*✅తెలుసు కుందాం✅*
*🟥అర్థరాత్రితోనే రోజు ఎందుకు మొదలవుతుంది?*
🟢అర్థరాత్రి స్వాతంత్రం, అర్థరాత్రి నూతనసంవత్సరం, అర్థరాత్రి జన్మదినోత్సవాలు, ఇలా అర్థరాత్రితోనే మనరోజు ఎందుకు ప్రారంభమవుతుందీ అని ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? అదేమిటి పిచ్చి ప్రశ్న అని కొట్టెయ్యకుండా, అది ఇంగ్లీషువారి పద్ధతిలే అని దాటెయ్యకుండా ఆలోచిస్తే ఒక కొత్త విషయం బయటకు వస్తుంది!
నిజానికి ఏ తెల్లవాడికైనా అర్థరాత్రి తోనే రోజు మొదలు పెట్టాలని ఎందుకు అనిపించివుంటుంది? విద్యుత్తు దీపాలు కూడా లేని నాడు, కనీసం గడియారాలు కూడా లేని నాడు, అర్థరాత్రికి ఎవడూ మేలుకుని వుండని నాడు, దానితో రోజు మొదలు పెట్టాలని ఎందుకు అనిపించివుంటుంది?
వైదీకకాలంలో అంటే బౌద్ధమతానికి కూడా పూర్వకాలంలో ప్రపంచంలో మతం అన్న మాట కూడా లేని కాలంలో, ఒకే ఒక ధర్మం వుండేదట. అదే భారతీయ లేక వైదీక సనాతనధర్మం. అది భారత దేశానికే పరిమితం కాకుండా ప్రపంచమంతటా వ్యాపించి వుండేదిట. భారతదేశం ఈ వైదీకసంస్కృతికి ఒక రకంగా నాయకత్వం వహించేది అని చెప్పుకోవచ్చు. తర్వాత బౌద్ధ, జైన మతాలవంటివి పుట్టి అమిత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆదిశంకరుడు మళ్ళీ మన మతాలను ఉద్ధరించి సనాతనధర్మాన్ని పునఃస్థాపితం చేసాడు. ఆ తరువాత ఇంకా అనేక మతాలు విడివిడిగా జన్మించి, అలా ఒక్కొక్కరికి ఒక మతం వచ్చేసాక, ఇక ఈ వైదిక ధర్మాన్ని ఏమని పిలవాలి అని సతమతమవుతూ ఉన్నప్పుడు, అదే కాలంలో భారతీయులని హిందూ దేశస్తులని పర్షియన్లు పిలవడం మొదలు పెడితే, అదే పేరుని పెట్టి మన మతాన్ని కూడా పిలవడం మొదలు పెట్టారు. అలా మనకు హిందూమతస్తులని పేరు పడిపోయింది కానీ, వైదీక సనాతనధర్మానికి నిజంగా పేరు లేదు అని అందరికీ తెలిసిన విషయమే. ఈ సనాతనధర్మం వల్ల భారతదేశం ప్రపంచానికి ఒక సాంస్కృతికరాజధానిగా వుండేది. అలా ఆ కాలంలో అందరూ వైదీకకాలమానాన్ని అనుసరించేవారు. భారతీయ సంస్కృతిని గౌరవించి పాటించేవారు అని చెప్పుకోవచ్చు.
ఇలా వైదీక పద్ధతిని అనుసరించడానికి ప్రపంచం కట్టుబడి వుండేదన్న విషయం అంగీకరిస్తే, దినారంభం గురించి ఆలోచించడానికి పునాది సిద్ధమైందన్నమాట. -- ఇందాక చెప్పుకున్నట్లు సూర్యోదయమైతేగానీ, భారత పంచాంగం ప్రకారం రోజు మొదలవ్వదు. సామాన్యంగా భారతదేశంలో ఉదయం 6 గంటలకు సూర్యోదయం అవుతుంది. అంటే యూరప్ దేశవాసులు మంచి నిద్రలలో ఉంటారన్నమాట. అంటే గడియారాలు గట్రా లేని కాలంలో ... " ఎప్పుడో అర్థరాత్రికి వైదీకదినం మొదలవుతుందిలే" ... అని అనుకునేవారు. అంటే మన పంచాంగ పట్ల, లేక భారతీయ సంస్కృతిపట్ల వున్న అభిమానంతో, భారత దేశంలో రోజు ఎప్పుడు మొదలు అయితే, అప్పుడే యూరోపియన్లు కూడా తమ రోజును అదే సమయానికి, …. అంటే అది అర్థరాత్రి అయినా అపరాత్రి అయినా, …. … అదే సమయానికి తమతమ రోజులను మొదలు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారన్న మాట. ఈ విధంగా ఇలా అర్థరాత్రికి వారి దినం మొదలు పెట్టుకునే సాంప్రదాయాన్ని అలవరుచుకున్నట్లుగా కనపడుతున్నది. మనపంచాంగం ప్రకారం స్థానికకాలమానంతో సంబంధంలేకుండా ఎక్కడైనా తిథులను ఇలాగే ఒకే సమయంలో అమలు పరుచుకోవడం కూడా సాంప్రదాయమే. దానినే వీరు దినారంభానికి కూడా వర్తించినట్ట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment