త్రిపురా రహస్యము - 66
~~~~~
స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము
జ్ఞానుల లక్షణాలు - 1
గురువర్యా! విద్యాగీతను విన్న తరువాతైనా పరశురాముని సంశయాలు తీరినాయా? ఆ తరువాత ఏం జరిగింది ? అంటూ ప్రశ్నించాడు కృష్ణశర్మ చెప్పటం ప్రారంభించాడు రత్నాకరుడు.
దత్తాశ్రీయుని మాటలు విన్న పరశురాముడు అజ్ఞానబంధనాల నుండి విడివడినట్లుగా భావించాడు. అయినా చిన్న అనుమానం వచ్చింది. అప్పుడు గురువర్యా ! సులభము, సారభూతము, నిశ్చలము, సాక్షాత్తూ ఫలాన్ని ఇచ్చే విజానసాధనం ఏమిటో తెలపండి. జ్ఞానులను గుర్తించటం ఎలా ? జ్ఞానుల లక్షణాలు ఎవి ? వారు దేహభావన ఉన్నప్పుడు ఎలా ఉంటారు ? లేనప్పుడు ఎలా ఉంటారో తెల్పండి. అన్నాడు. ఆ మాటలు విన్న దత్తాత్రేయుడు “రామా ! జ్ఞానసాధన రహస్యాన్ని తెలియచేస్తున్నాను వినవలసినది అంటూ ప్రారంభించాడు.
🌻. ఉత్తమ జ్ఞానసాధనం :
పరశురామా ! సాధనలన్నింటిలోకి దేవతానుగ్రహమే ఉత్తమ జ్ఞాననాధనం. దేవత “వీడు నా భక్తుడు. ఇతడి కోరిక తప్పక తీరాలి” అనుకుని, అతణ్హి తనవాడుగా (గ్రహిస్తుంది. అందుకనే ఇది సర్వోత్కృష్టమైనది. మానవుడు త్రికరణశుద్ధిగా నిరంతరము జపము, ధ్యానము. కర్మ మొదలైనవాటితో దేవతను గనక ధ్యానించినటైతే, అతడికి తేలికగా జ్ఞానం కలుగుతుంది. ఇది సర్వోత్తమమైన సాధనము. అయితే 'తత్పరత్వం' ఉన్నప్పుడే జ్ఞానం కలుగుతుంది.
సర్వసాధనాలకు ఫలితము విజ్ఞానమే. విజ్ఞానము అంటే - సర్వాన్నీ ప్రకాశింపచెస్తూ సర్వానుగతంగా ఉన్న సామాన్యమైన చితి. ప్రకాశరూపమైన ఆ చితికి ఆవరణ కల్పితమైనది. అయితే శ్రవణము, మననము మొదలైన వాటివల్ల “దేహమే ఆత్మ' అనే ఆవరణ, బ్రాంతి తొలగిపోతుంది. అప్పుదు 'సోహం! అతడే నేను అనే జ్ఞానం కలుగుతుంది. దానివల్లనే ఆత్మ దర్శనమవుతుంది.
స్తీ వ్యామోహము, సిరిసంపదల మీద ఆసక్తి గలవాడికి అంటే - బహిర్ముఖుడైన వాడికి ఈ జ్ఞానం కలగదు. దేవతా తత్పరుదైనవాడు వైరాగ్యాన్ని అంతగా అపేక్షించడు. అయితే పరోక్షజ్ఞానం మాత్రం సంపాదిస్తాడు. తాను పొందిన దానిని ఇతరులకు నిరూపిస్తాడు. ఎప్పుడూ ఇలా నిరూపిస్తూ ఉండటంవల్ల అతని మనస్సు చిదాకారాన్ని పొందుతుంది. ఇతరులకు చెబుతున్న కొద్దీ, ఆది అతడిలో గట్టి పడుతుంది. అతని చిత్తం శివమయమవుతుంది. అతడు ఈ జగత్తునంతా శివరూపంగానే చూస్తాడు. అతడికి హర్నోద్వేగాలుండవు. అతడు జీవన్ముక్తుడౌతాడు. ఈ రకంగా భక్తి రూపంతో కూడిన జ్ఞానము మోక్ష సాధనమవుతుంది.
🌻. జ్ఞానుల లక్షణాలు :
జ్ఞానం యొక్క లక్షణం ఎమిటి అంటే శుద్ద చిన్మాత్రరూపంగా ఉండటం అందుకే జ్ఞానము అనేది కళ్ళకు కనపడదు. చెవులకు వినపడదు. కాబట్టి జ్ఞానుల లక్షణం ఇదీ అని తెలుసుకోవటం కష్టం. కేవలము వేషము, భాష, అలంకారము, మొదలైనవాటివల్ల ఎవరి పాండిత్వాన్నీ తెలుసుకోలేము. నిజంగా చెప్పాలంటే ఎవరి విద్వత్తు వారికే తెలియాలి. పదార్థంలో తీపి ఎంత ఉన్నది అంటే - అది తిన్నవారికే తెలుస్తుంది. అలాగే జ్ఞానియొక్క లక్షణం జ్ఞానులకు మాత్రమే తెలుస్తుంది. వారి మాటలు, చేష్టలద్వారా జ్ఞానులు గుర్తించబడతారు.
జ్ఞానులు కాని వారు కూదా ప్రసన్నంగా మాట్లాడటము, వైరాగ్యం ప్రదర్శంచటము, మొదలైన లక్షణాలను వారి వేషభాషల్లో చూపుతారు. నిర్మలమైన అంతఃకరణ లేనివారు కూదా కొంత ప్రయత్నం చేసి పై లక్షణాలు చూపిస్తారు. అవి వారికి సహజ లక్షణాలు కావు. కేవలము ప్రయత్నం మీద అబ్బేవే.
జయాపజయాలు, మానావమానాలు పొందినప్పుడు వికారం పొందనివాడు, ఆత్మ సాక్షాత్మారం పొందినప్పుడు వెంటనే చెప్పగలవాడు, ఉత్తమజ్ఞాని. జ్ఞాన సంబంధమైన ప్రసంగాలలో ఉత్సాహము ప్రదర్శించటము, జ్ఞానక్రమాన్ని నిరూపించటము, సహజంగా ఏ పనికీ పూనుకోకపోవటము, సంతోషము. దుఃఖము లేకపోవటము, అరిషడ్వర్గాలను జయించటము, పెద్దపెద్ద ఆపదలు వచ్చినా సరే ప్రశాంతంగా ఉండటము, ఇవన్నీ ఉత్తమజ్ఞానుల లక్షణాలు. తనను తాను పరిక్షించుకోవటానికి ఇవన్నీ ఉపయోగిస్తాయి.
సాధకుడు ఎప్పుడూ తనను తాను పరిక్షించుకుంటూ ఉండాలి. ఈ లక్షణాలు అలవరచు కోవటానికి ప్రయత్నించాలి. ముందుగా తనను తాను పరిక్షించుకుని, ఆ తరువాత ఆ లక్షణాలు ఇతరులలో ఉన్నాయో లేదో చూడాలి. అయితే ఇతరుల గుణదోషాలు ఎంచే కన్న తన గుణదోషాలనే ఎక్కువగా ఎంచుకోవాలి. అప్పుడే అతనిలోని దోషాలు పోయి, మంచి లక్షణాలు నిలుస్తాయి.
🪷⚛️✡️🕉️🪷
No comments:
Post a Comment