Tuesday, December 12, 2023

రహస్యం సంక్షిప్తంగా -(1)

 రహస్యం సంక్షిప్తంగా -(1)
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯

*జీవితం తాలూకు గొప్ప రహస్యం ఆకర్షణసిద్ధాంతం.

* ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయని అంటుంది. ఆకర్షణసిద్ధాంతం, అందుకని మీరేదైనా ఆలోచన చేస్తే, అటువంటి ఆలోచనలనే మీరు మీ వైపుకి ఆకర్షించుకుంటున్నారని అర్ధం.

• ఆలోచనలు అయస్కాంతాల వంటివి. వాటికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు ఆలోచించేప్పుడు, ఆ ఆలోచనలు విశ్వంలోకి ప్రసరింపబడతాయి, అప్పుడు అదే ఫ్రీక్వెన్సీలో ఉండే అటువంటి ఆలోచనలని అవి అయస్కాంతంలా ఆకర్షిస్తాయి. బైటికి పంపబడిన ప్రతిదీ ఉత్పత్తి స్థానానికి వెనక్కి వస్తుంది.

*మీరు ఒక మానవ ట్రాన్స్ మిషన్ టవర్ వంటివారు, మీ ఆలోచనలతో ఒక ఫ్రీక్వెన్సీని ప్రసారం చేస్తూ ఉంటారు. మీ జీవితంలో ఏమైనా మార్పులు చేసుకోవాలనుకుంటే, మీ ఆలోచనలని మార్చుకోటం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని మార్చుకోండి.

*మీరు ప్రస్తుతం చేస్తున్న ఆలోచనలే మీ భవిష్యత్ జీవితాన్ని సృష్టిస్తున్నాయి. మీరు దేన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తారో, దేనిమీద దృష్టిని ఎక్కువగా కేంద్రీకరిస్తారో, అదే మీ జీవితంగా రూపొందుతుంది.

• మీ ఆలోచనలే వస్తువులుగా మారతాయి.


 🎯రహస్యం తేటపరచబడింది 

 🪷మనం జీవిస్తున్న ఈ విశ్వంలో భూమ్యాకర్షణసిద్ధాంతం లాంటి కొన్ని సిద్ధాంతాలున్నాయి. మీరు ఒక భవనం మీదనించి కింద పడితే, మీరు మంచివారా చెడ్డవారా అనేది లెక్కలోకి రాదు, మీరు నేలమీద పడతారు.

ఆకర్షణ సిద్ధాంతం అనేది ఒక ప్రకృతి నియమం, భూమ్యాకర్షణసిద్ధాంతం ఎంత

నిష్పక్షపాతమైనదో, వ్యక్తి ప్రమేయం లేనిదో, ఇదీ అంతే. అది కచ్చితమైనది, నిర్దిష్టమైనది.


 🪷ఈ క్షణంలో మీ జీవితంలో మీచుట్టూ ఉన్నదంతా, మీరు వీటి గురించి ఫిర్యాదు చేస్తున్నారో వాటితో సహా, మీరు ఆకర్షించినవే. మొదటిసారి ఈ మాట విన్నప్పుడు అది మీకు నచ్చకపోవచ్చని నాకు తెలుసు, మీరు వెంటనే, "నేనా కారు ప్రమాదాన్ని ఆకర్షించలేదే. నన్ను ముప్పుతిప్పలు పెట్టే ఈ వినియోగదారుని నేను ఆకర్షించలేదే. నేను కావాలని అప్పుని ఆకర్షించలేదే." అంటారు. అయినా నేను మీ మొహంలోకి చూసి, అవును మీరే ఆకర్షించారు అంటాను. అన్నిటికన్నా అర్ధం చేసుకోటానికి కష్టమైన భావనలలో ఇది కూడా ఒకటి, కానీ ఒకసారి దీన్ని మీరు ఒప్పుకోగలిగితే, అది జీవితాన్నే మార్చేస్తుంది.

తరము అందరూ రహస్యంలోని ఈ భాగాన్ని విన్నప్పుడు, వేలకి వేలు ప్రాణాలని పోగొట్టుకున్న వాళ్ల గురించి చరిత్రలో తాము విన్న వాటిని గుర్తు తెచ్చుకుంటారు. అన్ని వేలమంది ఆ సంఘటనకి తమని తాము ఆకర్షించుకున్నారనే విషయాన్ని వాళ్లు అర్థం లేదు. అర్షణసిద్ధాంతం దృష్ట్యా, వాళ్లు ఆ సంఘటన తాలూకు ఫ్రీక్వెన్సీతో సమానంగా ఉండి ఉండాలి. అంటే వాళ్లందరూ తప్పకుండా ఆ సంఘటన గురించే ఆలోచించారని అర్థంకాదు, కానీ వాళ్ల ఆలోచనల ఫ్రీక్వెన్సీ, సంఘటన ఫ్రీక్వెన్సీ సమానంగా ఉన్నాయి. మనుషులు తాము ఉండకూడని చోట, ఉండకూడని సమయంలో ఉన్నామని అనుకుంటే, బాహ్య పరిస్థితులమీద వాళ్లకి ఎటువంటి అదుపూ లేనట్టయితే, భయం, విడిపోవటం, అశక్తత అనే ఆలోచనలు విడవకుండా మనసులోకి వస్తూ ఉంటే, వాళ్లని ఉండకూడని చోటికి ఉండకూడని సమయంలో ఆకర్షిస్తాయి.

