Friday, February 23, 2024

గర్భరక్షాంబిక కథ

 🌹🙏గర్భరక్షాంబిక మంత్రాలను పఠించండి🙏🌹

గర్భరక్షాంబిక అంటే పుట్టబోయే బిడ్డను రక్షించే తల్లి అని అర్థం. తమిళనాడు రాష్ట్రంలో పాపనాశనం అనేచోట ఈ గుడి ఉన్నది.

తిరుకవుగార్ అనే చిన్న తాలూకాలో ఈ ఆలయం ఉన్నది. శివపార్వతులు ఈ గుడిలో గర్భరక్షాంబికై, ముల్లివన నాథార్ అవతారాలలో దర్శనమిస్తారు.

తమిళనాడులోని అమ్మవారి రూపాలలో గర్భరక్షాంబికై ప్రాముఖ్యమైనది. అమ్మవారు పుట్టబోయే బిడ్డను కాపాడుతుందని నమ్ముతారు. పిల్లల్లేని వారు కూడా ఈ అమ్మవారిని కొలుస్తారు.

గర్భరక్షాంబిక కథ

అనగనగా ఒకప్పుడు నిధృవ అనే మహర్షి ఉండేవారు. ఆయన తన భార్య వేదికతో ఆశ్రమంలో నివసించేవారు. పిల్లల్లేని వారికి ఎన్నో పూజల తర్వాత, పార్వతీదేవి ఆశీస్సులతో వేదిక గర్భం దాలుస్తుంది. నెలలు నిండేవరకు ఆమె ఆరోగ్యంగానే ఉన్నది.

ఆఖరి నెలలలో ఉండగా, నిధృవ మహర్షి వరుణదేవుడ్ని కలవడానికి వెళ్తాడు. అతని భార్య ఆశ్రమంలో ఒంటరిగా ఉంటుంది. ఆమె పనులతో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది.
ఆ సమయంలో, ఊర్ధవపాద అనే మహర్షి ఆశ్రమానికి వస్తారు. వేదిక గర్భవతని తెలీక, ఆమె అతనికి అతిథి సత్కారాలు చేయలేదని ఆగ్రహిస్తాడు. ఆయన వేదికను రాయత్చు అనే అరుదైన వ్యాధికి గురవుతుందని శపిస్తాడు.

ఈ వ్యాధి వేదికను మాత్రమే కాక ఆమె బిడ్డపై కూడా ప్రభావం చూపిస్తుంది. వేదిక పార్వతి అమ్మవారిని శరణుకోరుతుంది. పార్వతీదేవి దర్శనమిచ్చి పుట్టబోయే బిడ్డను పుట్టేవరకూ కలశంలో భద్రపరుస్తుంది.

బిడ్డ పుట్టాక అతని పేరు నైధృవన్ అని పెడతారు. వాడికి పార్వతీపరమేశ్వరుల ఆశీస్సులు వుంటాయి. కామధేనువు అతనికి పాలిస్తుంది. నిధృవ మహర్షి ఈ కరుణకి పొంగిపోయి పార్వతీపరమేశ్వరులను అక్కడే ఉండిపొమ్మని కోరతాడు.

ఈ విధంగా వారు వేదికను రక్షించిన విధంగా తిరుకవుగార్ లో గర్భరక్షంబికై, ముల్లైవన నాథార్ రూపాలలో భక్తులను కాపాడుతున్నారు. ప్రతి స్త్రీ ఈ అమ్మవారిని రక్షకోసం ప్రార్థించవచ్చు.
గర్భరక్షాంబికై గాయత్రి మంత్ర

"ఓం గర్భరక్షాంబిగాయై చ విద్మహే

మంగళ దేవదాయై చ ధీమహీ

ధన్నో దేవి ప్రచోదయాత్"

గర్భరక్షాంబికై స్తోత్రం

ఈ స్తోత్రం బిడ్డ పుట్టేవరకూ చదవండి.

శ్లోకం-1
ఏహ్యహి భగవాన్ బ్రహ్మన్, ప్రజా- కర్తాహ ప్రజాపతే ।
ప్రగ్రిహ్నీష్వ బలిం స-ఇమాం సాపత్యం రక్ష గర్భీణం ॥

అర్థం ; ఓ బ్రహ్మా, సృష్టికర్తా, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించు.

