Tuesday, May 14, 2024

సేవాలాల్ చరిత్ర.

 *_🌹'సేవాలాల్ చరిత్ర.'🌹_*

*_సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవము. అతను హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా భావిస్తారు._*

*_🌹"జీవిత విశేషాలు "🌹_*
........................

*_1739 ఫిబ్రవరి 15వ తేదీన ధర్మిణి యాడి, రమవత్ భీమా నాయక్ దంపతులకు మొదటి సంతానం సేవాభాయ._*
*_అనంతపూర్‌ జిల్లా రాంజీనాయక్‌ బిడారి లో జన్మించాడు. నేడు ఆ ప్రాంతాన్ని సేవాగడ్ అని పిలుస్తాము. ఈ సేవాగడ్ గుత్తి గుంతకల్ మధ్యలో ఉన్నది._*
*_18వ శతాబ్దంలో బిడారి రాజ్యంలో కరువు ఏర్పడినప్పుడు బంజారా సమాజానికి ఏకధాటిపై నడిపించడానికి ఒక మహా గురువు కావాలని సమాజం భావించిన సమయం , అదే విధంగా బంజారా కుల దేవతలైన సాతిభవానిలకు గాను ఆరుగురు భవానీలకు భగత్ లు ఉన్నారు  జగదంబ మాత అయిన దండిమెరామాకు భగత్ లేకపోవడం ఒకటి,  అదే విధంగా ఈ రాంజీ బిడారి ప్రాంతంలో భీమా నాయక్ గారు సంతానం కోసం 12 సంవత్సరములు ఘోర తపస్సు చేశారు. భీమా నాయకు ఒక వరం ఇస్తారు నీకు ఒకవేళ సంతానము ఇస్తే మొదటి సంతానాన్ని జగదంబా మాతాకు శిష్యుడిగా నీ కుమారుడిని ఇవ్వాలని చెప్పియున్నారు 12 సంవత్సరముల అనంతరం నా కుమారుడిని జగదంబ మాతాకు అప్పచెబుతాను అని భీమా నాయక్ గారు చెప్పారు._*
*_ఈ మూడు కారణాలవల్ల సాతిభవానిల వరము చేత జన్మించారు   సేవాభాయ వీరికి సేవాలాల్‌ అని నామకరణం చేశారు. సేవా భాయకు స్వయంగా జగదంబ మాత మెరామాగా పిలవబడుతూ పెంచి కొంతకాలం పోషించి విద్యలు నేర్పించింది._* 
*_ఆరు నెలల ప్రాయంలోనే సేవాలాల్‌ కొండపైన చాముండేశ్వరీ దేవతా మూర్తులతో ఆటలు ఆడుకునేవాడు. సేవాలాల్‌- చాముండేశ్వరి అమ్మవారు ఆటలు ఆడడం రహస్యంగా భీమా నాయక్‌ గమనించి విచారిస్తే ప్రతిదినం అలాగే అడుకుంటామన్నాడు. పెరిగి పెద్దవాడైన సేవాలాల్‌ ఆవులు కాసేవాడు. తల్లిసద్ది కట్టిస్టే అది ఎవరికో ఇచ్చి ఆవుల వెంట అడవులోనికి పోయేవాడు._*
*_ఒక బంకమట్టితో రొట్టెలు చేసి తినేవాడు. ఈ విచిత్ర ప్రవర్తన తల్లితండ్రులకు తండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది._*
*_సేవాలాల్‌ పెరిగిన తరువాత  జగదాంబ ప్రత్యక్షమైన సేవాలాల్‌ని నాకు అప్పజెప్పమని భీమనాయక్‌ను అడుగుతుంది. అమ్మ వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సేవాలాల్‌ అందుకు ఒప్పుకోడు. తల్లిదండ్రులు సేవాలాల్‌ను అమ్మవారికి అప్పగిస్తుంటే నేను శాఖాహారిని జగదాంబ మాంసాహారి కనుక ఆమెకు నేను ఎలాంటి జీవాలను బలి చేయదలచు కోలేదని అంటాడు. అప్పుడు మెరామ సేవాలాల్‌కు ఎన్నో కష్టాలకు గురి చేస్తుంది. అయిన సేవాలాల్‌ చలించడు. చివరకు తండాలను, కష్టాల పాలు చేస్తుంది. ఇదంతా సేవాలాల్‌ కారణంగా జరుగుతుందని తండావాసులు, తండా రాజ్యం నుంచి ఆయనను బహిష్కరిస్తారు. కానీ అమ్మవారికి మేకలను బలి ఇస్తెనే అమ్మవారు శాంతిస్తారని ప్రజలు నమ్ముతారు. వారి కోరిక మేరకు సాతీ భావానీలకు మేకపోతు బలి ఇవ్వడానికి నిశ్చయించుకుంటారు సేవాభాయ. ఏడు మేకలను ఏడుగురు అమ్మవారుల ముందు ఉంచుతారు. కాని సేవాలాల్‌ ప్రజల మూఢనమ్మకానికి ఏకీభవించడు. ఎందుకంటే ఆయన అమాయక మూగ జీవుల్ని బలిచేస్తుంటే చూడలేక, ఒకవేళ అమ్మవారికి బలే ఇష్టమైతే నేనే బలైపోతానని సేవాలాల్‌ ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకుంటారు .  నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకోమని ప్రార్థిస్తాడు. అమ్మవారు సేవాలాల్‌ శిరస్సును తిరిగి అతని శరీరానికి జోడించి జీవం పోస్తుంది. ఇన్నాళ్లు నేను పెట్టే పరీక్షలో సేవాలాల్‌ నెగ్గాడు. నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు అయిన ఇతని నాయకత్వంలో ప్రయణించండి అని జగదాంబ ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి సేవాలాల్‌ జగదాంబమాతనే తన మార్గదర్శకురాలిగా, గురువుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్చుకొని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు._*

