*Class-10 day*
రెండవ అధ్యాయం 14వ శ్లోకంలో అనిత్యములైన సుఖ, దుఃఖాల సహింపుము.
నువ్వు ఎందుకు మరణించిన మరణించబోయే వారి గురించి దుఃఖ్ఖిస్తావు. దేహము పడిపోయిన జీవాత్మ చనిపోదు కేవలం చనిపోయేది, పడిపోయేది శరీరం మాత్రమే. కానీ శరీరము ఏమీ చేయలేదు. జీవాత్మ శరీరంలో లేకుండా ఆ శరీరం ఒక్కటే ఏమి చేయలేదు.
ఎవరైనా చనిపోతే గనుక దుఃఖం ఎందుకు కలుగుతుందంటే వారు ఎన్నాళ్ళో మనతోనే కలిసి జీవించి ఉంటారు. మనతో సరదాగా జీవితాన్ని గడిపి ఉంటారు. మనల్ని నవ్వించుంటారు, ఏడిపించి ఉంటారు, నాతో సరదాగా ఉండిండిరి అన్నటువంటిది తలుచుకుని మరీ ఏడుస్తూ ఉంటారు. ప్రాణం లేని ఆ శరీరము ఇంతకుముందు లాగే లేచి నిలబడి నవ్వించడం, ఏడిపించడమో, సరదాగా ఉండటం చేయలేదు. ఎందుకని ఆ శరీరంలో అవన్నీటిని ఇన్నాళ్లు నిన్ను నవ్వించిన వాళ్ళు, ఏడిపించిన వాళ్ళు, సరదాగా గడిపిన వాళ్ళు, నీతో కలిసి జీవించిన వాళ్ళు ఆ శరీరంలో ఈ ప్రస్తుతానికి లేరు. ఆ శరీరంలో ఆ యొక్క జీవాత్మ ఉన్నప్పుడే ఆ శరీరమును ఉపయోగించుకొని ఆ జీవాత్మ ధరించినటువంటి దేహానికి మాత్రమే పతనం ఉంటుంది.
ధర్మాలు అన్నీ కూడా అంటే ఎదగడం, మార్పు చెందడం, నశించడం. ఇక్కడ శరీరంలో ఉన్నంతవరకే ఆ దేహానికి దాని వలన చలనం వస్తుంది అది పనిచేస్తుంది.
అదేవిధంగా జీవాత్మ దేహం నుండి విడిపోయిన తర్వాత ఇంకొక దేహాన్ని తీసుకుంటూ ఇంకొక దేహాలు తీసుకొని తర్వాత యవ్వనాన్ని ఒక పొందుతుంది. అదేవిధంగా వృద్ధాప్యాన్ని పొందుతుంది, మరణానికి చేరుపోయి మళ్లీ పునః ప్రారంభం చేస్తుంది. మరణించడం కూడా అంటే దేహం నుంచి విడిపోయి ఇంకొక దేహాన్ని తీసుకోవడం కూడా ఇంకొక స్టేజ్ మాత్రమే. అది ఈ జన్మలో సంపాదించుకున్న సంస్కారాలు చేత అనువైనటువంటి దేహాన్ని, ఏ దేహంలో అయితే పాప పుణ్యం ఇప్పుడు చేసుకున్న అనుభవించడానికి వీలుగా ఉంటుందో అటువంటి దేహాన్ని వెతుక్కుంటుంది. కనుక ఈ యొక్క నువ్వు ఎవరి గురించి ఏడుస్తున్నావో వారుకి చావు లేదు. ఎందుకంటే వాళ్ళ శరీరం మాత్రమే పతనం అయిపోతుంది.
ఎందుకు మనం ఏడవకూడదు అంటే చూడండి.. శరీరం అనేది ఇరవై నాలుగు సంఖ్యతో కూడినటువంటి 24 తత్వములు మరియు దానికి సాక్షి అయినటువంటి ఆత్మ గురించి బోధించినటువంటి అధ్యాయం. అంటే 24 ప్రకృతి తత్వముల చేత ఈ భౌతిక వస్తువులు ఏర్పడ్డాయి. మన శరీరం కూడా ఈ యొక్క భౌతిక వస్తువుల యొక్క ధర్మం ఏంటంటే మార్పు చెందడం, పెరగడం, కృషించిపోవడం, నశించి పోవడం. ఇక్కడ ఈ శరీరము మీ జ్ఞానేంద్రియాలు ఏ విషయంలో అయితే అందుతాయో నువ్వు ఈ లోకంలో జ్ఞానేంద్రియాలుతో ఏ విషయాలనైనా చూడండి ఆ విషయాలు ఇంద్రియ విషయాలు మనస్సుకు సుఖాన్ని దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి.
