బతుకు చరిత్ర
మనిషి మనిషిగా మిగిలిపోతే
లాభంలేదు
మ ఇషిగా చేయాల్సింది శానా ఉంది
మొట్టమొదట మానవుడిగా బతకాలి
ఆయన చేయాల్సింది విస్తరించడం కాదు
వికసించడం నేర్వాలి నేర్పించాలి
పరిమళించడం తెలుసుకోవాలి
పరిమళాన్ని సమాజపరం చేయడం నేర్చుకోవాలి
పరిమళం పంచే భాగహారాన్ని నిక్కచ్చిగా చేయాలి
బతుకు సత్యాలనుకుడియెడమలకు వ్యాపింపజేయాలి
వలయాలై చుట్టుముట్టేవేదనల్ని
బతుకులోకి అడుగుపెట్టకుండా
సరిహద్దులను దాటించాలి
నిరుద్యోగ జన్యు వు పుట్టకుండా వైద్యం చేయాలి
ఆధిపత్య చాక్లెట్లను అగాధం లోకి దొబ్బాలి
ఋతువులకు జీవన ప్రాంగణంలో
ఉద్యోగం కల్పించాలి
కాలాలను స్నేహితులుగా చేసుకొని
పంట సిరులను శ్రమ క్వాలిఫికేషన్లకు సమానంగా పంచే
బతుకు పంచాయతి నడపాలి
గుండెగదిని ఆక్సీజను కార్ఖానాగా చేసి
అడుగులను లెక్క చూసినడిపించాలి
అప్పుడే నీవైనా నేనైనా వాడైనా వీడైనా ఆయనైనా ఆమె యయినా
అతడై నా ఇతడైనా మనిషిగా చరిత్రసృస్టిస్తడు
అదే మనిషి బతుకుచరిత్ర
వల్లభాపురాం జనార్దన
No comments:
Post a Comment