ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు🌹💐, లక్ష్మి సరస్వతి, దుర్గ, గాయత్రి అమ్మవార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆత్మీయులకు శుభాశీస్సులు తెలియచేస్తూ 🙌 🥀🎉💐
శుక్రవారం :-15-12-2023
ఈ రోజు *AVB* మంచి మాటలు
. గదిలో చీకటి ఉంటే పది రూపాయల క్యాండిల్ పెట్టి వెలుగు తెప్పించవచ్చు, కానీ, మదిలో చీకటి ఉంటే వెలుగును చూడటం చాలా కష్టం అవుతుంది.
. యుద్ధం చెయ్యాలంటే యుద్ధ భూమికి వెళ్లనవసరం లేదు, ఉదయం లేచింది మొదలు మళ్ళీ రాత్రి కంటి మీద కునుకు పడే వరకు యుద్ధం చెయ్యాల్సిందే జీవితం లో.
కొంతమంది కి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మొయ్యాల్సి వస్తుంది, వాళ్ళ ఆశలు పెద్దగా ఉన్నా, ఆశయాలు గొప్పగా ఉన్నా, గుండెల్లోనే దాచుకోవాల్సి వస్తుంది.
. వస్తువు విలువ దాని ధరను బట్టి చెప్పగలం. సమయం విలువను గడిచిన కాలాన్ని బట్టి చెప్పవచ్చు. కానీ, మనిషి విలువను మాత్రం బతికి ఉన్నప్పుడు తెలిసికోలేం.
. దెబ్బలు తిన్న రాయి విగ్రహం గా మారుతుంది, కానీ, దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తి లాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలుసుకొన్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులును ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికి ఉన్న దగ్గరే ఉంటాడు.
సేకరణ :-AVB సుబ్బారావు, 9985255805 ✒️
No comments:
Post a Comment