*Class-8 day*
*ముఖ్యంశాలు*
1.నిన్నటి క్లాస్ లో మనం అర్జునుడు యుద్ధ విముఖుడు అవ్వడానికి కొన్ని బలమైనటువంటి కారణాలు చెప్పాడు. ఈ రోజు సాంఖ్యయోగము గురుంచి గురువు గారు వివరించారు. సాంఖ్యయోగం అంటే సాంఖ్యం అంటే జ్ఞానం. సాంఖ్యం అంటే సంఖ్య. మానవుడు శాశ్వతమైనటువంటి జ్ఞానాన్ని, సత్యాన్ని, ఆత్మను తెలుసుకోవడానికి ఎన్ని అనాత్మ పదార్థాలను తొలగించుకోవలసి ఉంటుందో ఆ అణాత్మ పదార్థాలను అంటే ఆత్మ కాకుండా ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలోని ఎన్ని పదార్థాలను తొలగిస్తే సృష్టికి సాక్షిభూతమైనటువంటి ఆత్మజ్ఞానం పొందగలడ అని, ఇలా తొలగించాల్సినటువంటి పదార్థాలను కూడా లెక్కవేసి 24 పదార్థాలుగా నిర్ణయించడం జరిగింది. ఈ 24 పదార్థాలను, 24 తత్వాలను మనము వదిలేస్తే కనుక ఈ 24 తత్వాలకు సాక్షి భూతమైనటువంటి ఆత్మను మనం తెలుసుకోవచ్చు.
2. ఒక సంఖ్యతో ముడిపడి ఉంది ఈ జ్ఞానం. ఈ యొక్క ఆత్మను తెలుసుకునే జ్ఞానము తొలగించాల్సిన పదార్థాల సంఖ్యతో ముడిపడి ఉంది కాబట్టి ఈ 24 తత్వాలు, పంచభూతములు ఐదు, అదేవిధంగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్యాలు 15, పంచప్రాణాలు 20, మనస్సు, బుద్ధి,చిత్తం, అహంకారం మొత్తం 24 తత్వాలు ప్రపంచంలో ప్రతిదీ కూడా ఈ 24 ఇంటితోనే ఏర్పడుతుంది. కాబట్టి 24 ని మనం తొలగించుకుంటూ, వీటన్నిటిని కూడా నడిపిస్తున్నటువంటి ఆత్మను తెలుసుకోవడానికి ఒక జ్ఞానము చెప్పబడింది. ఆ యొక్క జ్ఞానం పేరే సాంఖ్య యోగము.
3. ఈ అధ్యాయం మొత్తం కూడా నిజానికి సంక్షిప్త భగవద్గీత అంటే భగవద్గీత మొత్తం సారాంశము. ఈ అధ్యాయంలో భగవద్గీతలో ఇదే చాలా పెద్దది 72 శ్లోకాలు వరకు ఉంటాయి. సాధన చేసుకోవడానికి ఈ అధ్యాయం ఒకటి చాలు చాలా అద్భుతమైనటువంటి విషయాలు, కర్మకు సంబంధించినటువంటి విషయాలు అన్ని రకాల యోగాలు కలగాల్సినటువంటి అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం.
4.భగవంతుని యొక్క గీతా జ్ఞానం అనేది ఈ అధ్యాయంలో రెండవ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. ఈ శ్లోకము నుంచి భగవద్గీత బోధన ప్రారంభమవుతుంది.