మీకు ఈ క్షణాన ఎంచుకునే అవకాశం ఉంది. జీవితం ఒక లాటరీ లాంటిదనీ, మీకు ఎప్పుడైనా చెడు జరగవచ్చనీ మీరు నమ్మాలని అనుకుంటున్నారా? మీరు ఉండకూడని చోట, ఉండకూడని సమయంలో ఉండవచ్చని నమ్మాలని అనుకుంటున్నారా? పరిస్థితులు మీ అధీనంలో ఉండవని అనుకుంటున్నారా?
లేక మీ జీవితానుభవాలు మీ చేతిలోనే ఉన్నాయనీ, మీరు మంచి గురించే ఆలోచిస్తారు. 'కాబట్టి మీకు జీవితంలో అంతా మంచే జరుగుతుందని నమ్మాలనీ, ఆ సంగతి మీకు తెలుసనీ అనుకుంటున్నారా? మీకు ఎంచుకునే వెసులుబాటుంది, మీరు ఏ విషయాలని ఆలోచించాలని ఎంచుకుంటారో, అవే మీ జీవితం తాలూకు అనుభవాలు అవుతాయి. ఆలోచనలతో మీరు రమ్మని పిలిస్తేగాని ఏదీ మీ అనుభవంలోకి రాదు..

 🪷మనలో చాలామంది అప్రయత్నంగా ఆకర్షించుకుంటాం. దానిమీద మనకి అదుపు లేనేలేదని అనుకుంటాం. మన ఆలోచనలూ, భావాలూ వాటంతటవే కలుగుతూ ఉంటాయి. అందుచేత మన జీవితంలో సంభవించేవన్నీ అప్రయత్నంగానే జరుగుతాయి.
ఎవరూ కూడా అక్కర్లేనివాటిని కావాలని తమకేసి ఆకర్షించుకోరు. రహస్యం తెలుసుకున్నాక, మీ జీవితంలో కాని, ఇతరుల జీవితాల్లో కాని, అక్కర్లేని సంఘటనలు ఎలా జరిగాయో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మన ఆలోచనలకున్న గొప్ప సృజనాత్మక శక్తి.. గురించి అవగాహన లేకపోవటం వల్లే అవన్నీ జరిగాయి

 🪷ఒకవేళ దీన్ని వినటం మీకు మొదటిసారైతే, మీరిలా అనుకుంటారు, "ఓ, నేను నా ఆలోచనలమీద నిఘా ఉంచాలన్నమాట? అంటే అది చాలా పెద్ద పనే." ముందు మీకది అలా అనిపిస్తుంది. కానీ అక్కడే అసలు మజా మొదలవుతుంది.

మజా ఐన విషయం ఏమిటంటే రహస్యానికి చాలా దగ్గర దారులున్నాయి. మీకు అన్నిటికన్నా బాగా పనికొచ్చే దగ్గరదారిని మీరు ఎంచుకోవటానికి అవకాశం ఉంటుంది. చదువుతూ పొండి, అదెలాగో మీకే అర్థమౌతుంది.


🪷మన మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనమీదా నిఘా ఉంచటం. అనేది అసంభవం. మనకి రోజుకి అరవైవేల ఆలోచనలు వస్తాయని పరిశోధకులు అంటారు. ఆ అరవైవేల ఆలోచనలమీదా అదుపు ఉంచాలంటే మీరెంతగా అలసిపోతారో ఊహించగలరా? అదృష్టవశాత్తూ దానికి ఒక సులభమార్గం ఉంది. అవే మన భావాలు. మన భావాలు మనం ఏమాలోచిస్తున్నామో మనకి తెలియజేస్తాయి.

భావాల ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మీ జీవితాన్ని సృష్టించుకునేందుకు సాయపడే పరికరాలలో, మీ భావాలే అన్నిటికన్నా మెరుగైనవి. మీ ఆలోచనలే అన్నిటికీ మూలకారణం. ఈ ప్రపంచంలో మీరు చూస్తే, అనుభవించే
మిగతాదంతా ఆ కారణం తాలుకు ప్రభావం ఉంది. వాటిలో మీ భావాలు కూడా ఒక భాగమే కారణం మటుకు ఎప్పుడు మీరు ఆలోచనలే


ఇంకా ఉంది

సేకరణ
డాక్టర్ ఎం అశోక వర్ధన్ రెడ్డి
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

No comments:

Post a Comment