మన కళ్ళతో ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూస్తే కనుక మనకు సంతోషం కలుగుతుంది. మన మనసుకు సుఖం కలుగుతుంది. అదే ఒక భయంకరమైనటువంటి దృశ్యాన్ని చూస్తే అదే మన శరీరానికి మన చర్మానికి నొప్పి కలిగించే స్పర్శ తగిలితే మనసుకు దుఃఖం కలుగుతుంది. విషయాల వల్ల మనసులో సుఖము దుఃఖము కలుగుతుంది.
విషయ వస్తువులు, ప్రపంచక విషయాలన్నీ కూడా మన మనసులో సుఖదుఃఖాలను కలిగిస్తాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే ఇవన్నీ కూడా అంటే ఇంద్రయాలకు అందే ఏ విషయమైనా సరే ఉత్పత్తి వినాశనములు కాబట్టి వస్తువులు కూడా అవి వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. ఏ వస్తువులు కూడా అవి మీ జీవితంలో ఏదో ఒకటి కలిగించేవే.
ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి ఈ భౌతిక వస్తువులు కలిగించే సుఖముగానీ దుఃఖముగానీ చాలా పరిమితంగా ఉంటుంది. చాలా అశాశ్వతంగా ఉంటుంది. చాలా కొద్దికాలం మాత్రమే ఉంటుంది. ఇవి అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఎలాగంటే మీరు బాగా వేడినీళ్లు తీసుకోండి కొంతసేపట్లోనే ఉష్ణము తగ్గిపోయి శీతలంగా మారుతుంది. అదే ఒక మంచి ఐస్ వాటర్ ను తీసుకొని బాగా ఎండలో ఉంచితే కనుక కొంచెం సేపు లోనే ఆ సీతలత్వం కరిగిపోయి ఉష్ణానికి అంటే తన అస్థితిని మార్చుకుంటుంది. అంటే ఏ విధంగా చల్లదనం గాని వేడి గాని వాటి ప్రభావం కొంతసేపు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే భౌతిక వస్తువు యొక్క ధర్మమే అలాంటిది. అదే విధంగా మనకు గనుక బాహ్య విషయాలను బాధ వస్తువులతో కానీ మనుషులతో గాని ఏ వస్తువుతో గాని వాటి వల్ల కలిగే సుఖదుఃఖాలు ఎంతసేపు ఉంటాయి అంటే ఏ విధంగా వేడి కొంత సేపట్లో చల్లారిపోతుందో ఏ విధంగా చల్లదనం కొంతసేపట్లోనే వేడెక్కిపోతుందో అంతసేపు మాత్రమే ఉంటాయి. దీన్ని మనము ఏమి చేయలేము. నివారించలేము. అది భౌతిక వస్తువు లేక ధర్మం అలాంటిది కాబట్టి వీటిని తగ్గించవలసింది అంటారు. అంటే ఏంటి అంటే ఎవరో చనిపోయారని విపరీతమైనటువంటి దుఃఖంతో ఏడుస్తున్నావు. ఈ దుఃఖాన్ని సహించు అని భగవంతుడు అంటున్నాడు.
ఎందుకు సహించాలి ఎందుకంటే నీవు జీవితాంతం ఏడుస్తూ ఎంతటి వారినినైనా ఎంత ప్రేమించినా వ్యక్తులైన ప్రాక్టికల్గా మనం ప్రశ్నించుకుంటే వారు చనిపోయిన తరువాత ఎంత సేపు ఏడుస్తారు? మ్యాగ్జిమం ఒకరోజు చాలా ఘోరంగా ఏడుస్తారు. రెండో రోజు అంతే తీవ్రతతో దుఃఖం ఉండదు. మూడో రోజు ఇంకా తగ్గిపోతుంది. అలా 10, 15 రోజులు తర్వాత పూర్తిగా దుఃఖము తగ్గిపోయి యధావిధిగా వారి జీవితంలో కొనసాగుతూ ఉంటారు. అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకొని కొంతసేపు దుక్కిస్తారు. అంటే ఇక్కడ చూడండి ఎంత చావు ఉన్నటువంటి భయంకరమైన విషయం జరిగిన కూడా అది ఎంత సేపు దుఃఖాన్ని కలిగిస్తుంది అంటే కేవలం దాని గురించి మనము దుఃఖిస్తున్నంత సేపు కేవలం కొంతసేపు మాత్రమే. కొంతకాలం మాత్రమే ఎందుకంటే భౌతిక వస్తువుల వల్ల శరీరంలో కావచ్చు శరీరం వల్ల కలిగే అనుభవాల వలన కావచ్చు ఈ యొక్క అనుభవాలు సుఖదుఃఖాలు అనేటివి టెంపరరీగా ఉంటాయి. చాలా లిమిటెడ్ టైం గా ఉంటాయి. అవి నిరంతరం సుఖాన్ని గాని నిరంతరం శాశ్వత దుఃఖాన్ని కలిగించవు. ఎంతటి వారైనా చనిపోతే మూడు రోజులు మాత్రమే ఆ దుఃఖము తగ్గిపోయి తర్వాత దుఃఖము ఉండదు.
