ఆయనకు 92 ఏళ్ల వేల కోట్లా రూపాయలకు అధిపతి .ఆయనకు కొరిక ఒకటే అయోధ్యా రామ మందిరంలో బాల రాముడు దర్శనం.92 ఏళ్లుగా ఎంతో మంది రాజుల ను ప్రధానమంత్రిల ను చూశాడు . రాజీవ్ గాంధీ లాంటి పెద్ద రాజకీయ నాయకుల కు వైద్య సేవలు అందించారు. ఎవరి వల్ల కాలేదు. చివర దశలో 500 సంవత్సరాల తర్వాత కారణ జన్మడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి చేతుల మీదుగా రామ జన్మ మందిర ఆవిష్కరణ జరిగింది. మనవళ్లు మనవరాళ్లు సహాయం తో చలో అయోధ్యా అంటూ అయోధ్యా బాల రామ దర్శనం చేసుకొని మహా ఆనంద పడ్డారు. రామ రామ అంటూ పులకరించి పోయారు. ఈ జన్మకు ఇది చాలు అన్నారూ. ఇక్కడి భక్తులకు ఉచితంగా అత్యవసర సేవలను అందిస్తామంటూ తెలిపారు. ఆయన ఎవ్వరు కాదు. తెలుగు వాడు. ఆధునిక వైద్య విప్లవానికి బీజం వేసినవారు.
Dr. c. Prathap Reddy: చాలా మంది తమ వ్యాపారాలను కొంత వయస్సు వచ్చిన తర్వాత తరువాతి తరానికి అప్పగిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న వ్యక్తి మాత్రం తన 92 వ ఏట కూడా కంపెనీలను దగ్గరుండి నడిపిస్తూ జోష్ కొనసాగిస్తున్నారు.ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ప్రతాప్ రెడ్డి సక్సెస్ స్టోరీ గురించే. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు అండ్ ఛైర్మన్. 1970లలో అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన రెడ్డి తర్వాత 1983లో కంపెనీని స్థాపించారు. ప్రతాప్ రెడ్డికి చెందిన అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.86,264 కోట్లుగా ఉంది. ఫోర్బ్స్ రియల్ టైమ్ ప్రకారం ప్రతాప్ రెడ్డి నికర విలువ రూ.24,030 కోట్లుగా ఉంది. దీంతో ఆయన ప్రస్తుతం భారతదేశంలోని అత్యంత సంపద కలిగిన బిలియనీర్ల జాబితాలో ఒకరిగా కొనసాగుతున్నారు.
రెడ్డికి 1991లో పద్మ భూషణ్ అవార్డును అందుకోగా.. 2010లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది. ఆయనకు నలుగురు కుమార్తెలు. వీరు భారతదేశంలోని అత్యంత విజయవంతమైన ఆసుపత్రులలో ఒకటైన అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌ను నిర్వహించడంలో నిమగ్నమై ఉన్నారు. పెద్దాయన ప్రీతారెడ్డి, మూడో కుమార్తె శోభనా కామినేని కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు. రెండో కూతురు సునీతారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా, చిన్న కూతురు సంగీతారెడ్డి కో-మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు.
92 ఏళ్ల వయసులో కూడా ప్రతాప్ రెడ్డి గ్రూపు ఎదుగుదల కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. ఆయన వివిధ ఆరోగ్య సంస్థలను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ నైరోబీ (కెన్యా)లో పామర్ హెల్త్‌కేర్ భాగస్వామ్యంతో ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. తెలుగు హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా ప్రతాప్ రెడ్డి మనవరాలు అనే విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం అపోలో గ్రూప్ దేశంలో దాదాపు 6000 డిస్పెన్సరీలు, 2000 రిటైల్ అవుట్లెట్లను విజయవంతంగా నిర్వహిస్తోంది. దీని వెనుక ప్రతాప్ రెడ్డి నిరంతర శ్రమ, కృషి ఉండటం వల్లనే సక్సెస్ అయ్యారు.
ఇన్నీ ఆస్తుల ఉన్న ఎక్కడ ఉన్నా ప్రతి రోజు ఉదయం
*విష్ణు సహస్ర నామ పారాయణ , రామ నామ పారాయణ చేసి . దినచర్య ప్రారంభిస్తారు..*
అందుకు అన్నారు పెద్దలు ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన ధర్మం సంప్రదాయం నేలను మరవకు .
*ధర్మో రక్షతి రక్షితః*
No comments:
Post a Comment