*_ఓంతో కలిపి అష్టాక్షరి అయితే, ఓం లేకుండానే పంచాక్షరి అవుతుంది. అసలు మంత్రాలను అక్షర సంఖ్యతో ఎందుకు వ్యవహరిస్తున్నారు? అలా వ్యవహరించినందువల్ల తేడాలు వస్తున్నాయి కదా. వివరించండి._*
⚡⚡⚡ ⚡⚡⚡ ⚡⚡⚡
*_ముందు ప్రసిద్ధ మంత్రాలను అక్షర సంఖ్యతో ఎందుకు వ్యవహరిస్తున్నారో తెలుసుకుందాం. ఏ మంత్రమైనా ఉపదేశం చేసినప్పుడు అది ఆరు చెవులకు వినపడకూడదని శాస్త్రం. అంటే గురుశిష్యులే ఆ మంత్రాన్ని వినాలి. మంత్రం జపించినప్పుడు అది వారిద్దరికే వినపడాలి. మననం చేసేదే మంత్రం. మనన ప్రక్రియలో శబ్దం బయటకు వినపడే ప్రసక్తేలేదు. అందుకే మంత్రాన్ని గుహ్యమని, అన్నారు. అట్టి మంత్రాలను పేరుపెట్టి పిలిస్తే, గుట్టు విప్పినట్లే కదా! అందుకే ప్రసిద్ధ మంత్రాలకు మన పెద్దలు అక్షర సంఖ్యను ఏర్పరిచారు. అష్టాక్షరి అంటే 'ఓం నమో నారాయణ' అని పంచాక్షరి 'సమశ్శివాయ' అని, ద్వాదశాక్షరి అంటే 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని, షడక్షరి అంటే 'ఓం నమో విష్ణవే' అని అర్ధం. అయితే పంచాక్షరికి స్వతస్సిద్ధంగా ఓం లేదు. ఓం కలుపుకుంటే తప్పులేదు. ఏ మంత్రానికైనా ప్రణవం (ఓం) చేర్చినప్పుడే అది వైదికం అవుతుంది. లేకపోతే తాంత్రికం అవుతుంది. ఏది ఏమైనా మంత్రం ఇచ్చే గురువు మీద, మంత్రం మీద, మంత్రాధిదైవతం మీద విశ్వాసం ఉంచి ఏ మంత్రం జపించినా సత్ఫలితం ఉంటుంది._*
🙏🌹🌴🪔🌴🌹🙏
No comments:
Post a Comment