Friday, April 12, 2024

ధర్మరక్షణ ఎలా వుండాలంటే..

 *ధర్మరక్షణ ఎలా వుండాలంటే..*
                
రామ రావణ సంగ్రామం జరుగుతోంది…

ఒక చిన్న రాక్షసుడు శ్రీరాముడిపైకి సమరానికి వచ్చాడు. 

రాఘవుడు ఎన్ని అస్త్రాలను ప్రయోగించినా అతడినేమీ చేయలేకపోతున్నాయి. 

ఆ చిన్న రాక్షసుడికి ఉత్సాహం పెరిగి పోతోంది. రకరకాల ఆయుధాలతో విరుచుకు పడుతున్నాడు. 

విభీషణుడు ఇది చూసి శ్రీరాముడితో ఇలా మనవి చేశాడు- “సీతాపతీ! వాడిని చంపాలంటే ఒక ఉపాయం ఉంది. చీకటిపడేలోగా వాడి ప్రాణం తీయకపోతే, రాత్రిపూట వాడు మరింత విజృంభిస్తాడు... వాడి ప్రాణం ఎడమకాలు బొటనవేలిలో ఉంది... వెంటనే నీ బాణాన్ని అక్కడ ప్రయోగించు!” 

 రామచంద్రుడు గురిచూసి ఆ బాలరాక్షసుని ఎడమకాలి బొటన వేలిపై బాణం ప్రయోగించాడు. 

ఆ రాక్షసుడు వెనువెంటనే మరణించాడు. 

విభీషణుడు ఈ దృశ్యం చూసి పెద్దగా రోదిస్తూ మూర్ఛపోయాడు. 

స్పృహలోకి వచ్చిన తరవాత దాశరథి విభీషణుణ్ని అడిగాడు- “ఆ పిల్లవాడు చనిపోతే నువ్వెందుకు విలపించి స్పృహ తప్పావు?” అని. 

“శ్రీరామా! ఆ బాలుడు ఎవరో కాదు- నా ఏకైక పుత్రుడు!” అన్నాడు విభీషణుడు కన్నీరు తుడుచుకుంటూ. 

రాముడు తాను చేసిన పనికి చింతాక్రాంతుడయ్యాడు. 

“శ్రీరామా! నువ్వు చింతించవద్దు! నువ్వేమీ తప్పుచేయలేదు. ధర్మకార్య నిర్వహణకు అడ్డువచ్చిన వారినెవరినైనా మట్టుపెట్టవలసిందే! బంధుప్రీతి ధర్మరక్షణకు అడ్డు కాకూడదు!” అని కరుణానిధియైన శ్రీరామచంద్రుణ్ని విభీషణుడు ఓదార్చాడు.

🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🙏

No comments:

Post a Comment