రమణ సందేశము
ద్వారక దేవాలయంలోని పూజారి , మహర్షిని దర్శించి సంస్కృతంలో ఇలా అడిగారు .......
" కృష్ణసాక్షాత్కారం పొందాలని నా కోరిక . అందుకు నేనేం చేయాలి ? ”
ఈ ప్రశ్నను అడిగినపుడు మహర్షి చదువుతున్న ఒక భక్తుని ఉత్తరంలో చివర ఉన్న వాక్యాలను చదివారు.
“ నీవు నన్ను నీ యిష్టం వచ్చినట్లు చేసుకో , నన్ను ఆరోగ్యంగా ఉంచుతావో , రోగిగా మారుస్తావో , ధనవంతునిగా చేస్తావో , దరిద్రునిగా మారుస్తావో ..... ” అని ఉంది .
మహర్షి , పూజారికి ఇలా సెలవిచ్చారు ....
కాబట్టి కృష్ణుని సాక్షాత్కారం సంగతి కూడా కృష్ణునికే వదలివేయి . ఈ ఉత్తరం కూడా దాన్నే తెలుపుతూ ఉంది .
మహర్షి : కృష్ణుని గురించి నీ అభిప్రాయం ఏమిటి ?
నీ దృష్టిలో సాక్షాత్కారం అంటే ఏమిటీ ?
పూజారి : నేను తలుచుకుంటున్న కృష్ణుడు
బృందావన వాసి . శ్రీకృష్ణుని గోపికలు దర్శించిన విధంగానే నేను కూడా
చూడాలనుకుంటున్నాను .
మహర్షి ఇలా సెలవిచ్చారు ......
“ ఇదిగో చూడు ! నీవు చూడదలుచుకున్న కృష్ణుడు మానవుడనీ , మానవరూపంలో ఉన్నాడనీ , ఒకరికి కొడుకనీ ......
ఇన్ని రకాలుగా నీవు అనుకుంటున్నావు . కానీ కృష్ణుడే తనను గురించి సర్వభూతాంతరాత్మననీ , ప్రాణుల ఆది మధ్య అంతములు తానేననీ చెప్పుకున్నాడు . సకల జీవులలో ఉన్న కృష్ణుడు నీలో కూడా ఉండి తీరాలి . కృష్ణుడు నీ ఆత్మగా లేక నీ ఆత్మకు ఆత్మగా ఉన్నాడు .
మొదట నీలోని ఆత్మను సాక్షాత్కరించుకుంటే కృష్ణసాక్షాత్కారం అవుతుంది . ఆత్మసాక్షాత్కారమూ ,
కృష్ణసాక్షాత్కారమూ రెండూ వేరు గావు . నీవు నీ మార్గంలోనే పోవాలనుకుంటే నీ గురించి కృష్ణునికే వదలివేయి . నీవు కృష్ణునికి సంపూర్ణశరణాగతి పొందు . నీవు కోరిన ఆ సాక్షాత్కారం సంగతేదో కృష్ణునికే వదిలివేయి .
🪷🪷🪷🪷🪷🪷🪷🪷
No comments:
Post a Comment