Monday, November 6, 2023

భగవద్గీత చదవటానికి ఒక పద్ధతి ఉంది ....ఇంట్లో భగవద్గీత ఉండీ దాన్ని తాకని ప్రతి వాళ్లూ ఇది ఆలోచించాలి....

 *సత్సంగం*

భగవద్గీత చదివిన వాళ్ళకి తప్పకుండా వైరాగ్యం వస్తుంది

వైరాగ్యం అంటే
 లేని దానికోసం పరుగులు తీయకపోవడం,
ఉన్నదానితో సంతృప్తి చెందటం,
ఉంది కదా అని అనవసరమైనవి అనుభవించాలి అనే బుద్ధిని కలిగి ఉండకపోవటం,
ఇంకా కావాలి అనే ఆశని కలిగి ఉండకపోవటం

భగవద్గీత చదవటానికి ఒక పద్ధతి ఉంది 
తోటలోకి వెళ్లి మామిడి పళ్ళని తెచ్చుకోవటంతో దీన్ని పోల్చవచ్చు
 ముందు మామిడి చెట్టు బోదెను పట్టుకుని ఊపితే పండిన పళ్ళన్నీ నేల మీదకు రాలుతాయి
 తర్వాత ఒక్కో పెద్ద కొమ్మనీ పట్టుకుని ఊపితే
 పండిన మరికొన్ని పళ్ళు రాలుతాయి 
ఆ తర్వాత పెద్ద కొమ్మలకి ఉన్న చిన్న కొమ్మలని 
ఒక్కోదాన్నీ ఊపితే 
ఇంకొన్ని మామిడిపళ్ళు రాలుతాయి 
చివరిగా ఆకుల చాటున దాగి ఉన్న పళ్ళను వెతికితే ఇంకొన్ని పళ్ళు లభిస్తాయి

ఇలాగే భగవద్గీత ని మామిడి చెట్టు బోదెను ఊపినట్టుగా మొత్తం 18 అధ్యాయాలు చదవాలి
 తర్వాత ప్రతి పెద్ద కొమ్మనీ ఊపినట్టుగా ప్రతి అధ్యాయాన్నీ పరిశీలనగా చదవాలి 
ఆ తర్వాత చిన్న కొమ్మలన్నిటినీ ఊపినట్టుగా ప్రతి శ్లోకాన్నీ దీక్షగా చదవాలి
 చివరగా ఆకుల చాటున దాగిన పళ్ళను కోసినట్టుగా 
ప్రతి శ్లోకంలోని ప్రతి పదానికి అర్థం వెతుకుతూ చదవాలి
 అప్పుడు భగవద్గీత బాగా బోధపడుతుంది

ఒక గమ్యం చేరటానికి
ఒక బస్సుకి టికెట్ కొన్నాం
 అప్పుడు ఆ బస్సుని ఎక్కుతామా లేక దాన్ని వదిలేస్తామా
అలాగే *మన పుస్తకాల అలమారలో భగవద్గీత ఉన్నప్పుడు దాన్ని అలాగే ఉంచాలా*
 *లేక పారాయణ చేసి అనుసరించాలా* 
ఇంట్లో భగవద్గీత ఉండీ దాన్ని తాకని ప్రతి వాళ్లూ ఇది ఆలోచించాలి

No comments:

Post a Comment