🔺 *పత్రీజీ సమాధానాలు* 🔺
🌹 *చాప్టర్ -- 5 :--- ఆధ్యాత్మిక శాస్త్రం* 🌹
🌷 *Part --1*🌷
🍁 *ప్రశ్న :--- ఆత్మ అంటే ఏమిటి?*
🍀 *పత్రీజీ :---* ఆత్మ అంటే శక్తి, చైతన్యం మరి జ్ఞానం అనే మూడింటి కలయిక యొక్క ఒకానొక అంశ.
🔸 *ECW :---* E అంటే Energy, శక్తి; C అంటే Consciousness చైతన్యం, W అంటే Wisdom జ్ఞానం.
🌳 ఆత్మ అంటే శక్తి, చైతన్యం మరి జ్ఞాన సముదాయంలోని ఒకానొక శకలం అని చెప్ప వచ్చు. ఆధ్యాత్మికత గురించి... మాట్లాడుతున్నాం అంటే మరి మనం ఆ మూలం గురించి... హృదయం గురించి అదే ఆత్మ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట !
🍁 *ప్రశ్న :--- హృదయం మరి ఆత్మకు మధ్య గల వ్యత్యాసం ఏంటి?*
🌸 *పత్రీజీ :---* హృదయం అని మాట్లాడుతున్నాం అంటే అదేదో ఊపిరితిత్తులు లేదా మూత్ర పిండాల్లాగా భౌతికమైన అవయవం అని కాదు. ఇక్కడ హృదయం అంటే కేంద్రం అని అర్థం. పదార్థం యొక్క కేంద్రాన్ని హృదయం అంటాం. హృదయ పూర్వకమైన ప్రసంగం అంటే మీ అంతర కేంద్రం నుంచి సాదరంగా మాట్లాడటం అన్నమాట. ఆత్మ అన్నది ఆధ్యాత్మికత యొక్క హృదయం... ఆధ్యాత్మికత యొక్క మూల కేంద్రం. అన్నింటి యొక్క మూలం ఆత్మే. ఆత్మ లేదంటే ఆధ్యాత్మికత అన్నదే ఉండదు. ఆత్మ లేకుండా ఆధ్యాత్మికత లేదు. ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మ గురించి కూడా మాట్లాడతాం. ఎందుకంటే ఆధ్యాత్మికత యొక్క హృదయమే ఆత్మ.
No comments:
Post a Comment