నీ లోపల కలిగినటువంటి దుఃఖముగాని,భయము గాని ఇవన్నీ చాలా చెడ్డవి. ఇవి ఏం చేస్తాయి అంటే నిన్ను అనాలోచితంగా నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తాయి. ఒక ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి ప్రియుడు చనిపోయినాడు అని ఆ ప్రియురాలు ఆ దుఃఖాన్ని కొంచెం కూడా భరించలేక నా జీవితమే వ్యర్థం అని చెప్పేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఆ దుఃఖం ఆలోచించకుండా చేసి ఆ యొక్క విపరీతమైనటువంటి దుఃఖం వలన ఆమె తన యొక్క జీవితాన్ని అంతం చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంది. ఎప్పుడైతే మన హృదయంలో భావోద్వేగం ఉంటుందో ఇమ్బ్యాలెన్స్ ఉంటుందో అప్పుడు కచ్చితంగా మనము చాలా విచిత్రమైన, ఘోరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటాము.
ఇక్కడ అర్జునుడు తన యొక్క కర్తవ్యం అయినటువంటి యుద్ధాన్ని చేయను అని డిసైడ్ చేసుకున్నాడు. దేని వలన ఆ యొక్క మా వాళ్లు చనిపోతారు అన్నటువంటి భయం చేత, ఆ దుఃఖము చేత.. ఇక్కడ భగవంతుడు దుఃఖించకూడదు అంటే ఇక్కడ దుఃఖించుకు అని చెప్పలేదు. సహించు అంటున్నాడు అంటే దాన్ని తట్టుకో.. తట్టుకోమని చెబుతున్నాడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు తట్టుకోలేక పోతే ఆ దుఃఖము నిన్ను విపరీతమైన దుఃఖానికి గురిచేసి, నీవు తప్పుడు నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తుంది. నీ జీవితంలో నీ కర్తవ్యం మరుగున పడేటట్లు చేస్తుంది. ఎంతో మంది తమ ప్రియమైన వాళ్ళు చనిపోయారని జీవితాన్ని నాశనం చేసుకుని జీవిస్తూ ఉంటారు. ఇటువంటివి జరగకుండా నీ ధర్మాన్ని కొనసాగించడానికి నీవు కచ్చితంగా భౌతిక వస్తువుల వలన సుఖంగానీ దుఃఖం కానీ కలిగితే దాన్ని నువ్వు తట్టుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఉద్యోగం పోయింది అనుకోండి.. ఉద్యోగం పోయిన వెంటనే జీవితమే పోయిందని చెప్పేసి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలా సూసైడ్ చేసుకున్నటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే అది శాశ్వతం అనుకుంటారు. ఏదో జరగరాని అవమానం జరిగితే అది శాశ్వతంగా ఉంటుంది ఆ దుఃఖము లేదా అవమానములు అని చెప్పేసి ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతము కాదు ఎందుకు అంటే ప్రపంచంలో మొత్తం 24 తత్వాలు అనేటువంటి భౌతిక పదార్థాలతో తయారయింది కాబట్టి ప్రపంచంలో ఏదీ కూడా శాశ్వతంగా దుఃఖాన్ని కానీ, శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వలేదు.
భగవంతుడు ఏమి చెబుతున్నాడు అంటే భౌతిక విషయసంయోగాల వలన ఏదైనా సుఖం కానీ దుఃఖం కానీ కలిగినప్పుడు దాన్ని తట్టుకో అని చెప్తున్నాడు.
మహాత్ములను కించపరిస్తుంటారు .వారిని వక్రీకరిస్తూ మనం మాట్లాడుకుంటే జాతికి నష్టమే కానీ మంచి జరగదు. మహనీయులును అవమానిస్తే ఈ ప్రకృతి మనకు శాపం ఇస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్థిత ప్రజ్ఞతతో జీవించే వారి జీవితంలోకి ఏదైనా ఒక వస్తువు వచ్చిన వారి జీవితంలో ఒక వస్తువు పోయిన వారి వ్యక్తిత్వం స్థిరంగా ఉంటుంది. సత్య హరిచంద్రుడు ఉన్నాడు సత్యమే వరంగా తపస్సుగా జీవించాడు మరి సత్య హరిశ్చంద్రుడు తన భార్య పిల్లలు ఎవరికో అమ్మేశాడు అని నీచుడు అని అనగలుగుతామా మరి అంత విపత్కర పరిస్థితి వచ్చిన మహా చక్రవర్తి ఆయన మొత్తం సామ్రాజ్యం పోయిన చివరికి కాటికాపరి అయినా కూడా అతను ఆశయం వదలలేదు. ఎందుకంటే వారి వ్యక్తిత్వం చెదరినిది. ఎందుకంటే వారు ఆత్మతో జీవించారు. సత్యము ఎరిగి జీవించారు.