5.అందరిని చూసేసరికి తన యొక్క బంధువులను, గురువులను, పుత్రులను, మేనమామలను, అందరిని చూసేసరికి అతనిలో కారుణ్యము కలిగి,మమకారం కలిగి, అదే విధంగా యుద్ధము వలన సంభవించు అనేక అనేక కులనాశనము, కుల ధర్మముల వినాశనము, వర్ణసంఖ్యము ఈ విషయాలన్నీ గుర్తొచ్చి ఇంత పాపము నామీద పడుతుంది, ఇక్కడ బాగా మనం గమనిస్తే కనుక ఇప్పుడు మనం ఈరోజు మాత్రం చెప్పు ప్రపంచంలోనే ప్రతి మనిషికి అవసరమైనటువంటి జ్ఞానం ఇక్కడ దాగి ఉంది. ఒక జీవన్మరణ స్థితి ఏర్పడినప్పుడు మనం సరైన విధంగా జీవితం తరించబోయే విధంగా శ్రేయోదాయకంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే మన జీవితం అత్యున్నత స్థాయికి చేరుతుందో చూడండి.. మనిషి యొక్క జీవితము ఇప్పుడు బాగోలేదు అంటే ఇప్పుడు ఘోరంగా ఉంది అంటే కచ్చితంగా ఎప్పుడో అతను తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయం కారణమై ఉంటుంది. జీవితం మారింది ఎక్కడ నేను తప్పు చేశాను.. ఎక్కడ నిర్ణయం తీసుకోవడంలో నేను పొరపాటు పడ్డాను.. అని మీకు అర్థం అవుతుంది. మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
6. మనకు కూడా అర్జునుని లాంటి దైన్యం వచ్చినప్పుడు జీవన్మరణ సమస్య వచ్చినప్పుడు కర్తవ్యం ఏంటో, ధర్మాధర్మాలు ఏంటో తెలియనప్పుడు మరి ఎలా ధర్మాన్ని ఎంచుకోవాలో, ఎలా సరైన నిర్ణయం తీసుకోవాలో మనకు కూడా తెలుస్తుంది. 7.మొట్టమొదట ఎంతో ఉత్సాహంగా రెండు సెనల మధ్యలో కూడా యుద్ధం చేయాలనే ఉత్సాహంతోనే కౌరవుల పైన పగా ప్రతీకారాలతోనే తన మనసును గట్టిగా చేసుకుని యుద్దానికి వచ్చాడు. యుద్ధంలో ఎవరెవరితో యుద్ధం చేయాల్సి ఉంటుందో కూడా బాగా తెలుసు. మరి అన్ని సంవత్సరాల నుంచి యుద్ధానికి బాగా ప్రిపేర్ అయ్యి.. తీర యుద్ధం చేసే సమయంలో అతనికి నేను యుద్ధం చేయబోయేది నా బంధువులతో నా, అన్నదమ్ములతో నా, గురువులతో నా, పినతండ్రులతో పెద్దలతో అని గుర్తు వచ్చి మనసు వికలమై ధనస్సు కూడా చేజారిపోతుంది. నాకు చాలా భయంకరమైన స్థితిగలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు.
8.అర్జునిలో ఎనలేని కృప కలిగి , ఈ యుద్దం చేసి నా అన్న వారందరినీ చంపుకుని పాపం చేయలేను. దీని కంటే పాపం మరొకటి ఉండదు. నాలో కలిగిన ఈ దుర్భలత్వన్ని పోగొట్టు మార్గం నువ్వే బయట పడవేయి నిన్నే శరణు కోరుతున్నాను అని భగవంతునికి శరణాగతి అయిపోయాడు.
9. ఈశ్వరునికి గానీ, గురువుకు గానీ, తనలో ఉన్న ఆత్మకు గానీ శరణాగతి అయినపుడు తప్పక తన సమస్యకు పరిష్కారం దొరికి శాంతి చేకూరుతుంది.
10. ఎడారిలో ఒక బాటసారి అనే ఒక కథ ద్వారా పరోపకార బుద్దిని కలిగి ఉండాలి అనే సందేశం ఇవ్వడం చాలా గొప్ప అనుభూతిగా ఉంది.
సమయాభావం వల్ల పూర్తి నోట్ రాయలేక పోతున్నాను. మనిషి జీవితంలో ఎమోషనల్ గా ఉన్నపుడు మనసును న్యూట్రల్ స్థితిలోకి తెచ్చుకొని అంటే శాంతి స్థితిలోకి తెచ్చుకొని డిసిజన్ తీసుకుంటే వారి జీవితం గొప్పగా ఉంటుంది.
No comments:
Post a Comment