Friday, November 17, 2023

ప్రాచీన సంస్కృతిని మరువవద్దు!

 *Sri Sathya Sai Seva Organizations, Andhra Pradesh*
https://ssssoap.org

*భగవాన్ శ్రీసత్యసాయి ఉవాచ!!*
🗓️  17-11-2023      

*ప్రాచీన సంస్కృతిని మరువవద్దు!*

🌸🌼 *భగవాన్ ఉవాచ!!* 🌸 🌼

🌹🌹 *"ఎక్కడికి వెళ్ళినప్పటికినీ, మీ కల్చర్ ను మీరు వదులుకోకూడదు.   మీ యొక్క సంస్కృతిని మీరు మానకూడదు" అనేటువంటిది పాశ్చాత్య దేశముల నుండి ఈ దేశమునకు వచ్చి చాటవలసి వచ్చింది.  ప్రతి దేశమునుండి వచ్చినటువంటి వారు కూడను వారి సంస్కృతిని, వారి సాంప్రదాయాన్ని చక్కగా ప్రకటిస్తూ వచ్చారు.*  

*కానీ, మన వారు బయటి దేశానికి పోతే మన ప్రాచీన సాంప్రదాయాన్ని మర్చిపోతారు.  ప్రాచీన సాంప్రదాయాన్ని మర్చిపోయినా ఫరవాలేదు, అసలు మన దేశము యొక్క భాషనే మర్చిపోతారు.  ఏమిటి ఇదంతా?  ఇంతకాలము పెరిగి, ఇంత దేశములో ఉంటుండి, ఇంత అభివృధ్ధి పొంది, ఒక్క పది దినాలలో, ఒక్క నెల లోపల అమెరికాకు పోయిందంటే, అమెరికా భాష వస్తుంది వీళ్ళకు.  ఎంత మందియో మన భారత దేశమునుండి వచ్చినటువంటి పిల్లలు వెనక్కు వచ్చిన తర్వాత, ఏం నాయనా ఏం చదువుతున్నావు? అని మీరు ప్రశ్నిస్తే, I DON'T KNOW TELUGU..నాకు తెలుగు తెలియదు అంటాడు.  ఇక ఏమిటి వీడికి తెలిసినటువంటిది? పిండాకూడు.  ఏమిటి తెలిసింది వీడికి?*  

*తల్లి భాషనే మర్చినటువంటివాడు, రేపు తల్లినే మరచడా?  ఈ నాడు భాషను మరిచాడు, రేపు తల్లిని మరుచుతాడు.  అందువలననే, రాముడు చెప్పాడు, "జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపి గరీయసి".  కనుకనే, నీవు ఎక్కడకు పోయినప్పటికిని, నీ ప్రాచీన సాంప్రదాయాన్ని నీవు మార్చుకోకుండా ఉంటుండాలి.*

(భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యోపన్యాసము ది. 11-07-1995 నుండి)

No comments:

Post a Comment