హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ: 🙏
ఈ దృష్టిని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి
వ్యావహారికంగా బంధుగణంతో కలిసి ఉండటం సంసారం .. తత్వ జ్ఞాన పరంగా మూడు గుణములతో కూడి యుండుటయే సంసారం
సంగత్వమే సంసారి ... అసంగత్వం ఆత్మ స్వరూపం
తత్వ విచారం ఆత్మజ్ఞానం కొరకు
త్రిగుణాతీతమైన .. త్రిగుణ రహితమైన స్థితి మాత్రమే నీ స్వరూపం
త్రిగుణములచే కూడటం భ్రాంతి చే జరుగుతున్నది
మూడు గుణాలతో కూడిన ఆనందాన్ని అనుభవించే భ్రాంతి జీవునకుంది ... ఆ ఆనందమే ప్రధానం అనే జీవనం జీవ భావం పునర్జన్మ హేతువు
పదార్ధమయ.. శక్తిమయ.. తేజోమయ.. బ్రహ్మ మయ .. స్థితి దాటాలి .. సకల సృష్టిలో గుణాతీతులుగా ఉన్నవారు పరమాత్మ స్వరూపులు
ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ .. స్థూల లక్షణం .. ప్రధమ గురువుగా ఆశ్రయించి స్వరూపజ్ఞానాన్ని పొందు
నిద్రను ధ్యానం ..సమాధిగా మార్చుకోవాలి ... లేనప్పుడు నిద్ర తమో గుణం
అభ్యాసం చేసి స్వభావాన్ని మార్చుకుంటే తప్ప గుణాతీత స్థితి సాధ్యం కాదు
గుణాలనే మాలిన్యాన్ని అంత: కరణ నుండి తొలగిస్తే ..అంత: కరణకు ఉనికి లేదు
ఎవరికీ ఊహించటానికి ... దాటడానికీ వీలుకానట్టి మాయాశక్తి .. దాటటానికి నన్ను ఆశ్రయించిన వారికి మాత్రమే సాధ్యము .. అందుకే పరమాత్మ జగద్గురువు .. శంకరులు జగద్గురువు
అంతటా పరమాత్మను దర్శించిన వారికి జీవాత్మ లేదు
సృష్టి.. దృష్టి.. వ్యష్టి .. నీ దృష్టిని మార్చటం మీద దృష్టి పెట్టినప్పుడు..జ్ఞాన వైరాగ్యాలు దృష్టిలో ఏర్పడే మార్పులు
నిస్త్రైగుణ్య అనే పధ్ధతిలో జీవించాలి
జీవించి ఉన్నంత కాలం .. ఆత్మ విచారణ చెయ్యాలా?... అణువు నుంచి మహత్తు వరకు పరమాత్మను దర్శించేంత వరకు చేయవలసిందే
ప్రాణ మనసులు ఆగిపోయిన నాడు .. ఈశ్వర సాక్షాత్కారం అయిననాడు .. ఈశ్వర స్మరణ చేయనవసరం లేదు
నారము.. నీరు ... అయనము.. వ్యాపించిన వాడు .. నీటి అణువు యందు నారాయణుడున్నాడు .. ప్రాణాధారం .. ప్రాణవాయువు నారాయణుడు
భవతీ భిక్షాందేహి .. మాధవ కబళం అడిగేవాడు నారాయణుడు
శివశ్చ హృదయం విష్ణు: .. విష్ణుశ్చ హృదయం శివ: .. శివ కేశవులు అభేధం
సృష్టి అనంతం .. చెప్పే మార్గాలు అనంతం .. లక్ష్యం బ్రహ్మం
జీవాత్మ పరమాత్మ వేరనుకోవటం భ్రాంతి .. ప్రకాశం అధిష్ఠానం ... ప్రాణం ఆశ్రయం
ప్రకాశమే ఉనికి సర్వ ప్రాణులకు .. అదే నేను .. చైతన్యం.. ఆత్మ .. బ్రహ్మ .. ఉన్నది ప్రకాశమే బ్రహ్మమే
భగవద్గీత లక్ష్యం మోక్ష సన్యాసం .. జన్మ రాహిత్యం .. ఏ కర్మ చేసినా లక్ష్యం నుండి కిందకు పడిపోకూడదు
ప్రాణం కొట్టుకోవడమే కర్మ .. బుధ్ధిని కర్మ బంధం నుండి విడిపించు .. గుణమే బంధం
ఇదే Master key ( మాస్టర్ కీ)
ఈ ఒక్కటీ చెయ్యి ..
శ్రీ విద్యా సాగర్ స్వామి వారు భగవద్గీత 020
జై గురుదేవ 🙏
No comments:
Post a Comment