Saturday, December 16, 2023

****ఆరోగ్యం ఆనందం సంపద

 *ఆరోగ్యం ఆనందం సంపద*
🩺🏃‍♀️🧎‍♀️😁💰💎⚓🛵🚘🏘️✈️
*రోజు 8* *తేది 16-12-2023*
*శనివారం*
*1వ భాగము: మనను*

*ఏకాగ్రత పెంచుకోవడం*

మానసిక ఏకాగ్రత యొక్క అవసరం మహోన్నత జీవనం విధానంలో నొక్కి కళ్కాణించటమైనది. ఇవాళ, మీరు మీ మనసుని దృఢపరచుకుని, అద్భుతాలు సాధించటానికి ఇంకొక వ్యాయామం నేర్చుకుంటారు. వ్యాయామం: రెండు నిముషాల మనసు

ఇది ఒక సంతోషకరమైన వ్యాయామం, ఏకాగ్రత కుదరక, ఏదో ఆలోచనల వెంట పరుగులు తీసే మనమని. లాగ్, ఆపి దృఢపరుస్తుంది ఇది. మీరు చేయాల్సిందల్లా రెండు నిముషాల సేపు మీ గడియారంలోని క్షణాల ముల్లుకేసి దీక్షగా చూడటమే! ఆ ముల్లు కేసే తీక్షణంగా చూడండి. వేరే ఏ ఆలోచనా మీ మనసులో చోటు చేసుకోకుండా చూడండి. మీ ప్రపంచం అంతా ఆ చిన్న ముల్లు కదలికలో నిబిడీకృతమై ఉంది. మీ శక్తినంతా కూడదీసుకుని మరి ఈ వ్యాయామాన్ని సరిగ్గా చేయండి. ఈ పద్ధతిని రోజులి మూడుసార్లు పాటిస్తే 21 రోజులు తిరిగేసరికి, మీరొక శక్తివంతమైన మనసుని పెంపొందించుకుంటారు.
అంతేకాదు మీ శారీరక శక్తి, మీ మానసిక ఉత్సాహం కూడా పెరిగినట్లు గమనిస్తారు..

*2 వ భాగం- శరీరం*

యోగా యొక్క ఆశ్చర్యకరమైన లాభాలు. మీ శారీరక ఆరోగ్యాన్ని అందని ఎత్తుకు తీసుకొని పోవాలనుకుంటే, యోగాని మించిన సాధనం లేదు. ప్రతి పట్టణంలోనూ యోగా క్లాసులు నడుపుతున్నారు. ఆ యోగాసనాలు వేయటానికి క్లిష్టమైనవి కాకపోగా, పైపెచ్చు మీకు కావాల్సిన విశ్రాంతినిస్తాయి. క్రమబద్ధంగా యోగా చేయటం వల్ల మీరు ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంటారు. మీరు రంగు వస్తారు. జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల బలం పెరుగుతుంది. క్షణమే ఈ ముఖ్యమైన అడుగు వేయండి! మీరేమీ నష్టపోరు సరికదా ఎంతో లాభం పొందుతారు. 

*3వ భాగము: నడవడిక*


*స్నేహం విలువ*

"స్నేహమేరా జీవితం.. స్నేహమే నా పెన్నిధి' అన్నట్టుగా మంచి స్నేహితులు ఉంటే జీవితం ఆనందమయంగా సాగటమే కాక, జీవితకాలం పొడిగింపబడుతుంది కూడా. మిచిగన్ యూనివర్సిటీ పరిశోధకులు మిచిగన్ నివాసులైన టేక్సులో, ఎక్కువమంది కుటుంబ సభ్యులు, ఎక్కువమంది స్నేహితులు ఉన్నవాళ్ళు. ఎక్కువ కాలం బ్రతికారు అని తేల్చారు. వేరే పరిశోధనల్లో పెళ్లయిన వారి జీవితకాలం పెళ్ళికాని వారికన్నా ఎక్కువేనని నిరూపించారు...

ఇవాళ మీ స్నేహపరిధిని అనూహ్యంగా విస్తృతి చేయటానికి ప్రయత్నించండి. మీరు ఇంకా. దగ్గరపుదామనుకుంటున్న ఐదుగురి స్నేహితుల పేర్లు ఏరి, ఒక కాగితం మీద రాయండి. వాళ్ళ స్నేహమంటే. మీకెందుకు ఇష్టమో కూడా రాయండి. చివరగా, వాళ్ళతో మీ స్నేహాన్ని ఎలా పటిష్టపరుచుకోవాలనుకుంటున్నారు. స్పష్టంగా వివరించండి. అది ఎలాగన్నా అవచ్చు! వాళ్ళని మెచ్చుకుంటూ ఒక ఉత్తరం రాసి, వాళ్ళకి వచ్చుతుందని మీ కనిపించిన ఒక ఆర్టికల్ వాళ్ళకు పంపటం ఒక పద్ధతి. ఏదైనా మంచి పుస్తకం కొని, స్వయంగా వాళ్లింటికెళ్లి యిచ్చి, నేను పుస్తకాల షాపుకెళితే ఈ విలువైన పుస్తకం కనబడింది. ఇద నీకు చాలా నచ్చుతుందనిపించింది." అని చెప్పటం ఇంకో పద్ధతి. లేదా ఒక స్నేహితుడితో కలసి ఆదివారం పొద్దున్న బయటకి వెళ్లి ఏదైనా తినండి, లేదా సముద్రపుటాడ్డున స్నేహితుడితో కలిసి సూర్యోదయపుటందాలు పంచుకోండి. ఒక 'ప్రేమలేఖ రాయటం కూడా ఒక పద్ధతే. ఇంతకు ముందెప్పుడూ అలాటి అవసరం వచ్చి ఉండదు మీకు. అలా రాయటం వల్ల ఆ వ్యక్తి ఎంత ముఖ్యమైన వ్యక్తి మీరు చెప్పకనే చెప్పినట్టవుతుంది.

*డాక్టర్ ఎం అశోక వర్ధన్ రెడ్డి*

💎⚓💎⚓💎⚓💎⚓💎⚓💎

No comments:

Post a Comment