Wednesday, December 20, 2023

కాలంతో పాటు మనం కూడా మారాలి అనే వింత పోకడ లో పెళ్లి లో చేస్తున్న తప్పులు

 *కాలంతో పాటు మనం కూడా మారాలి అనే వింత పోకడ లో పెళ్లి లో  చేస్తున్న తప్పులు* 👇

*👉 నిశ్చయ తాంబూలానికే జంటను కలపడం*,

*👉 పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్లు చేయటం*,

*👉 గొప్ప కోసం ఈవెంట్స్ చేయటం*,

*👉 ఆర్భాటంగా మండపాలు కట్టడం*,

*👉 మెహిందీ పేరుతో,సంగీత్ పేరుతో తాగి తందనాలాడడం*..

*👉 డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం*,

*👉 బ్రైడల్ మేకప్పంటూ  రెచ్చిపోవడం*,

*👉 పట్టెడన్నానికి ప్లేటు రేటు పెంచుతూ* *పోవటం ,ఆప్యాయత అన్న పదానికి అర్ధమే లేకుండా పోవడం*..

*👉 దావత్ పేరుతో మద్య, మాంసాలను సేవించి,వికృత నాట్యాలు చేయడం*,

*👉 కడుపు కట్టుకుని దాచింది హారతిచేయటం,లేదా అప్పులు చేయడం (విది లేక)*

*మధ్యతరగతి మనిషికి అవసరమా..?*

*👉 ఒకడిని చూసి ఒకడు*,

*👉 ఒకడ్నిమించి ఒకడు*
*వెర్రెక్కి పోతున్నారు*
*నేటి కాలంలో*.

*ఎంత తింటాడు మనిషి*?
*దేంట్లో దొరుకుతుంది వినోదం*?
*ఎలా చేయాలి వేడుక*?
*ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం*?
*ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత*?
*ఏది కడితే వస్తుంది హుందాతనం*?
*ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం*?
*ఎలా పెరుగుతుంది ఆకర్షణ*?

*👉 ఏ విధంగా బలపడుతుంది బంధం*?
*ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే*,
*పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ*.

*పదిమందితో పట్టెడన్నం తింటే*,
*మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే*,
*కార్యం జరిగే ఇంట చేతనైనంత సాయం చేస్తే*,
*సహజమైన అందానికి పెద్దపీట వేస్తే*, 
*సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే*,
*దాచిన సోమ్ము సద్వినియోగ పడితే*,
*కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు*.

*👉 ముహూర్తం చూసి పారేసే కార్డుకి*,
*పెళ్ళయిన వెంటనే తీసేసే పందిరికీ*,
*చెమటపడితే కారిపోయే రంగుకీ*,
*పెళ్ళినాడు మాత్రమే కట్టే వలువలకీ*,
*నాలుగు మెతుకు తింటే నిండిపోయే కడుపుకీ*,
*సరదాగా కబుర్లు చెపితే వచ్చే నవ్వుకీ*,
*ఒక్కరోజులో ముగిసిపోయే వేడుకకీ*,
*ఉన్నదంతా ఊడ్చిపెడితే*
*పదికాలాలు బతకడానికొచ్చే* 
*కొత్తమనిషికి*
*తర్వాత పెట్టేది ఏమిటి*?

*👉 అప్పు చేసి ఖర్చుచేసే*,
*వెర్రితనం కాదు పెళ్ళంటే*!
*ఇంటికి దీపాన్ని తెచ్చుకునే*
*ఇంగితమైన పని వివాహ మంటే*!
*శక్తికి మించి ఎగరటం*,
*అప్పుచేసి ఆర్బాటం చేయటం*
*ముమ్మాటికీ తప్పు👌*.

*కళ్యాణానికి కాస్త ఖర్చు చాలు, కలిసుండటానికే కావాలి ధర్మ,అర్ధములు*. *ఇది తెలుసుకున్ననాడు ప్రతినిత్యం బ్రతుకులో శ్రీరస్తు! శుభమస్తు! అవిఘ్నమస్తు*
🙏🏻🙏🏻🙏🏻🔔🔔
  🤝

No comments:

Post a Comment