*_🌹బోధనలు:-_*

*_ఈ సమస్త జీవకోటికి మాతృరూపం (తల్లిగా) వెలిసిన అమ్మభవాని గురించి అమ్మను పూజించాలని, కాని ఫలితం ఆశించవద్దని బంజారాలకు బోధించారు. సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌గారు, హింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుసుడయ్యారు. సేవాలాల్‌ మహరాజ్‌ ఆనాడు బంజార జాతి పరువు ప్రతిష్టల గురించి ముందుగానే ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేసి ఆచరించి చూపారు. ఆ తరుణంలో బంజారాలు ఆనాడు రాజుల కాలం నుంచి బ్రిటిష్‌ కాలం వరకు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగిస్తూ ఉండేవారు._*
 
*_ఆ క్రమంలో బ్రిటిష్‌, ముస్లీం పాలకుల మత ప్రచారం ద్వారా బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురి అయ్యింది. ఈ పరిస్థితులలో బంజారా జాతిని సన్మర్గంలో నడిపించేంందుకు సేవాలాల్‌ మహారాజ్‌ అవతరించారు. సేవాలాల్‌ మహరాజ్‌ బోధనల ద్వారా బంజారా జాతి పురోగమిస్తుంది._*

*_🌹మహిమలు:-_*

*_సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ మహిమలు అద్భుతమైనవి. వీటి మీద అనేక కథనాలు కలవు. వాటిలో పురుషున్ని స్త్రీగా మార్చడం, ఒక ముంత బియ్యంతో 10,000 మందికి భోజనాలు పెట్టడం, చనిపోయిన వ్యక్తిని మూడు దినాల తరువాత బ్రతికించడం, విషం కలిపిన తీపి వంటకాలను నిర్వీయం చేయడం. ఉదృతంగా పారే ప్రవాహాన్ని ఆపి తమ తండా ప్రజలను, ఆవులను దాటించడం. సేవాలాల్‌కు అపకీర్తి తీసుకురావాలని జాదూగర్‌ వడితియా ఒక పురుసుడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి సంతానం ప్రసాదించాలని కోరతాడు. సేవాలాల్‌ తథాస్తు అంటూ దీవిస్తాడు. నిజంగానే ఆ పురుషుడు స్త్రీగా మారిపోతాడు. అలాగే సేవాలాల్‌ దర్బారులోనికి తలవంచి ప్రవేశించడానికి అతడి ప్రవేశ మార్గంలో చిన్న తలుపును ఏర్పాటు చేయగా సేవాలాల్‌ తన ఆకారాన్ని కుదించుకుని తలవంచకుండానే ఆ దర్వాజాలో నుండి ప్రవేశిస్తాడు. అలాగే సేవాలాల్‌ను బావిలో దిగి సన్నని నూలు పోగు ఆధారంతో పైకి వచ్చి తన భక్తిని నిరూపించారు._*

