Tuesday, November 7, 2023

*****అందుకే వాల్మీకి- ‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’ అని రామాయణ మహాకావ్యంలో అంటాడు.

 250223a1844.   260223-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀781.
నేటి…

           *ఆచార్య సద్బోధన:*
              ➖➖➖✍️

               
*సారథి వంటి మనిషి ‘ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాల’ని అంటారు మహర్షులు.*

*1. మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి.*

*2. చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది.*

*3. కళ్లు అశ్లీలాన్ని చూస్తాయి.*

*4. నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది.*

*5. ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది.*

*6. మల, మూత్రద్వారాలు పనిచేయకుండా పోతాయి.*

*7. కాళ్లూ చేతులూ హింసను ఆచరిస్తాయి.*

*8. మాట అదుపు తప్పుతుంది.*

*ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే,*

*9. మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు.*

*అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే!*
*మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి.*

*అందుకే వాల్మీకి- ‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’ అని రామాయణ మహాకావ్యంలో అంటాడు.*
      
*చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

No comments:

Post a Comment