కాదు. కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కడవరకూ తోడు వీడకుండా ఉండడం.*
**ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడు ఏమో కానీ, అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని, మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.*
**భార్యాభర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు. మధ్యలోనే పోతారు.*
*భార్యకి భర్త శాశ్వతం. భర్తకు భార్య శాశ్వతం.*
**ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ, గొప్పవిద్యావంతురాలి కిందే లెక్క...!*
**అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు. భార్య లేకుంటే ఆజన్మకు అర్థం లేదు.*
**మోజుతీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం. ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది 'మాంగల్య బంధం'.*
*బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.*
**మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ, తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.*
**కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా... సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.*
**నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే. నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.*
**ప్రేమ అనేది చాలా విలువైనది. దాన్ని 'వివాహం' అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.*
*సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం - కుటుంబం.*
*గొడవ పడకుండా ఉండే బంధం కన్నా...ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.*
**పెళ్లి అనేది అందమైన పూలవనం లాంటిది. ఆ వనంలో మనం నాటే చెట్లు అందమైన పువ్వులనిస్తాయి.*
**వివాహ వార్షికోత్సవం అంటేప్రేమ, విశ్వాసం, భాగస్వామ్యం, సహనం, ఓర్పు ల సంగమాన్ని పండుగ చేసుకోవడమే.*
**నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపును ముద్దగ తడిపెను తుంటరి జలకాలు!!*
**సప్తపది ఏడు అడుగులు…. మొదటి అడుగు - అన్న వృద్ధికి! రెండవ అడుగు - బలవృద్ధికి! మూడవ అడుగు - ధన వృద్ధికి! నాల్గవ అడుగు - సుఖవృద్ధికి! ఐదవ అడుగు - ప్రజాపాలనకి! ఆరవ అడుగు - దాంపత్య జీవితానికి. ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి!*
**కోరుకున్న ఇంతి... నేడు నీ సతి! నేడు పట్టుకున్న ఆమె చేయి...విడవకు ఎన్నటికీ!*
**వివాహాన్ని సుఖమయం చేసుకోవడానికి మీరెంత పొందికగా ఉన్నారనేది కాదు. పొందిక లేని విషయాలను మీరెలా సర్దుకుంటున్నారనేది ముఖ్యం.*
**కలిమి లేములతో...*
*కలసిన మనసులతో...*
*కలివిడిగా మసలుకో..*
*కలకాలం సుఖసంతోషాలు పంచుకో..!*
**బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది. పొరపాటు అనేది అందులో ఒకపేజీ మాత్రమే. ఆఒక్కపొరపాటు జరిగితే సవరించాలి కానీ..మొత్తం పుస్తకాన్ని చించివేయకూడదు.*
**మగవాడు గాలి పటం*
*(అందని ఎత్తులకు ఎదగడం తెలుసు, కానీ తనను తాను నియంత్రించుకోవడం తెలీదు)*
*ఆడది దారం, అతడికి ఆధారం!*
*(ఆమెకు వెన్నంటి ప్రోత్సహించడం తెలుసు, కానీ ప్రతిభను పదిమందికి ప్రదర్శించడం తెలీదు)*
*విడివిడిగా దేనికీ విలువ లేదుఒకటైతే ఇద్దరికీ తిరుగులేదు.*
**భర్తకి భార్య బలం కావాలి!
*బలహీనత కాకూడదు!!*
*భార్యకి భర్త భరోసా కావాలి!*
*భారం కాకూడదు!!*
*భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి!
*అయోమయం కాకూడదు.*
*మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు.*
**అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే!*
**పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా, కష్టం- సుఖం గురించి మాత్రమే కాదు. ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.*
**ప్రతీ అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం. కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం అనుకుంటుంది భార్య.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment