[4/30, 07:18] +91 73963 92086: .
అవసరమైనది అనుగ్రహమే భగవాన్ శ్రీరమణ మహర్షి అనుగ్రహమూర్తులు. ఆ అనుగ్రహం పరిపూర్ణం. కానీ భగవాన్ భౌతికంగా ఉన్నప్పుడు ఆయనకు దగ్గరగా ఉన్నవారిలో, ఆయనను దర్శించడానికి వచ్చినవారిలో చాలా మంది ఆయన నిరంతర అనుగ్రహ ప్రవాహాన్ని అందుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. గంగానదీ జీవ ప్రవాహం లాంటి భగవాన్ అనుగ్రహాన్ని పొందలేకపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే... అశరీరంగా ఆయన అందించే రహస్య మార్గదర్శకత్వాన్నీ, కొన్నిసార్లు బాహ్యమైన సాయాన్నీ గ్రహించలేనివారు... తమ హృదయాల్లో ఉన్న ఆ సద్గురువు సన్నిధిని ఉపేక్షించినవారు అవుతారు.
‘రమణుల సంభాషణలు’, ‘అనుదినము భగవాన్’ సంకలనాలను చదువుతున్నప్పుడు... ఆయన వద్దకు వచ్చిన భక్తులు, సాధకులు, జిజ్ఞాసువులు, ఇతరులు... కోరుకున్నదీ, ప్రార్థించినదీ భగవాన్ రమణుల అనుగ్రహాన్నే అని స్పష్టమవుతుంది. తన అనుగ్రహాన్ని ఏదో గదిలో ఉంచి, తాళం వెయ్యలేదని శ్రీ రమణులు చాలాసార్లు చెప్పారు. ఒక జీవనది దగ్గరకు చిన్న గ్లాసును తీసుకువెళ్ళి, ఇంకొకరు పెద్ద బిందెతో నీరు తీసుకుపోతున్నారని ఫిర్యాదు చేయడం సబబు కాదు కదా! అలాగే మహాత్ముల అనుగ్రహం సదా అనంతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. అది అందరికీ సమానంగా, ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఎవరు ఎంత అందుకోగలరు అనేది... గ్రహించేవారి మీద ఆధారపడి ఉంటుంది.
జిడ్డు కృష్ణమూర్తికీ, భగవాన్ రమణులకూ జరిగిన సంభాషణను మహేశ్‌భట్ అనే భక్తుడు గ్రంథస్తం చేశారు. ఆ సంభాషణ ప్రశ్నోత్తరాల రూపంలో సాగింది. ‘‘ముక్తి సిద్ధాంతం నిజంగా సత్యమేనా?’’ అని కృష్ణమూర్తి ప్రశ్నించగా, ‘‘అవును’’ అన్నారు భగవాన్. ‘‘దానిలో వివిధ దశలు ఉన్నాయా?’’ అనే ప్రశ్నకు... ‘‘లేవు. అదొక స్థితి. అంటే తన సహజ స్థితిలోనే నిలిచి ఉండడం’’ అని బదులిచ్చారు. ‘‘తమరు నన్ను విముక్తుణ్ణి చేయగలరా?’’ అని కృష్ణమూర్తి ప్రశ్నించగా, భగవాన్ మౌనం వహించారు. ‘‘కనీసం మీ అనుభవాలు వేటినైనా నాకు ఇవ్వగలరా?’’ అని చిరాకుగా అడిగారు కృష్ణమూర్తి. అప్పుడు భగవాన్ ఆయనవైపు తీక్షణంగా చూస్తూ... ‘‘అవును నేను ఇవ్వగలను. మరి నువ్వు తీసుకోగలవా?’’ అని ప్రశ్నించారు. ఆ సంభాషణే
