Sunday, December 31, 2023

 ఆ క్షణం
ఎదో బంధాలను
అనుబంధాలను
అలా దూరం చేస్తుందిట
కదా

ఆ క్షణం
ఎదో బాహ్య అంతర్
ప్రపంచాలను రెండూ
ఒకే సారి మాయం
చేస్తుందిట కదా

ఆ క్షణం
తర్వాత
వేదనలు రోదనలు
మమతలు
మమకారాలు
అన్నవే ఉండవటగా

ఆ క్షణం
మానం అవమానం
అభిమానం
ఆక్రోశం అన్ని
అంతం అవుతాయటగా 

ఆ క్షణం
నిన్ను తలిస్తే
నీవే స్వయంగా వచ్చి
నీలో కలుపు కుంటావటగా

ఆ క్షణం ఇవ్వు
పశుపతీ 😞😢😢

ఆ క్షణం నిన్ను
తలవగలనో లేదో
స్పృహలో ఉండి
చైతన్యముకలిగి
భక్తితో
ఆర్తితో
తలుస్తున్నా
పిలుస్తున్నా
వేడుతున్నా..
ఆ క్షణము
ఈ క్షణము గా మార్చు
మహాదేవా 🙏🚩

శివయ్యా నీవే దిక్కయ్యా

No comments:

Post a Comment