మనం కూడా మామూలు కుటుంబాల్లో భార్యాభర్తలు నిరంతరం పెళ్లి చేసుకున్న మొదట్లో ఉన్నటువంటి సఖ్యత ఒక సంవత్సరం తర్వాత ఉండదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు. పెళ్లయిన సంవత్సరానికి దెబ్బలాడుకుంటూ ఉంటారు. కారణం ఏమిటి అంటే తాము ప్రేమించినప్పుడు వారి వ్యక్తిత్వం నచ్చి పెళ్లి చేసుకుంటారు. కానీ ఒక వ్యక్తి యొక్క జీవితంలోకి ఒక విషయం రావడం వలన జీవితంలో ఒక దాన్ని కోల్పోవడం వలన మారిపోతూ ఉంటుంది. కొంతమందికి డబ్బు వచ్చిపోయింది అనుకోండి వెంటనే వారి యొక్క పర్సనాలిటీ చేంజ్ అయిపోతుంది. వ్యక్తిత్మే మారిపోతుంది. చిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమందికి ఉన్న ఉద్యోగం గానీ, ఉన్న డబ్బు గాని పోయింది అనుకోండి వాళ్ళు కృంగిపోయి వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. అంటే ఏంటంటే ఒక వస్తువు యాడ్ అయినప్పుడు ఒక వస్తువు జీవితంలో నుంచి పోయినప్పుడు మన పర్సనల్ వ్యక్తిత్వం చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే మన వ్యక్తిత్వం ఎప్పుడు కూడా భౌతిక సంయోగాలకు సుఖదుఖాలకు లోనై ఉంటుంది. శుభాలు వచ్చినప్పుడు ఒక విధంగా ఉండటం, దుఃఖాలు వచ్చినప్పుడు మరొక విధంగా ఉండడం. ఇలా ఉన్నప్పుడు మన పర్సనాలిటీ మన వ్యక్తిత్వాలు ఎప్పుడు మారిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి నచ్చి నీ జీవితంలోకి వస్తుందో ఆ వ్యక్తికి కొన్నాళ్ల తర్వాత నీ వ్యక్తిత్వం మారిపోతుంది అప్పుడే అభిప్రాయభేదాలు ఏర్పడుతాయి. నమ్మకం కోల్పోవడానికి కారణం ఇదే అందుకే మీ జీవితములో ఏది కలిసిన, ఏది కోల్పోయినా నీ వ్యక్తిత్వాన్ని స్థిరంగా ఉంచుకో.. నీ పర్సనాలిటీని స్థిరంగా ఉంచుకోవడం దీన్ని స్వధర్మం అంటారు. సత్యహరిశ్చంద్రుడు ఏ విధంగా అయితే నా జీవితంలోకి ఏదైనా రాని నా జీవితంలో ఏదైనా కోల్పోయిన నేను ఏ విధంగా జీవించాలి అనుకుంటున్నాను ఒక ఆదర్శంగా అటువంటి జీవితాన్ని అటువంటి విధంగానే జీవిస్తాడు.
నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని దుఃఖాలు లొచ్చినా నీ వ్యక్తిత్వం స్థిరంగా ఉందో లేదో చూడు. మన జీవితం బాగా ప్రాక్టికల్ గా గమనిస్తే ఉద్యోగం పోగానే మన పర్సనాలిటీ మారిపోతుంది. ఏదైనా ఒక చెడు సంఘటన జరగగానే మనం మారిపోతూ ఉంటాం.
అందుకే భగవంతుడు చెబుతున్నాడు. ఏది లభించినా, ఏది కోల్పోయినా నీవు స్థిరత్వాన్ని కలిగి ఉండు. సుఖదుఃఖాలను సమానంగా కలిగి ఉండు. ఆ స్వభావాన్ని మార్చకుండా సంయోగ వివేకం వల్ల మారిపోకుండా స్థిరత్వంగా ఉండగలిగితే అదే మోక్షస్థితి. అదే మోక్షానికి మార్గం.
No comments:
Post a Comment