*_🌹ఉద్యమాలు:-_*

*_సేవాలాల్‌ మహరాజ్‌ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో  ‘ఫేరి’ ఒకటి ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడిలు అరికట్టడం, క్షాత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ._*
*_ఒకప్పుడు భారతదేశంలో  ఆంగ్లేయులు పరిపాలించేవారు మహమ్మదీయులు పరిపాలించేవారు ఆ సమయంలో తాండారాజ్యంలో ఉన్నటువంటి బిడారి వ్యవస్థ ఆగిపోవడంతో ఈ ఆంగ్లేయులు నవాబులు కలిసి భారీ మతమార్పిడులు కొనసాగించేవారు . ఆ సందర్భంగా అనేకమంది హిందూ బంధువులు బంజారా బంధువులు మతం మారేవారు._*  *_తాండరాజ్యంలోని ఒకానొక గాంగుండియ సహకారంతో అనేక మందిన బలి అయ్యారు. ఆంగ్లేయులు ఇచ్చే మహమ్మదీయులు ఇచ్చే సొమ్మును తీసుకొని బంజారాలను ఇబ్బందులను గురి చేసేవాడు . ఇది తెలిసినటువంటి సేవాలాల్ మహారాజ్ వాడిపై యుద్ధం చేసి వారిని వధిస్తాడు .  ఇదంతా మనకు వ్యతిరేకంగా జరుగుతోందని భావించిన నవాబులు ఆంగ్లేయులు ఇంకా అనేక ఇబ్బందులను గురించేశారు . అప్పుడు సేవాలాల్ క్షాత్ర ధర్మం పాటించాడు. అంటే  క్షత్రియుని కర్తవ్యం అంటే యుద్ధము చేయడమే  దర్మం. తాండరాజ్యానికి హాని కలిగినపుడు వారు చేసిన పోరాటం.  సందర్భంగా ఆంగ్లంలో ఎన్నో పోరాటంలో చేశాడు._* 
*_సేవాలాల్ మహారాజులతో ఆంగ్లేయుల తో, నవాబులతో ఒక వడంబడిక కూడా కుదిరింది . దేవాలయం అంటే తాండ , తాండ అంటే దేవాలయం తండాలో అందరూ ఉండేది భక్తులు.  కాబట్టి మా తాండరాజ్యంలో ఉన్న దేవాలయంలో మీరు మత మార్పిడి చేయకూడదు అని చెప్పి ఒక నిషేధం చట్టాన్ని తీసుకొచ్చాడు . అప్పట్లో ఆంగ్లేయులు ఒప్పుకున్నారు కూడాను ఇవన్నీ సాధించాడు._*
 *_సేవాలాల్ మహారాజ్ క్షాత్ర ధర్మాన్ని ప్రకటించినప్పుడు దేశంలో నష్టం వాటిల్లుతుంది.  అనేకమంది చనిపోతారు అనే భయంతో ప్రజలందరూ మేరా మా జగదంబ మాతకు వద్దకు వెళ్లి విన్నవించుకోగా , Sevalal ఒప్పుకోడు._* 