కృష్ణమూర్తిని సత్యాన్వేషణవైపు పురికొల్పిన మొదటి సంఘటన. ఎవరైనా సాధకుడు భగవంతుడి శరణాగతి చెందడానికి సిద్ధమైనప్పటికీ, అతను ఏమేరకు శరణాగతి చెందాడనేదాన్ని బట్టి మాత్రమే జ్ఞాన సారాన్ని గ్రహించగలడు. ఈ విషయంలో ఎన్నో రకాల వాదాలు ఉన్నాయి. వాటిలో మార్జాల కిశోర న్యాయం ఒకటి. పిల్లి తన పిల్లలను తానే కరచి పట్టుకుపోతుంది. పిల్లలు వేచి ఉంటే చాలు. అయితే ఈ పద్దతిని భగవాన్ అంగీకరించలేదు. సాధకుడిలో అహంకారం మిగిలి ఉన్నప్పుడు, ‘‘నేనే కర్తను’’ అనే భావన ఉన్నప్పుడు... ఆధ్యాత్మిక సాధనలో అతను విజయం సాధించడం సద్గురు బాధ్యతే అంటే... అది ఎలా జరుగుతుంది? ఎవరికైతే వ్యక్తిత్వం, అహంకారం ఉన్నదో వారే ఆత్మ విచారణ చేయాలి, అన్వేషణ సాగించాలి. సత్యమైన తన సహజ స్వరూపాన్ని తెలుసుకోడానికి తీవ్రంగా తపించాలి. అలా తపించి, అన్వేషిస్తూ... సద్గురువు అనుగ్రహం మీద ఆధారపడాలి. ఎందుకంటే ఆ అనుగ్రహం వల్లనే అన్వేషించాలనే తపన మొదలవుతుంది. ఆ అనుగ్రహం వల్లనే సాధనలో స్థిరంగా నిలుస్తారు. ప్రయత్నం అనేది తప్పదు. సాధన, అనుగ్రహం... ఒకదానిమీద ఒకటి ఆధారపడి నడుస్తాయి. ప్రయత్నం తాలూకు అంతిమ విజయం మాత్రం కేవలం సద్గురువు అనుగ్రహం మీదనే ఆధారపడి ఉంటుంది. దాన్ని గ్రహించడం... సాధకుడి తపన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో విజయం... తీవ్రమైన సాధన ద్వారా మాత్రమే లభించదు. సద్గురువు అనుగ్రహం వల్ల మాత్రమే లభిస్తుందని భగవాన్ రమణులు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు...
.
ఆచరణే ఫలం
ధర్మాన్ని ఎందుకు ఆచరించాలి? అని ప్రశ్నిస్తే ధర్మోరక్షతి రక్షితః అని సమాధానం.
అయితే, ఎప్పటికప్పుడే ‘ఇన్ స్టెంట్’ ఫలితాలు కావాలనుకొనేటప్పుడు ఈ మాట అంతగా రుచించకపోవచ్చు.
ధర్మం వల్ల ఏం లభిస్తుందో? అనే ఫలాపేక్షతో ఉండడం కన్నా ధర్మాచరణయే ఫలంగా భావించడం ఉత్తముల మార్గం.ఆదిత్యయోగీ..
ధర్మం ఆచరిస్తున్నప్పుడు లభించే తృప్తిని అత్యుత్తమ ఫలంగా భావించే వాడు అసలైన ధార్మికుడు.
మనిషి సాధించవలసిన ప్రయోజనాలు నాలుగు అని విభజించారు భారతీయ మహర్షులు. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఇందులో ‘అర్థకామాల’గురించి వివరించనవసరం లేదు. ఈ రెండు ప్రయోజనాల చుట్టూ మాత్రమే తిరుగుతుంటాం మనం. కానీ వాటికన్నా ముందు ధర్మాన్ని సంపాదించుకోవాలి. ధర్మం అనే ప్రాతిపదిక మీదనే అర్థకామ సంపాదన సాగాలి. అర్థ కామ సంపాదన మాత్రమే ధ్యేయంగా సాగితే వ్యక్తికీ, సమాజానికీ కూడా హాని.
[4/30, 07:18] +91 73963 92086: అందుకే ధర్మం అనే హద్దులో అర్థ కామ సంపాదన జరగాలి అని శాసించారు. ఇది శాశ్వత ప్రయోజనాన్ని ఉద్దేశించి నిర్దేశించింది.
ధర్మరహితంగా అర్థ కామ సంపాదన చేస్తే పతనమై తీరతారని చెప్పడానికే రామాయణ భారతాలు ఆవిర్భవించాయి. ధర్మపరుడై బ్రతికే వానికి ఎన్నో సవాళ్లు ఎదురౌతాయి. అది సహజం. ఏ కాలంలోనైనా ఇది తప్పదు. ప్రస్తుత కాలంలో మరీనూ. ఆ సమయంలో ఎటువంటి నిబ్బరాన్ని పాటించాలో మన ప్రాచీన ధార్మిక గ్రంథాలను పరిశీలించి తెలుసుకోవచ్చు.
