Monday, April 8, 2024

మాట్లాడడం అంటే ఒక కళ.. నువ్వు మాట్లాడే విధానం బట్టే నీ సంస్కారం బయటపడుతుంది.

 *_🌹'ఈరోజు ఒక మంచి మాట.'🌹_*

*_మిత్రమా.. మాట్లాడడం అంటే ఒక కళ.. నువ్వు మాట్లాడే విధానం బట్టే  నీ సంస్కారం బయటపడుతుంది.  కొందరు మృదుభాషంతో మధురంగా మాట్లాడుతారు. ఆ మాటలను అలా వింటూ ఉండాలని అనిపిస్తుంది. మరికొందరు మాట్లాడితే చికాకు చిరాకు కలిగిస్తుంది. ఇది మనం నిత్యజీవితంలో చూస్తూనే ఉన్నాం. మాట ఓ అద్వితీయ శక్తి దాని పెంపొందించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మాటతీరు సంస్కార సంపన్నమైనప్పుడే ఎదుటివారి హృదయాన్ని మనం ఆకర్షించుకోగలుగుతాం. అందుకే మన ఆలోచనలు ఇతరులతో పంచుకునేందుకు మాట ఓ అద్భుత సాధనం. లోకములో అర్థం కాకుండా మాట్లాడే వారు,అసమర్థంగా మాట్లాడేవారు ఎంతోమంది ఉన్నారు అనవసరంగా అనాగరికంగా మాట్లాడేవారు ఉన్నారు. ప్రాణకోటికి మనిషికి పెద్ద పీట వేసింది మాట. అదుపు లేకుండా వాగడం మహా తప్పు. మాటను తక్కడ లో పెట్టి  తూచినట్లు  మాట్లాడమంటారు విజ్ఞులు. మాట ప్రభావం అద్భుతం, అది మనిషి మనసుకు అద్దం పట్టగలదు, అడ్డంగా నిలువ గలదు, కొంపలు కూల్చగలదు, కుటుంబాలను రక్షించగలదు, శిశిరంలో వసంతాన్ని సృజించగలదు. పెదవి వదిలితే పృద్వి దాటిపోగలదు,ప్రయోగించిన బ్రహ్మాస్త్రమైన వెనక్కి మళ్లించవచ్చునేమో గాని, పెదవి దాటిన మాటను బ్రహ్మ దేవుడైన వెనక్కి మళ్ళించలేడు. అందుకే మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి, ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి. మన మాట తీరు ఎదుటి వ్యక్తికి కంటిలో నలుసులా, పంటికింద రాయిలా బాధపెట్టే విధంగా ఉండకూడదు. అందుకే మన పెద్దలు అన్నారు నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుంది అని.. మాట మంచిగా ఉండాలంటే మనసు నిలకడగా ఉండాలి.. మనసును నిలకడగా ఉంచేది సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం ☝🏾_*

💐💐🙏🌹🌹💐

No comments:

Post a Comment