👬 **మనిషికి-పశువుకు భేదము** 🐎🦜
*హితోపదేశ-సుభాషిత-శ్లోకాః*
ఆహారనిద్రాభయమైథునఞ్చ సామాన్యమేతత్ పశుభిర్నరాణామ్ ।
ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః ॥౦.౨౫॥
*భావము* .
తిండి - నిద్ర - భయం - రతిక్రియ అనే ఈ విషయసమూహము మనుష్యులకు పశువులకు సమానమే మరియు సాధారణమే. కాని నరులకు విద్యా -వినయములతో కూడిన ధర్మాచరణము అనునది పశువులకు లేని ఒక విశేషగుణము. అందువలన పుణ్య హీనులైన వారు, ధర్మహీనులైనవారు కేవలం పశువులతో సమానమైనవారే అగుదురు అని భావము. ॥
సేకరణ. వినయశ్రీ
No comments:
Post a Comment