మహాత్ముల మహితోపదేశాలు!
*_నీ గురించి నీవే డబ్బ కొట్టుకోకు, నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలంటే... వంద మంది గొప్పవాళ్ళ గురించి నీవు ముందు తెలుసుకోవాలి._*
*_కోపగించుకోవడం అంటే మనమీద మనమే ప్రతీకారం తీర్చుకోవడం._*
*_ప్రతీకారం అంటే కుక్క మనల్ని కరిచిందనీ మనం కుక్కను కరవటం లాంటిది._*
*_ప్రతీకారం సాధారణంగా_*
*_ఒక చిన్న ఒప్పుని చాలా పెద్ద తప్పుగా మారుస్తుంది_*
*_ప్రతీకారానికి అంతు అనేదుండదు_*
*_కన్నుకు కన్నె సమాధానమైతే లోకంలో మిగిలేది చీకటే._*
*_ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో ఉండదు. అతని మంచి హృదయంలో ఉంటుంది._*
*_వ్యక్త్విత్వన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్టే, ఎంత గొప్పగా జీవించావో నీ చేతలు చెప్పాలి, ఎంత గొప్పగా మరణించావో పరులు చెప్పాలి._*
*_నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు మారవచ్చు కాని, మనం చేసిన మంచి ఎన్నటికీ మారదు. చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది... మంచి పని నిన్ను ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది._*
No comments:
Post a Comment