*_ఈ యుద్ధం ఆపుటకు అనేక ప్రయత్నాలు చేసింది.  చివరికి ఒక ప్రయత్నం చేసి క్షత్ర ధర్మాన్ని ఆపూటకు సేవలాల్ మహారాజు వద్దకు వెళ్లి,  సేవాలాల్ మీరు పెళ్లి చూసుకోండి , ఒక మంచి కన్యకు తెచ్చి నీకు వివాహం చేస్తాను అని,  నీవు నీ కుటుంబం నాకు సేవలు అందించవచ్చు అని సేవాలాల్ ని కోరుకుంటుంది._*  *_జగదంబ మాత చెప్పిన మాటలు సేవాలాల్ ఒప్పుకోడు . నేను పెళ్లి చేసుకోను అని చెప్పి కరాకండిగా చెప్పడంతో వేరే మార్గం లేక మేరా మాత  బ్రహ్మం వద్దకు వెళ్లి చెప్పు కుంటుంది .   బ్రహ్మ వద్దకు వెళ్లేటప్పుడు సేవాలాల్ తన యొక్క ప్రార్థివ శరీరాన్ని అన్నదమ్ములకు అప్పజెప్పి ఒక వేప మట్టాలపై పడుకుని తన పార్టీవ శరీరాన్ని వదిలి బ్రహ్మ లోకం వెళతారు ._* *_భక్తులు కోరిన ప్రకారంగానే మనం వరాలు ఇవ్వాలి అతని నుదుటిన పెళ్లి ప్రస్తావన లేదు అని బ్రహ్మ తెలియజేయగా చేసేది ఏమీ లేక దివి నుండి భువి కి వెనక్కి తిరిగి వస్తుంటారు.   తిరిగి వచ్చే క్రమంలో జగదంబ మాత ఆంగ్లేయుల కూతురు అయిన మేరీ వద్దకు వెళ్లి సేవాలాల్ చనిపోయాడు అని పురమాయిస్తోంది.  మేరీకి సేవలాల్ కి గల సంబంధం ఏంటంటే అగ్లేయ అధికారి కూతురు సేవాలాల్ వారిని ఎక్కువగా ప్రేమించింది.  అన్నమాట అప్పట్లో ._*
*_అప్పుడు మేరీ సరాసరి సేవాలాల్ యొక్క తల్లి ధర్మినీ బాయి వద్దకు వెళ్లి నీ కొడుకు  మరణించాడు అని చెప్పగానే దుఃఖంతో ఆగలేక ధర్మిని బాయి,  పార్టీవ శరీరం దగ్గర వచ్చి ఆ శరీరాన్ని ముట్టుకుంటుంది అన్నదమ్ములు ఎంత నివారించిన ఆమె వినలేదు.  ఆ శరీరం మలినం అవడంతో భువి నుండి వస్తున్నటువంటి తన ఆత్మ అందులో ప్రవేశించలేక ,  తన పార్టీవ శరీరాన్ని వదలవలసి వచ్చింది.  ఆ సందర్భంగా అందరు బంధు వర్గం అంతా కలిసి తన పార్టీవ శరీరాన్ని  పౌరాఘడ్ తీసుకెళ్లి దహన కార్యక్రమాలు చేస్తారు.  చివరిసారిగా సేవాభాయ ప్రత్యక్షమై అనేక భోదములు చేసి సత్యలోకం చేరుకుంటారు బంజారాల ధర్మగురు సేవాలాల్ మహారాజ్. 🙏_*

 *_'సేవాలాల్ మహారాజ్ ' జయంతి శుభాకాంక్షలు.. 💐_*

 *_-మీ..డా.తుకారాం జాదవ్.🙏_*

No comments:

Post a Comment