శ్రీరామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళే ముందు కైకతో అన్నమాటలు: “నాహమర్థపరే లోకే విద్ధిమాం ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితమ్ – నేను అర్థపరుణ్ణి కాను, కేవలం ధర్మమూ నందే నిష్ఠ కలిగిన వాడను” ధర్మంతో అర్థ కామాలను సంపాదిస్తాను అనే ధోరణి మంచిదే. అంతకన్నా ఉత్కృష్టం అర్థ కామాలకన్నా ధర్మ సంపాదనమే గొప్పదని భావించడం. ఆ ధర్మపరత్వంలో అర్థ కామాలకు హాని కలిగినా చలించరు. అటువంటి వారినే మహాత్ములని అంటాం.
మహాభారతంలో ధర్మరాజును గమనిస్తే ఆశ్చర్య చకితులవుతాం.
అరణ్య వాస సమయంలో భార్యతో, తమ్ములతో సహా దుర్గమారణ్యాలలో సంచరిస్తున్న ఆ చక్రవర్తిని ఒకరోజు భార్య ద్రౌపది ఇలా అడుగుతుంది.
“మీరెప్పుడూ ‘ధర్మం, ధర్మం’ అంటూ ఉంటారు. ఆ ధర్మం మీకేమిచ్చింది? అధర్మపడురైన వాడు రారాజై భోగాలనుభవిస్తున్నాడు. ధర్మపరులైన మీరు సపరివారంగా కానలపాలయ్యారు. ధర్మాన్ని ఆచరించి ప్రయోజనం ఏమిటి?” విసుగుదాలతో ఆమె అడిగిన ప్రశ్నకు సంయమనంతో సమాధానమిచ్చాడు యుధిష్ఠిరుడు.
నాహం ధర్మఫలాకాంక్షీ రాజపుత్రి! చరామ్యుత! ధర్మ ఏవ మనః కృష్ణే!
స్వభావాచ్చైవమే ధృతమ్!ధర్మ వాణిజ్యకో హీనో జఘన్యో ధర్మవాదినామ్!!
ధర్మరాజు వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని పట్టి చూపించే మాటలివి. ధర్మాచరణ నా స్వభావం. ధర్మం వల్ల ఏదో వస్తుందని, ఏదో రావాలని నేను ధర్మాచరణను అనుసరించలేదు. ధర్మంతో వ్యాపారం చేసేవాడు నీచుడు” అంటే ధర్మం వల్ల ఏదో వస్తుందనే లాభాపేక్ష ఉన్నవాణ్ణి పురుషాధముడని పేర్కొన్నాడు ధర్మరాజు.
‘ధర్మాన్ని ఆచరించడం నా స్వభావం’ అనగలిగాడంటే ఆయనలో ఎంతటి ధర్మనిష్ఠ ఉందో అర్థం చేసుకోవాలి. అయితే తాము ఫలాన్ని ఆశించకుండా ధర్మాన్ని అనుష్ఠించినా, ధర్మం ఊరుకోదు. తప్పకుండా రక్షిస్తుంది. ఆత్మ ఔన్నత్యాన్ని కాపాడటమే అసలైన సిద్ధి. ఆ సిద్ధికోసమే ధర్మపరుడు స్థిరంగా ఉంటాడు. ఆ సిద్ధిలోనే తృప్తిని సాధిస్తాడు.
ధర్మాన్ని స్వభావంగా చేసుకున్న వారే ఆదర్శప్రాయులు. ఫలాపేక్ష లేని ధర్మంలోనే పరిపూర్ణత ఉంటుంది. ఇదే లక్షణం అచ్చమైన భక్తియోగంలోనూ సాక్షాత్కరిస్తుంది. కర్మగానీ, భక్తిగానీ యోగంగా పరిణమించాలంటే సుష్టు ఆచరణ, ఫలాపేక్ష రహితత్వమే ప్రధానం. అలా ధర్మనిష్టుడైన వాని పక్షాన దైవం శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
అందుకే భగవానుడు పాండవ పక్షపాతి అయ్యాడు. అంటే ధర్మపక్షపాతి. భౌతికంగా ధర్మానికి పెద్ద బలగం ఉండకపోవచ్చు గానీ బలం ఉంటుంది. ఆ బలం ఆత్మబలం, దైవబలం, అది ఎటువంటి దౌర్బల్యాన్నైనా జయించగలదు. ఆహారమం వైపు ఎంత బలగమూ, భౌతిక బలమూ ఉన్నా దాని మిడిసిపాటు తాత్కాలికమే.
