*ఆరోగ్యం ఆనందం సంపద*
*మహోన్నత జీవనం!30 రోజుల్లో సాధ్యం*
*రోజు 05* *13-12-2023*
*బుధువారం*
*1వ భాగం మనసు*
*ఏకాగ్రత సాధించటం*
జీవితంలో విజయం సాధించాలంటే మానసిక ఏకాగ్రత అవసరం. మీకు ఆశ్చర్యంగా తోచవచ్చు కాని ఇది అక్షరాలా నిజం. ఏకాగ్రత ఉంటే మీరు గతంలో జీవించరు. భవిష్యత్తులో జీవించరు. కేవలం వర్తమానంలో జీవిస్తారు. మీరు దృష్టి కేంద్రీకరించటం సాధించగలిగితే పెద్ద సమస్యలు దూదిపింజాల్లా తేలిపోతాయి. మీకు అంతకు ముందు కనబడని విషయాలు కనిపించటం మొదలు పెడ్తాయి. మనసు చెదరదు కాబట్టి మీరింకా సమర్ధవంతంగా పనులు చేయగలుగుతారు. గతంలో పడ్డ అవస్థలను, చేసిన పనులను మర్చిపోగలుగుతారు. పనులు ఎంత సాఫీగా సాగుతాయంటే, మీరు మీకలలని, కోరికలని అతి తేలికగా సాకారం చేసుకోగలుగుతారు. ఏకాగ్రత వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఎంత దృఢంగా ఉంటే, జీవితం అంత ఆనందంగా ఉంటుంది. జీవితం ఒక గులాబీ పూవు లాంటిది. దాని మార్గంలో ముళ్ళు ఉంటాయి తప్పదు. కాని ఎప్పుడైతే మీరు ఆ ముళ్ళని అధిగమించి పైకి వచ్చారో, అప్పుడు గులాబీ లాంటి అందాన్ని ఆస్వాదించవచ్చు. గులాబీని, దాని అందమైన లక్షణాలని గుర్తుంచుకోండి. ఇవాల్టి వ్యాయామం సరదాగా ఉంటుంది.
ఒక్క గులాబీ పువ్వు కొనండి. దాన్ని ఒక ప్రశాంత ప్రదేశంలో పెట్టి, మీకు వీలున్నంత సేపు దానికేసి తేరిపార చూడండి. దాని అద్భుత లక్షణాలని, అందమైన సుతిమెత్తని రేకులని, దాని పరిమళాన్ని ఆస్వాదించండి. గులాబీ నుంచి మీ చూపుని గాని, మనసుని గాని పక్కకి మళ్ళించకండి. మీకు ఏకాగ్రత చూపటం మనసుకి అలవాటు చేయకపోయుంటే వేరే ఆలోచనలు. తొంగి చూస్తాయి. మరేం ఫర్వాలేదు. వాటిని సాక్షీభూతంగా చూడండి. ఆకాశంలో మేఘాలు దూదిపింజాల్లా తేలిపోతుంటే చూస్తున్నట్టు చూడండి. మళ్ళీ గులాబీకి రండి. ఈ వ్యాయామం ప్రతి రోజూ సాధన చేయండి. చాలా ముఖ్యమైన వాటిల్లో ఇది ఒకటి. ఎప్పుడైతే ఏ ఆటంకం లేకుండా మీరు 20 నిముషాలపాటు దృష్టి కేంద్రీకరించారో, అప్పుడే మీరు మీ మనసుని నియంత్రించినట్టు లెక్క. అప్పుడది మీకు ఏం కావాలంటే అది చేస్తుంది. మీ మనస్సుని దృఢపరుస్తుంది, మీరే ఆశ్చర్యపోయేలా!
*2వ భాగము . శరీరం*
*గొంతుని నియంత్రిస్తే బలం పెరుగుతుంది*
. ప్రాచీన టిబెటన్లకి శరీర ఆరోగ్యం ఏడు తిరిగే వార్డెక్సుల మీద ఆధారపడి ఉన్నాయని నమ్మకం. ఎప్పుడైతేఆ తిరగటం నెమ్మదిస్తుందో, అప్పుడే శరీరపు హార్మోన్లలో మార్పులు జరిగి, వృద్ధాప్యం మీద పడుతుంది. అందులో ఒకటి, మెడకింది భాగంలో ఉండి, మన స్వరపేటికని (వోకల్ కార్డ్స్ ని) నియంత్రిస్తుంది. మన గొంతుని దృఢపరిస్తే, ఆ వార్టెక్స్ ప్రేరేపింపబడి, మనకి ఎక్కువ ఆరోగ్యం చేకూరుస్తుంది. అందుకే టిబెటన్ మాంకులు రోజూ ఛాంటింగ్ చేస్తారు. అలా స్వరపేటికని నియంత్రించటం వల్ల అటు అతి ముఖ్యమైన ఏకాగ్రత కుదురుతుంది, ఇటు శరీరానికి అవసరమైన పరిపూర్ణ ఆరోగ్యమూ కలుగుతుంది. సాధన : మిమ్ అని పదే పదే రోజుకి కనీసం ఐదు నిముషాల సేపు చేయండి. మీరు షవర్ బాత్ తీసుకుంటుండగా చేస్తే ఇంకా బాగుంటుంది. రాన్రానూ గొంతు తగ్గిస్తూ రండి. చివరికి వచ్చేసరికి చాలా లో గొంతులో అనాలి. అప్పుడు అద్భుత ఫలితాలు కలుగుతాయి.
*3వ భాగము నడవడిక*
* *మర్యాద*
మనిషి చూపే మర్యాద అతను ఎలాటి వాడో చెప్తుంది ! మీరు కలిసే ప్రతి వ్యక్తితోను, వినయం చూపితే మీ నడవడిక ఉన్నతంగా ఉండి, మీ సంబంధ బాంధవ్యాలు అనూహ్యంగా పెరుగుతాయి. ఇవాళ మీరు ఎదుటి వాళ్ళని మెచ్చుకుంటున్నామని వాళ్ళకి అర్ధమయ్యేలాగా ఏ విధంగా మన్నన చూపుతారో ఒక పట్టిక తయారు చేయండి. ఈ అవకాశాలను వినియోగించుకుని ఎదగండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీ అనుమతి లేనిదే మిమ్మల్ని ఎవరూ కించపరచలేరు. ఎవరైనా మీతో అమర్యాదగా ప్రవర్తిస్తే మీరు మీ పరిధినుంచి క్రిందకి దిగజారకండి. మీరు మీ ప్రశాంతతని కోల్పోకండి. గొంతు పెంచి ఎవరి మీద అరవకండి
* *డాక్టర్ ఎం అశోక వర్ధన్ రెడ్డి*
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
No comments:
Post a Comment