హరిఓం ,
మానవునికి, మానవ జాతికి పరిష్కారము ఆత్మ పరిశీలన మార్గము నుండియే లభించును. ఆత్మ పరిశీలనము లేని మానవుడు పశుప్రాయుడే. ఆత్మపరిశీలన మున్నచోట అంతరాత్మ ప్రబోధముండును. ఎచ్చట అంతరాత్మ జీవ స్వభావమును అనునిత్యము ప్రశ్నించునో, అచ్చట జీవుడు బాధ్యతాయుతుడై జీవించగలడు. బాధ్యత ప్రధానమని తెలిసిన వాడికి జీవన నౌకకి చుక్కాని దొరికినట్లగును.
*****************
ఎప్పటికేది ప్రస్తుతమో తాత్కాలికముగ దాని నాశ్రయించి జీవించువాడు జీవితమున యెట్టి పురోగతి సాధించలేడు. కేవలము మాటకారియై సన్నివేశములందు తప్పించుకు తిరుగుచు తన్ను తాను మోసము చేసుకొనుచు బ్రతుకును.
దైవంతో స్నేహం పొందాలనుకుంటే మానవ సంబంధమైన స్నేహాలను త్యాగం చెయ్యడానికి ఇష్టపడాలి.
ఆధ్యాత్మిక విశ్వాసం మనకు ఒక దివ్యత్వ భావన కలిగిస్తుంది. విశ్వాసం వల్లనే మనం ఉత్కృష్టమైన దానికి దగ్గరగా మరింత దగ్గరగా చేరగలుగుతాము.
లెక్కలు కట్టటం వలన గానీ లేక కేవలం తెలివితేటల పట్టుతో గాని చేరాలనుకుంటే మన దారి బహుదూరం అవుతుంది.
ఆత్మ సమర్పణ ద్వారా మన అభ్యున్నతికి హద్దులే ఉండవు. అప్పుడు వ్యక్తి తన మొరటు స్వభావాన్ని దయారహిత భావనలను విడిచిపెట్టి తన హృదయ మందిరాన్ని తానే శుభ్రపరిచి పరమాత్మ రాకకై ఎదురు చూస్తున్నాడు అన్నమాట.
మన కోరిక దృఢమైతే ఆయన రాకుండా ఉండడు..............```
🙏🙏 ........ - వలిశెట్టి లక్ష్మీశేఖర్ .... - 98660 35557..... - 28 .04 .2024 ....
No comments:
Post a Comment