రావణుడైనా, దుర్యోధనుడైనా భౌతికబలంలో సమృద్ధి కలవారే. కేవలం వానరులతో వచ్చిన రామలక్ష్మణులు లంకా సామ్రాజ్యాధినేత, సర్వబల సంపన్నుడైన రావణుని జయించారు. అయిదుగురు పాండవులు ఏడు అక్షౌహిణులతో, పదకొండు అక్షౌహిణుల బలం ఉన్న వందమంది కౌరవులను జయించారు.ఆదిత్యయోగీ..
ధర్మానికి లభించే జయం, ప్రాప్తించే ఫలం శాశ్వతం, సుస్థిరం, “యతో ధర్మస్తతోజయః’ ఇది శాశ్వత సత్యం. దీనిని నమ్మే సమాజం, దీనికే బద్ధమైన పాలన తప్పకుండా నిజమైన క్షేమాన్ని ప్రసాదిస్తుంది..
.
*అవగాహన తనను తాను అవగాహన చేసుకోవటం*
_సాధన సూచనలు_
కళ్ళు మూసుకోండి..మీరు స్పృహలో ఉన్నారని గమనించండి.
ఆ చైతన్యాన్ని గమనించండి.
మీరు ఒక ఆలోచనను గమనించిన ప్రతిసారీ, మీ దృష్టిని ఆలోచన నుండి మళ్లించండి మరియు మీ చైతన్యపు అనుభూతిని కొనసాగించండి.
మీ ఆలోచనలను గమనించవద్దు.
మీ స్పృహను గమనించండి.
చైతన్యాన్ని గమనించే చైతన్యం.
చైతన్యం గురించి స్పృహ కలిగిన చైతన్యం..
- మైఖేల్ లాంగ్‌ఫోర్డ్
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* :
432. మీరు మీ అవగాహన అయినందునవల్లేకదా, ఇప్పుడు ఈ విశ్వాన్ని తెలుసుకుంటున్నారు ?
మీరు అవగాహనను స్థిరంగా గమనిస్తే,
ఉపాధ్యాయునిగా ఈ అవగాహనే సత్యాన్ని వెల్లడిస్తుంది. .
*భక్తుడు :
యోగి తన సిద్దులను ఇతరులను ఆత్మజ్ఞులను ( అంతర్ముఖం ) చేయటానికే ఉపయోగిస్తాడా! లేక అట్లా చేయుటకు అతని ఆత్మజ్ఞానమే చాలునా?
*మహర్షి :
ఇతర శక్తులకన్నా అతని ఆత్మజ్ఞాన బలమే అధికము. తనలోని అహంకారం ఎంత తగ్గితే, తనకు అన్యం ( ఇతరములకన్నా తను వేరు అనే భావము ) అంత తక్కువన్న మాట.
ఇతరులకు నీవు ఇవ్వగల పరమ శ్రేష్ఠమైనది ఏది అంటే, ఆనందమే. అది శాంతి వలన వస్తుంది. విక్షేపం ( మనసు చెదరకుండా ఉండడం ) లేకుంటేనే శాంతి వర్థిల్ల గలదు.
[4/30, 07:18] +91 73963 92086: మనస్సులో తలెత్తే ఆలోచనలే విక్షేపానికి మూలం. మనస్సే లేనిరోజున నిశ్చల పూర్ణశాంతి కలుగుతుంది. మనస్సును సర్వనాశనం చేయనంత వరకూ శాంతి ఆనందాలు లభించుట సాధ్యంగాదు. తనకే ఆనందం లేనివారా ఇతరులకు ఆనందం ఇవ్వగలిగేది?
మనసే లేని పక్షంలో గుర్తించడానికి ఇతరములు కూడా ఉండవు. అందుచేత అత్మజ్ఞానం మాత్రమే ఇతరులకు ఆనందదాయకం కాగలదు.......*
.
No comments:
Post a Comment