*తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు మన అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు---//-*
*మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు మాత్రమే అని మనము గ్రహించ గలము...*
*మనము బాల్యం లో ఉన్నప్పుడు, అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు మనతో సన్నిహితముగ ఆడుకున్న వారే.*
*ప్రతిరోజూ, మనము ఒకరిని ఒకరు వెంబడిస్తూ & సందడిగా ఉల్లాసంగా గడిపాము & కలిసి మంచి బాల్యాన్ని గడిపాము.*
*పెద్దయ్యాక, మనము మన స్వంత కుటుంబాలను కలిగిన తరువాత , మన స్వంత ప్రత్యేక జీవితాలను గడుపుతాము & సాధారణంగా అరుదుగా కలుసుకుంటాము. మనందరినీ కనెక్ట్ చేసే ఏకైక లింక్ మన తల్లిదండ్రులు.*
*మనం వృద్ధాప్యం సమీపించే సమయానికి అప్పటికే మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టి వెళ్తారు మరియు మన చుట్టూ ఉన్న బంధువుల సంఖ్య తగ్గిపోతుంది, అప్పుడే మనకు క్రమంగా ఆప్యాయత విలువ తెలుస్తుంది.*
*నేను ఇటీవల ఇంటర్నెట్లో ఒక వీడియోను చూశాను, అందులో 101 ఏళ్ల అన్నయ్య తన దూరపు 96 ఏళ్ల చెల్లెల్ని చూడటానికి వెళ్లాడు.* *కొంత సమయం గడిపిన తర్వాత ఇద్దరూ విడిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, చెల్లెలు తన అన్న కారుని వెంబడించి, తన సోదరుడికి కొంత డబ్బు ఇచ్చి, తినడానికి ఏదైనా మంచిది కొనుక్కోమని కోరింది. ఆమె మాటలు చెప్పడం పూర్తికాకముందే ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.*
*ఇంత వృద్ధాప్యంలో కూడా అన్నదమ్ములు మరియు అక్కాచెల్లెళ్లు ఉండటం నిజంగా చాలా అదృష్టమే...*
*అవును, ఈ లోకంలో మనకు రక్తసంబంధం ఉన్న వ్యక్తిని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది.*
*మీరు పెద్దవారైనప్పుడు & మీ తల్లిదండ్రులు ఇద్దరూ వెళ్లిపోయినప్పుడు, మీ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఈ ప్రపంచంలో మనకు అత్యంత సన్నిహితులవుతారు*
*స్నేహితులు దూరంగా వెళ్లిపోవచ్చు, పిల్లలు పెరిగి ఎగిరి పోవచ్చు కానీ మీ పక్కన మీ జీవితభాగస్వామి తప్ప, మీ జీవితపు చివరి అంకాన్ని పూర్తి చేయడానికి మీ అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు మాత్రమే వుంటారు*
*మనము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు ఒకచోట చేరడం చాలా ఆనందంగా వుంటుంది*
*వారితో కలిసిమేలిసి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా భయపడం. మనము వృద్ధాప్యానికి చేరుకున్న తరుణంలో దయచేసి మీ అన్నదమ్ములు అక్కాచెల్లెల్ల తో కరుణ మరియు దయతో ఉండండి.*
*గతంలో ఏది జరిగినప్పటికీ ఏది ఏమైనఅయినప్పటికీ, అన్నదమ్ములు అక్కాచెల్లెలళ్లు మరింత సహనంతో మరియు ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండాలి.*
*అన్నదమ్ముల అక్కాచెల్లెళ్ల మధ్య విడదీయలేని ముడి లేదు. తొలగించలేని కవచం లేదు.*
*ఎప్పుడూ పాత చేదు సంగతులజోలికి వెళ్లకూడదు లేదా పాత పగ ద్వేషం పెట్టుకోకూడదు. ఎక్కువగా పరస్పర ఆధారపడటం & పరస్పర ప్రేమతో, సంబంధాలు మెరుగవుతాయి*
*ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైన బహుమతులు మన అన్నదమ్ములు అక్కాచెల్లెళ్లు---//-🙏
No comments:
Post a Comment