Friday, April 12, 2024

🐒మారుతికి ఒంటెఎలా వాహనమయ్యింది* *🙏🐒🐪

 *🐒మారుతికి ఒంటెఎలా వాహనమయ్యింది* 
*🙏🐒🐪\|/🐪🐒\|/🐒🐪\|/🐪🐒🙏* 


🐒🐪హనుమంతుడు యెజనాల కొద్దీ దూరాన్ని ఒక్క అంగలో అధిగమించగలిగినవాడు. స్వయంగా రుద్రాంశ సంభూతుడు. వాయు పుత్రుడూ ! సూర్యుణ్ణే  పండనుకొని భ్రమించి, సూర్య గ్రహం దాకా యెగిరి వెళ్లగలగడంలోనే ఆయన యెంత వేగంతో ఎలా ప్రయాణించగలరనేది అర్థమవుతోంది కదా !

🐒🐪అటువంటి స్వామికి ఒక వాహనం అవసరమేముంది. ఆమాటకొస్తే, త్రిమూర్తులకీ, వారి దేవేరులకీ, ఇలా దేవతా గణమందరికీ ఏదొక వాహనం ఉందికదా ! అయినా వానర రూపంలో ఉన్న ఆంజనేయునికి ఒంటె వాహనం అవ్వడం అనేది కాస్త ఆసక్తికరమైన కథే కదూ !

🐒🐪ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షణాదిన ఆంజనేయ స్వామి గుడులలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా  అరుదనే చెప్పాలి . కొన్ని ప్రదేశాలలో, ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన  దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహం ఉంటుంది . ఒంటె, ఆంజనేయ స్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాఢ ఉంది.

🐒🐪రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి వదిస్తాడు. అతడి మృత దేహాన్ని రుష్యమూక పర్వతం (నేటి హింపీ ప్రాంతం) పై పడేశాడు. ఈ సంఘటనే వాలి, సుగ్రీవుల మధ్య వైరం రగులుకోవడానికి కారణమవుతుంది. మరో వైపు వాలి శాపాన్ని పొందేందుకు కారణమవుతుంది. ఆ ఋష్యమూక పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న మాతంగ మహాముని దుందుభి మృతదేశాన్ని తానూ తపస్సు చేసుకుంటున్న ఆ పర్వతం పైన పడేయడాన్ని ఇది చూసి, వాలి కనుక రుష్యమూక పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు.

🐒🐪ఆ తర్వాత సుగ్రీవుణ్ణి - వాలి చంపడానికి వెంటపడినప్పుడు, శాపోదంతం తెలుసున్న  సుగ్రీవుడు రుష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కుంటాడు. ఆ సమయంలో సుగ్రీవుణ్ణి చూడటానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంప సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు. దాంతో మిత్రుడైన హనుమంతుడు  పంపా సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా ఒంటెను సిద్ధం చేస్తాడు  సుగ్రీవుడు. అలా అది ఆయనకు వాహనం అయ్యిందని కథనం

 *🙏🚩మరొక కథ ప్రకారం🚩🙏* 

🐒🐪ఆంజనేయుడి వాహనం ఒంటె అని పరాశర సంహితలో పేర్కొన్నారు. మనోవేగంతో సమానంగా ప్రయాణించే వాయుపుత్రుడి వాహనాన్ని గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి ఎక్కడా ప్రస్తావించలేదు.

🐪🐒సీతాదేవిని వెతుకుతూ పంపా నదీ తీరానికి రామలక్ష్మణులు చేరుకున్నపుడు, సుగ్రీవుడు వాళ్లను చూసి భయపడతాడు. ధనుర్బాణాలు ధరించి వస్తున్న ఈ వీరులు ఎవరో తెలుసుకొని రమ్మని హనుమను పంపిస్తాడు.

🐒🐪ఆంజనేయుడు మొదటిసారి శ్రీరాముణ్ని కలుసుకున్నది పంపానదీ తీరంలోనే! 
ఈ ప్రాంతం హనుమకు ఎంతో నచ్చిన ప్రదేశం. ‘పంపాతీర నివాసాయ గంధమాదన వాసినే’ అని స్వామిని కీర్తిస్తారు భక్తులు.

🐪🐒అయితే, ఈ నది తీరం వెంబడి ఎడారిని తలపించేలా దట్టమైన ఇసుక మేటలు ఉండేవి. హనుమ ఈ ప్రాంతంలో విహరించడానికి సౌకర్యంగా ఉండటం కోసం..

🐒🐪ఇసుకలో తేలికగా నడవగలిగే ఒంటెను సుగ్రీవుడు వాయుపుత్రుడికి బహుమానంగా ఇచ్చాడని ప్రతీతి.

🐒🐪అంతేకాదు, హనుమంతుడి ధ్వజంపైన కూడా ఒంటె గుర్తే ఉంటుంది.

🐒🐪రుద్రాంశ సంభూతుడైన హనుమంతుడు వృషభం వంటి బలిష్ఠమైన ఒంటెను వాహనంగా ఎంచుకున్నాడని కూడా పెద్దలు చెబుతారు..

🐒🐪ఆంజనేయునికి ఒంటె వాహనం అనడంలో ఒక వైశిష్ట్యం ఉంది.🐪🐒 

🐒🐪తాగిన నీటిని ఆరు నెలలు తన కడుపులోనే దాచుకోగల నైపుణ్యం ఒంటెకు ఉంది. అనగా మనకు లభించిన దానినంతా ఒకేసారి అనుభవించకుండా అవసరమున్నంత మేరకే వాడుకోవాలి అన్న సందేశం ఒంటె ద్వారా తెలుసుకోవచ్చు. 

🐒🐪ఒంటె నందికి మారు రూపు. శివుడు హనుమంతుడైతే నంది ఒంటెగా అవతరించి హనుమకు వాహనం అయ్యింది..జై శ్రీరామ్..!!

🐒శ్రీరామదూతం శిరసా నమామిః🐒

No comments:

Post a Comment