Monday, April 22, 2024

ప్రశ్న : ఆత్మగా చూస్తే ప్రపంచం వాస్తవం. విడిగా నామరూపాలుగా చూస్తే మిథ్య అన్నమాట !

 ప్రశ్న : ఆత్మగా చూస్తే ప్రపంచం వాస్తవం. విడిగా నామరూపాలుగా చూస్తే మిథ్య అన్నమాట !
జవాబు: నిప్పుని పొగ మరుగు పరుస్తుంది. అట్లాగే, చైతన్యకాంతిని నామరూపాల సమ్మేళనమైన ప్రపంచం మరుగుపరుస్తుంది. కరుణామయమైన భగవదనుగ్రహం లభిస్తే మనస్సు పరిశుద్ధ మవుతుంది. అప్పుడు ప్రపంచపు నైజం ... భ్రమకొల్పే రూపాలు కాదు సత్యమేనని విశిదమవుతుంది.
*"జగత్తు సత్యము"* అనే వాక్యాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు ? మాయ అనే దుష్ట శక్తికి అతీతమైన మనస్సు కలిగి, ప్రపంచపు ధ్యాస విడచి, దానిపట్ల అనురక్తి లేకుండా ఉండి ... తద్వారా పరమసత్యాన్ని గ్రహించిన వారే అర్థం చేసుకోగలరు. అసలైన జ్ఞానం వల్ల దృక్పథం పరివర్తన చెందితే ... ఆకాశాది పంచభూతములు కల విశ్వం వాస్తవంగా, పరమసత్యంగా గోచరిస్తుంది.
అనేక నామరూపాలతో కిక్కిరిసి పోయి, ఇప్పుడు విభ్రమం కొల్పే ప్రపంచం యొక్క స్వరూపం ఆనందమే ! ఏకమే ! పంచరంగుల నెమలి యొక్క గుడ్దులోని సొన ఒకటే. ఆత్మనిష్ఠతో ఈ సత్యాన్ని గుర్తుంచుకో.
"నీ సహజస్థితిలో ఉండు"
భగవాన్ శ్రీ రమణమహర్షి బోధనలు

No comments:

Post a Comment