Friday, December 22, 2023

ఆధ్యాత్మికంలో ఉన్నవారికి క్రమశిక్షణ నియమాలు అవసరమా? కర్మ యోగం అవసరమా? లేక క్రమ శిక్షణ , కర్మయోగం రెండూ ముఖ్యమా?

 ఆధ్యాత్మికంలో 
ఉన్నవారికి క్రమశిక్షణ నియమాలు అవసరమా? 

కర్మ యోగం అవసరమా?     లేక 
క్రమ శిక్షణ , కర్మయోగం రెండూ ముఖ్యమా?

దైవ మార్గంలో ఉన్న వారికి ముఖ్యంగా కర్మ యోగం పద్దతిలో ఉన్నవారు వారి దినచర్య లలో ప్రతి కార్యం  కర్మ ప్రకారమే ఉందని భావించి కార్యం చేస్తారు.. అటువంటి సమయంలో చెడు పనులు కూడా సాక్షిగా ఉండి చేయవలసి వస్తుంది.... అటువంటప్పుడు ఎలా??? అని ఆలోచిస్తే.... కర్మ యోగి కి కార్యం లో పాపం రాదు కాని... 
కానీ భక్తి యోగమైన భగవద్గీత జ్ఞాన ప్రచారం చేసే భక్తుల నడవడిక కూడా చాలా ముఖ్యమని భావించాలి.... 

నువ్వు దైవ సేవ చేయకపోయినా పర్వాలేదు కానీ చెడ్డ పేరు మాత్రం తీసుకు రాకూడదు, అది చాలా పెద్ద పొరపాటు  ...

ఉదాహరణకు ఒక వ్యక్తి మద్యపానం తీసుకుంటూ నేను ఆధ్యాత్మికంగా బాగానే ఉన్నాను అని అనుకుంటూ ఉంటే అతను మెల్ల మెల్లగా అపమార్గం పట్టి పోతాడు, ప్రజలు కూడా అతనిని అతని జ్ఞానం ను చులకనగా చూసే అవకాశం ఉంది.... 

అందువల్ల  మద్య పానం తీసుకోవడం ఆత్మ ద్రోహం అని తెలిసి మనసులో ఆత్మ ను ప్రార్ధించడం వల్ల,, నీకు ఆత్మ ఆ కర్మ ను ఎలా తొలగించి వేసిందో.... 
అలానే నాకు మంచి నడవడిక ను ఇవ్వు అని నా వల్ల ఆశ్రమమునకు గాని, జ్ఞానం నకు గాని, గురువుకు గాని చెడ్డ పేరు రాకూడదు అని అంతరాత్మను  వేడుకుంటే , తప్పక మనకు చెడ్డకర్మ ప్రభావం నశించి ... ఆదిత్యయోగీ..

ప్రపంచ చెడు పనులు తొలగుట వలన ఇతరులు మన జ్ఞానం ను అపార్థం చేసుకునేందుకు అవకాశం ఉండదు....
కావున మనమందరం దైవాన్ని  శరణువేడి క్రమశిక్షణ తో గురువు మార్గంలో సదా నడచునట్లు జ్ఞానం నకు ఎటువంటి అపఖ్యాతి రాదు...

దేనిని మనం గ్రహించ వలసినది? – 
“గురు వచనం. 
ఉపాదేయము గురువచనమే. వారి ఉపదేశములే మనకు శిరోధార్యములు.

 “కో గురుః? – గురువెవ్వరు?” –

 “యో అధిగతతత్త్వః శిష్యహి తాయోద్యతః సతతం” – గురువు తత్త్వాన్వేషణ చేసి తత్త్వజ్ఞుడై ఉండాలి. 
అతడు అనుభవశాలిగా ఉండవలె. 

అట్టి గురువు, అన్ని కాలములలోనూ శిష్యుని హితాన్ని ఉద్దేశించి పాటుపడుతూ ఉంటాడు. “శిష్యహి తాయోద్యతః సతతం”.

శిష్యుని హితమేది? 
అతనిని కర్మ బంధం నుండి తప్పించి, సంసార విమోచనతో అతనికి మోక్ష సౌఖ్యం కల్గించడమే గురువు చేసే హితచర్య. 

గురువుకు చేసే నమస్కార క్రియ శిష్యునికి ఆ హితాన్ని చేకూరుస్తుంది. గురువు యొక్క కృపాధార అనే కనకధార అతనిపై వర్షిస్తుంది. అందుచేత మనకు ఆ ఒక్క నమస్కారమనే సంపద ఉంటే చాలు. వేరే ఏదీ అక్కరలేదు...

No comments:

Post a Comment