Tuesday, November 7, 2023

ఖరీదైన వాడకంతో ప్రదర్శించే బదులు....

 1901.    2-8.    160223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀771.
నేటి…

              *ఆచార్య సద్బోధన:*
                 ➖➖➖✍️

                 *సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రసిద్ధ ఫుట్ బాల్ క్రీడాకారుడు ఇతను, పేరు: ‘ఎస్ ఎం సెనెగల్,’ వయసు 27ఏళ్ళు.* 

*భారతీయ కరెన్సీలో    ఇతగాడి సంపాదన వారానికి కోటి నలభై లక్షల రూపాయలు ఉంటుంది.*

*కానీ ఎన్నోసార్లు ఇతను స్క్రీన్ విరిగిన ఫోన్ చేత్తో పట్టుకుని కనిపించాడు.*

*ఒక ఇంటర్వ్యూలో ఆ ఫోన్ విషయమై అడిగితే దానికి అతను ఇచ్చిన జవాబు: ‘రిపేర్ చేయిస్తాను.’*

*కొత్త ఫోన్ తీసుకోవచ్చుగా అంటే : ‘ఇటువంటి ఫోన్లు పదివేలు కొనగలను, 10 ఫెరారి కార్లు కొనగలను, 2జెట్ విమానాలు కొనగలను,  వజ్రాలు పొదిగిన గడియరాలు కొనగలను, కానీ అవసరం ఏముంది?’*

*’బీదరికాన్ని చూసి,   బీదరికంలో పెరిగాను.    దాంతో   చదువుకో లేక పోయాను,    అందుకే పిల్లలు చదువుకునేందుకు స్కూళ్లు కట్టించాను, నాదగ్గర వేసుకునేందుకు బూట్లు కూడా ఉండేవికావు. అలాగే ఆడేవాడిని, మంచి బట్టలు ఉండేవికావు. తినడానికి తిండి ఉండేది కాదు. ఇవాళ  నాదగ్గర ఇంతఉంది  అంటే దానిని ఖరీదైన వాడకంతో ప్రదర్శించే బదులు నావాళ్లకు పంచగలిగితే ఉపయోగకరం కదా!’*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment