Tuesday, March 26, 2024

స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము* *జ్ఞానుల లక్షణాలు - 2

 *త్రిపురా రహస్యము - 67*
================

*స్వామి దత్తాత్రేయ  విరచిత ఆత్మ జ్ఞాన యోగము*
 
*జ్ఞానుల లక్షణాలు - 2* 

ఇతర జ్ఞానులను పరిక్షించటం : పరశురామా ! ఇతరులకు ఈ లక్షణాలు ఉన్నాయో, లేదో పరిక్షించటం సాధ్యం కాదు. ఎందుకంటే కొంతమందిలో ఈ లక్షణాలున్నా అవిపైకి - కనిపించవు.. కొంతమంది అవి లేకపోయినా, ఉన్నట్టుగా నటిస్తారు. అపరాధము, కర్మ, కామము అనే వాసనలు లేనివారికి సాధన ప్రారంభంలొనే జ్ఞానం సిద్ధిస్తుంది. కాని  వారి పూర్వవాసనలు వూర్తిగా పోకపోతే వారుకూడా సామాన్యులలాగానే కనిపిస్తారు. వారిలో ఈ లక్షణాలు కనపడవు. 
 
అందుచేతనే జ్ఞానులు కానివారు జ్ఞానులను పరిక్షించలేరు. ఇక జ్ఞానులు, తొము జ్ఞానులై ఉండి కూడా అజ్ఞానులులాగా ప్రవర్తించటం సహజం కాబట్టి, వారు ఇతరులను గుర్తించగలుగుతారు. 

జ్ఞానుల వ్యవహారం :
అధమ స్థితిలో ఉన్నవారికి, ఉత్తమ జ్ఞానులకున్నట్లుగా నిరంతర సమాధిస్థితి ఉండదు. సోహం అనే భావన ఉంటేనే వారికి ఆ స్థితి కలుగుతుంది. 

అప్పుడే దేహాత్మభావన నశిస్తుంది. మిగిలిన సమయాలలో దేహాత్మభావన ఉంటుంది. ఆ సమయంలో వారుకూడా మూఢులలాగానే ప్రవర్తిస్తారు. మధ్యమధ్య వారు సంపూర్ణ సమాధిస్థితి పొందుతారు. ఆ స్థితిలో సంసార బంధనాలుండవు. 
 
ఇక మధ్యమతశ్రేణి జ్ఞానులు : 
వీరికి ఏ విధమైన దేహసంబంధము ఉండదు. దేహమే ఆత్మ అనే భ్రాంతి ఆసలే ఉండదు. నిరంతరము అభ్యాసం చెయ్యటంవల్ల వారి మనస్సు ఎప్పుడూ లయ స్థానంలోనే ఉంటుంది. 

అందువల్ల అతడు ఎప్పుడూ సమాధిస్థితిలోనే ఉంటాడు. మనస్సు సంకల్పరహితంగా ఉంటుంది. లోకవ్యవహారాలుండవు. శరీర సంబంధముందడదు. శరీరం నిలవాలి కాబట్టి అన్నపానాదులు తీసుకుంటాడు. అంతే వాటివల్ల అతడికి ఏ బంధనాలు అంటవు. సుషుప్తిలో ఉన్నవాడు ఏం మాట్లాడినా వాడికి తెలియదు. 

అలాగే లోకజ్ఞానం లేని ఈ యోగి ఏం మాట్లాడినా, ఏం చేసినా అతనికి తెలియదు. ఇతడు కేవలము ప్రారబ్దంవల్ల మాత్రమే దేహయాత్ర సాగిస్తాడు. 
 
ఉత్తమజ్ఞానికి కూడా దేహసంబంధముండదు. దేహం చేసే పనులు నావే అని అభిమానము ఉండదు. అయినా రథసారథిలాగా ఈ దేహాన్ని నడిపిస్తూనే ఉంటాడు.
 
రథం నడుస్తూ ఉంటే నేనే ఈ రథము, నేను నడుస్తున్నాను అనుకోడు. ఈ రకంగా ఉత్తమజ్ఞాని దేహం కలవాడూ కాదు. దేహవ్యాపారీ కాదు. అతడు శుద్ధచిన్నాత్రుడు. 
 
ఉత్తమ, మధ్యమ జ్ఞానులలో భేదం : సాధనలో భేదంవల్లనె వారిలో కూడా ఖేదం వచ్చింది. మనస్సును బాగా నిగ్రహించినందున మధ్యమయోగికి ఆ స్థితి వచ్చింది. నిరంతరం సో హం అనటంవల్ల ఉత్తముడికి ఆ స్థితి వచ్చింది. 
 
అని జ్ఞానుల యొక్క లక్షణాలను దత్తాత్రేయుడు పరశురాముడికి వివరించాడు అన్నాడు రత్నాకరుడు. 

🌻. బ్రహ్మ రాక్షసుడు- 1 🌻 
 
“గురువర్యా ! జ్ఞానుల లక్షణాలు, వారి మధ్య తేడాలను దత్తాత్రేయుడు.వివరించాడు కదా ! ఆ తరువాత ఏం జరిగింది?” అంటూ ప్రశ్నించాడు నారాయణభట్టు. చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు.  
ఇంత చెప్పినా పరశురాముడి సందెహాలు తీరలేదు. అందుకని ఒక ఛిన్నకథ చెప్పటం మొదలుపెట్టాడు దత్తాత్రేయుడు. 
 
పూర్వకాలంలో నిపాశా నదీ తీరంలో అమృతము అనే నగరం ఉండేది. ఆ నగరాన్ని రత్నాంగదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు.. అతనికి రుక్నాంగదుడు, హేమాంగదుడు అని ఇద్దరు కుమారులున్నారు. వీరిలో పెద్దవాడు పండితుడు. చిన్నవాడు మహాజ్ఞాని.  
 
ఒకసారి వసంతకాలంలో వీరిద్దరూ వేటకి వెళ్ళారు. అలా పోయిపోయి కీకారణ్యంలో ప్రవేశించారు. అక్కడ అనేక జంతువులను వేటాడి బాగా అలసిపోయారు. బాగా దాహం వేసింది. దూరంగా ఒక సరస్సు కనిపించింది. నీరు త్రాగుదామని ఆ సరస్సు దగ్గరకు వెళ్ళారు రాకుమారులు. దాని వద్దున ఒక పెద్ద మగర్రిచెట్టున్నది. దానిని ఆశయించుకుని బ్రహ్మరాక్షసుడు ఒకడున్నాడు. 
 
ఆ రోజుల్లో మగధదేశం పండితులకు పెట్టింది పేరు. అందులో వసుమంతుడు అనే పండితుడుండేవాడు. అతడు సర్వశాస్త్ర పండితుడు. అహంకారి. శుష్కతర్మంలో మహనిపుణుడు. అనేక సభలలో పండితులను జయించాడు. దానితో మహాగర్విష్టి అయినాడు. 

ఒక రోజు రాజుగారి ఆస్థానానికి వెళ్ళాడు. రాజాస్థానంలో అష్టకుడు అని ఒక పండితుడున్నాడు అతడు వేదవేదాంగవిదుడు. శాస్త్రవేత్త, ఉత్తముడు. నిగర్వి అతన్ని వాదనకు ఆహ్వానించాడు వసుమంతుడు. 

ఇద్దరికీ వాదన మొదలైంది. అష్టకుడు చెప్పిన శాస్త ప్రమాణమైన విషయాలను వసుమంతుడు తనకు తర్మంతో ఖండించటం మొదలుపెట్టాడు. అష్టకుడు అనేక విధాల అవమానపరచాడు. నిందించాడు. అయినప్పటికీ ఆతడు ఏ మాత్రం చలించలేదు. 

కాని అష్టకుని శిష్యుడైన కాశ్యపుడు, తన గురువుగారికి జరిగిన అవమానం భరించలేక కోపించి వసుమంతుణ్ణి బ్రహ్మరాక్షసిగా పుట్టమని శపించాడు. దాంతో వసుమంతుడు తన తప్పు ఒప్పుకొని, శాపవిమోచనం చెప్పమని ప్రాధేయపడగా నీ ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్పినప్పుడు నీకు శాపవిమోచనం కలుగుతుంది అన్నాడు కాశ్యపుడు. ఆ విధంగా బ్రహ్మరాక్షసి అయిన వసుమంతుడు ఇప్పుడు ఆ మర్రిచెట్టు మీద ఉన్నాడు.
                                                      
🪷⚛️✡️🕉️🪷

No comments:

Post a Comment