*ॐశ్రీవేంకటేశాయ నమః*
💝💝 *ఫిలాసఫీ ప్రొఫెసర్ తన తరగతిగదిలో బల్లమీద కొన్ని వస్తువులతో నిలుచున్నారు. విద్యార్థులు మౌనంగా చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నారు.*
❤️ *కొన్ని క్షణాల తర్వాత ఆయన తెచ్చిన వస్తువుల్లోంచి ఓ పెద్ద ఖాళీ గాజుజాడీని, కొన్ని గోల్ఫ్ బంతులని బయటకి తీసారు. గోల్ఫ్ బంతులని ఒక్కొక్కటిగా జాడీలోకి జారవిడిచారు. క్లాసంతా నిశ్శబ్దం.*
💕 *’జాడీ నిండిందా ?’ అని అడిగారు ప్రొఫెసర్.*
💞 *పూర్తిగా నిండిందన్నారు విద్యార్థులు. అప్పుడా ప్రొఫెసర్ తను తెచ్చిన గులకరాళ్ళ కవరు విప్పి, వాటిని కూడా జాడీలో జారవిడిచారు. జాడీని కొద్దిగా కదిలించారు. గులక రాళ్ళన్ని గోల్ఫ్ బంతుల మధ్యకి, అట్టడుగుకి వెళ్లిపోయాయి.*
💓 *’జాడీ నిండిందా ?’అని అడిగారు ప్రొఫెసర్. పూర్తిగా నిండిందన్నారు విద్యార్థులు.*
💖 *ప్రొఫెసర్ తనతో తెచ్చుకున్న ఒక చిన్న పొట్లంలోంచి ఇసుకని తీసి జాడీలో పోశారు. అది జాడీలోలోపలికి జారిపోయింది. క్లాసంతా ఒక్కసారిగా నిశ్శబ్దం.*
💖 *’జాడీ నిండిందా ?’ అని విద్యార్థుల్ని ప్రొఫెసర్ అడిగారు. నిండింది !నిండిందన్నారు విద్యార్థులు ఒకేగొంతుతో*
❤️ *ప్రొఫెసర్ అప్పటి దాకా మూత పెట్టి ఉన్న రెండు కాఫీకప్పులని దగ్గరికి తీసుకున్నారు. వాటి మీది మూతలను తీసి, కాఫీని జాడీలో పోశారు. ఇసుక రేణువుల మధ్య ఉండే ఖాళీ స్థలంలోకి కాఫీ జారుకుంది. విద్యార్థులు విరగబడి నవ్వారు.*
💞 *వాళ్ల నవ్వులన్నీ ఆగాక ఆ ప్రొఫెసర్ “మీ జీవితాలను ఈ జాడీ ప్రతిబింబిస్తున్నదని గ్రహించండి” అన్నారు.*
💖 *”గోల్ఫ్ బంతులు ముఖ్యమైనవి!*
💕 *~దేవుడు, మీ కుటుంబం, మీ అరోగ్యం, మీ స్నేహితులు, మీకింకా అత్యంత ప్రీతిపాత్రమైన అంశాలు! మీ సిరిసంపదలన్నీ పోయినా, ఇవి మీతో ఉంటే మీ జీవితం పరిపూర్ణంగా ఉన్నట్లే !*.
💞 *’గులక రాళ్ళు’ మీ ఉద్యోగం, సొంతిల్లు, కారు వంటివి !*
💓 *’ఇసుక’ అన్ని చోట్లా ఉండే చిన్నా , చితా విషయాలు!*
💖 *జాడీని ముందుగా ఇసుకతో నింపితే గోల్ఫ్ బంతులకీ, గులక రాళ్ళకీ అందులో చోటుండదు! జీవితంలో కూడా ఇంతే!*
💞 *మనం ఎప్పుడూ అంతగా అసలే ప్రాధాన్యతలేని చిన్న చిన్న విషయాలకి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ,ముఖ్యమైనవాటిని విస్మరిస్తూంటాం.*
💓*మీకూ,మీ వాళ్లకూ సంతోషం కలిగించే విషయాలపైన్నే దృష్టి నిలపండి. మీ పిల్లలతో హాయిగా ఆడుకోండి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అప్పుడప్పుడు మీ జీవిత భాగస్వామిని బయటకి డిన్నర్‌కి తీసుకెళ్ళండి. 18 ఏళ్ల వయసులో మీరెలా ఉన్నారో, అలాగే అంతే ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపండి.*
💕*ఇంటిని శుభ్రంచేసుకోడానికి, నిరూపయోగమైన వాటిని వదుల్చుకోడానికి ఎప్పుడూ సమయం ఉంటుంది. గోల్ఫ్ బంతుల వంటి ముఖ్యమైన అంశాలపై ముందుగా దృష్టి పెట్టండి. ప్రాధాన్యతలను నిర్ణయించుకోండి ఇక మిగిలేదంతా ఇసుకే.”*
💖 *”సర్..! మరి కాఫీ దేనికి ప్రతిరూపం?" ఒక విద్యార్థి అడిగాడు.*
💞 *”శభాష్, ఈ ప్రశ్న అడిగినందుకు నాకు సంతోషంగా ఉంది. మీ జీవితం దేనితో నిండిపోయినప్పటికీ ఒక మంచి మిత్రుడితో ఓ కప్పు కాఫీకి ఎప్పుడూ అవకాశముంటుంది" అనిప్రొఫెసర్ క్లాస్ ముగించారు.*
Ⓒ❤️ *ॐశ్రీవేంకటేశాయ నమః*
💕*~సకల జనుల శ్రేయోభిలాషి,*
*శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి*
No comments:
Post a Comment