శ్లోకం -2
అశ్వినౌ దేవ దేవేశౌ, ప్రగ్రుహ్నీధన్ బలిం ద్విమాం ।
సాపత్యం గర్భిణీం స-ఇమాం స రక్షతం పూజయానయా ॥

అర్థం ; ఓ అశ్వినీ దేవతలారా, దైవ వైద్యులారా, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించు.

శ్లోకం -3
రుద్రాక్ష ఏకాదంశ బ్రోక్త, ప్రగ్రహనంతు బలిం ద్విమాం । యక్షమాగం ప్రీతయే వృతం, నిత్యం రక్షంధు గర్భిణీం ॥

ఓ పదొకొండు రుద్రులారా, మీకు నచ్చిన ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి.

శ్లోకం -4
ఆదిత్యా ద్వాదశ బ్రోక్తహ, ప్రగ్రిమ్నీత్వం బలిం త్విమం । యశ్మాకం తేజసం వృధ్య, నిత్యం రక్షత గర్భిణీం ॥

ఓ పన్నెండు సూర్యదేవతలారా, మీ కాంతిని మాపై ప్రసరించి, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి.

శ్లోకం -5
వినాయక గణాధ్యక్ష, శివపుత్ర మహాబల ।
ప్రగ్రిహ్నీశ్వ బలిం స- ఇమం, సాపత్యం రక్ష గర్భిణీం ॥

అర్థం ; ఓ వినాయక, ఓ గణేషా, ఓ పరమశివ పుత్రా, శక్తికి ప్రతిరూపమా, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి.

శ్లోకం -6
స్కంధ షణ్ముగ దేవేశ పుత్ర ప్రీతి వివర్ధన ।
ప్రగ్రిహ్నీస్వ బలిం స-ఇమం, సాపత్యం రక్ష గర్భిణీం ॥

అర్థం ; ఓ స్కందా, ఆరుతలల దేవా, దేవతలకే అధిపతి, మా బిడ్డలపై ప్రేమను పెంచే దేవతలారా, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి

శ్లోకం -7

ప్రభాసహ ప్రభవస్యమహా ప్రత్యోషౌ మారుథోఎనాలహ ।
ద్రువోధర ధరసైవ, వాసవోఎస్తో ప్రకీర్తితహ ।
ప్రగృహ్నీత్వం బలిం స-ఇమం, నిత్యం రక్షతహ గర్భిణీం ॥

అర్థం ; ఓ ప్రభాసా, ఓ ప్రభవా, ఓ శ్యామా, ఓ ప్రత్యూషా, ఓ మారుత, ఓ అనలా, ఓ ధృవా, ఓ ధురధురా, ఎనిమిది వసువులారా, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి.

శ్లోకం -8
పితుర్దేవి పిధుశ్రేష్టే, బహు పుత్రీ మహా బలే ।
భూధ శ్రేష్టే నిశ వాసే , నిర్విర్తే షౌనగప్రియే ।
ప్రగ్రిహ్నీస్వ బలిం స -ఇమం, సాపత్యం రక్ష గర్భిణీం ॥

అర్థం; అందరు స్త్రీలనూ కూతుళ్ళుగా పొందిన అమ్మా, శక్తిరూపిణి, అందరికన్నా గొప్పదైన తల్లీ, చీకటిలో మమ్మల్ని కాపాడే అమ్మ, అందానికి ప్రతిరూపమా, శౌనకునిచే పూజింపబడ్డ తల్లి, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి.

శ్లోకం -9
రక్ష రక్ష మహదేవ, భక్త - అనుగ్రహ కరగ ।
పక్షి వాహన గోవింద, సాపత్యం రక్ష గర్భిణీం ॥

అర్థం ; గొప్పవాడైన స్వామి, మమ్మల్ని కరుణతో కాపాడి రక్షించు, వరాలిచ్చే గోవిందుడా, పక్షివాహనాన్ని అలంకరించిన స్వామీ, ఈ నైవేద్యాన్ని స్వీకరించి, కుటుంబ జీవనంలోకి అడుగిడుతున్న ఈ ఇల్లాలిని అన్ని అపాయాలనుంచి రక్షించండి.

🌹శ్రీ మాత్రే నమః 🌹

No comments:

Post a Comment