భగవద్గీతలో చెప్పినట్టు- "అందరూ మేలుకుని ఉంటే, యోగి నిద్రిస్తుంటాడు."
నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు.
"ఖాళీ"గా ఉండడం. అదే యోగనిద్ర.
భగవద్గీత చరమశ్లోకంలో- సర్వధర్మాన్ పరిత్యజ్య….అన్నాడు కృష్ణభగవానుడు.
సర్వధర్మాలను వదిలేసి "ఖాళీ" అయిపొమ్మన్నారు.
ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి.
"ఖాళీ" అనేది పరానికి సంబంధించినది.
శ్రీరామకృష్ణులు ఆరాధించిన "ఖాళీ"యే కాళీమాత.
కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు,
అర్థరాత్రి. ప్రపంచంలో ఉండే నిశ్శబ్ధాన్ని (మౌనాన్ని) అంధకారాన్ని (అభేదాన్ని)
ఆస్వాదించడమే కాళీమాత దర్శనం.
పట్టపగలు కూడా ఆ నిశ్శబ్ధాన్ని, ఆ "ఖాళీ"ని అనుభవించగలగడమే సహజ సమాధి.
కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం.
వ్యక్తిత్వభావన "ఖాళీ" అయిపోవడమే భక్తియోగం.
అహమిక "ఖాళీ" అయిపోవడమే జ్ఞానయోగం.
నిజానికి తాను "ఖాళీ" అయిపోతే ఆ ఖాళీ ఖాళీగా ఉండదు. ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది.
ఇదే "ఖాళీతత్త్వరహస్యం".
అదే ఇది. ఎవరూ లేకపోవడమే దేవుడు ఉండడం. ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం. ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం.
నేను చేస్తున్నాను అనేది మన బ్రమ అదే మన కర్మకు మూలం. అలా కాకుండా ఈ జగత్తు మొత్తం జగన్మాత (ఖాళీ)
నడుపుతోంది. అని అనుకుంటే
అది దైవ దర్శనం మార్గం అవుతుంది మన ప్రయాణం శక్తి (ఖాళీ) తో కూడి చక్కగా సాగిపోతుంది అదే ఖాళీ తత్వ మార్గం. ఈ మార్గం కర్మలకు దూరంగా వున్న సర్వ సంతోషాల నిలయానికి చేరుకోవడానికి సహాయపడుతుంది. ఆ సంతోషి మాత దర్శనం మనకు లభిస్తుంది.
తింటేనే రుచి తెలుస్తుంది, అనుభవంతోనే అమ్మ (ఖాళీ) గొప్పతనం తెలుస్తుంది.
బుద్ధుడు ఒక గ్రామంలో గుండా సాగిపోతున్నాడు. కొందరు ఆయనను తిడుతున్నారు. రాళ్లతో కొడుతున్నారు. బుద్ధుడు మౌనంగా, స్థిరంగా నిల్చుండిపోయాడు. కొంచెంసేపటికి రాళ్ల వర్షం ఆగింది. అప్పుడు ఆయన అన్నాడు..
'నాతో మీ సంభాషణ సమాప్తం అయిందా? అయితే చెప్పండి, నేను ముందుకు సాగిపోతాను. నేను త్వరగా వెళ్ళాలి, ఇంకా చెప్పవలసింది ఏదైనా మిగిలివుంటే దయచేసి త్వరగా చెప్పండి'
విరోధులకు ఇది విడ్డూరంగా ఉంది. తాము రాళ్లతో కొడుతున్నారు. బుద్ధుడు దాన్ని సంభాషణలు అంటున్నాడు. ఇదే ప్రశ్న వారు బుద్ధుణ్ణి అడిగారు. ఆయన చెప్పాడు..
'నేను దీన్ని సంభాషణగానే భావిస్తాను. మీరు మీ అభిప్రాయాలను నాకు తెలియజేస్తున్నారు. ఒకరి అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకోవటమే సంభాషణ'.
బుద్ధ భగవానునికి అద్భుతమైన ధైర్యం, ఆనంతమయిన శాంతి ఉన్న కారణంగా విరోధులు కూడా శాంతించారు. ఆ మహాత్ము…….
తాత్కాలిక భావ ప్రాప్తి శృంగారం _ శాశ్వత భావ ప్రాప్తి దైవం.శృంగారం లో లీనం చేసే శక్తి కోసం వెంపర్లాడటం చేస్తే దైవత్వం లో తానే శక్తిగా తన లోపలి శక్తి ని దర్శిస్తాడు. పెద్ద తేడా ఏం లేదు. రెండూ దైవమే
అరుణాచల శివ
ఓం అరుణాచలేశ్వరాయ నమః
అరుణాచలశివా అరుణాచలశివా అరుణాచలశివా 🙏🏻
No comments:
Post a Comment