🕉️🕉️🕉️🕉️🕉️🕉️
సమభావం పెరగాలంటే ద్వేషాన్ని త్యజించాలి. ద్వేషం మనిషిని కనిపించకుండా కాల్చివేస్తుంది. పక్కవారి ఆనందాన్ని ఎదుగుదలను చూసి ఈర్ష్య చెందకూడదు. ఇటువంటి ద్వేషమే కదా కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది. ధృతరాష్ట్రుడిది అంధత్వమే కాదు, అతడిది మనో అంధత్వం కూడా. రెండు కళ్లూ ఉండి కూడా దుర్యోధనుడు పూర్తి అంధుడయ్యాడు. పాండవుల మీద అకారణంగా ద్వేషం పెంచుకుని తన గొయ్యి తానే తవ్వుకున్నాడు.
దీనికి అంతటికీ కారణం-
ఓర్వలేనితనం, విపరీతమైన ద్వేష భావం. మనిషి తన లోపాలు తనకు తెలిసి కూడా సరిదిద్దుకోడు. ఎదుటివారిని చూసి తన లోపాలను సరిదిద్దుకోవడానికి అహం అడొస్తుంది. అటువంటప్పుడు ప్రకృతిని చూసైనా మనిషి గుణపాఠం నేర్చుకోవాలి. ప్రకృతి గొప్ప దయామయి. అది మనిషిని బిడ్డలా ప్రేమిస్తుంది. దాపరికం లేకుండా తన సంపదను సకల మానవులకు పంచుతుంది. ప్రకృతికి ఉన్న సమదృష్టి ఈ మనిషికి లేకపోవడం ఎంత శోచనీయం? పంచభూతాలకున్న సమభావన ఈ మానవుడిలో లేకపోవడం ఎంత ఘోరం? ప్రకృతి ఇచ్చే ఈ సందేశమైనా మనిషిలో మానవీయ మార్పురావాలి...🙏🤝👍
No comments:
Post a Comment