🙏🙏🙏🌹🌹🌹
దశవిధ నాడులు :-
1. ఇడానాడి : అంటే చంద్రనాడి, ఎడమ భాగం లో ఉంటుంది. శివుడు అధి దేవత.
2. పింగళ నాడి : అంటే సూర్యనాడి, కుడి వైపు ఉంటుంది. విష్ణువు అది దేవత.
3. సుషమ్న నాడి : అంటే అగ్నినాడి, మధ్యమందు ఉంటుంది. బ్రహ్మ అధిదేవత.
4. గంధారి నాడి : అంటే కుడి నేత్రమందు ఉంటుంది. ఇంద్రుడు అధిదేవత.
5. హస్తినాడి : అంటే జిహ్వయందు ఉంటుంది. ఎడమ నేత్రమందు ఉంటుంది. వరుణుడు అధిదేవత.
6. పూషనాడి : కుడి కర్ణమందు ఉంటుంది. దిగ్ దేవత అధిదేవత.
7. పయశ్వనీ నాడి : ఎడమ కర్ణమందు ఉంటుంది. పద్మోధ్భవుడు అధిదేవత.
8. ఆలంబన నాడి : మెడ దగ్గర ఉంటుంది. నప్యాపకుడు అధిదేవత.
9. కుహునాడి : గుదస్థానం వద్ద ఉంటుంది. భూమి అది దేవత.
10. శంఖినీ నాడి : నాభిస్థానం వద్ద ఉంటుంది. చంద్రుడు అది దేవత.
.......................................................................
సప్త సముద్రాలు :-
లవణ సముద్రం - మూత్రం.
ఇక్షు సముద్రం - చెమట.
సురాసముద్రం - ఇంద్రియం.
సర్ప సముద్రం - శోణితం.
దథి సముద్రం - శ్లేష్మం.
క్షీరసముద్రం - జోల్లు.
శుద్దోదక సముద్రం - కన్నీరు.
.......................................................................
ఊర్థ్వలోకాలు :-
భూలోకం -- గుదమందు ఉంటుంది.
భువర్లోకం -- గుహ్యమందు ఉంటుంది.
సువర్లోకం -- నాభియందు ఉంటుంది.
మహర్లోకం -- హృదయం యందు ఉంటుంది.
జలలోకం -- కంఠం యందు ఉంటుంది.
తపోలోకం -- భ్రూమధ్యం యందు ఉంటుంది.
సత్యలోకం -- లలాటం యందు ఉంటుంది .
అధోలోకాలు :-
అతల లోకం -- అరికాళ్ళ యందు ఉంటుంది.
వితల లోకం -- మోకాళ్ళ దగ్గర ఉంటుంది.
సుతల లోకం -- మడిమల వద్ద ఉంటుంది.
తలాతల లోకం -- పిక్కల యందు ఉంటుంది.
రసాతల లోకం -- మోకాళ్ళ దగ్గర ఉంటుంది.
మహతల లోకం -- తొడలయందు ఉంటుంది.
పాతాళ లోకం -- గుదయందు ఉంటుంది.
.......................................................................
దేహత్రయ వివరణ :-
ప్రాథమికంగా వీటిని అవగాహన చేసుకోవడం అవసరం అందుకే ఇవి పోస్ట్ చేయడం!
1. దేహత్రయం :- స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం.
2. అవస్థా త్రయం : - జాగృత్త, స్వప్న, సుషుప్తి.
3. స్థాన త్రయం :- విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు.
4. గుణ త్రయం :- రాజసం, సాత్వీకం, తామసం.
5. వర్ణ త్రయం :- రక్తవర్ణం, శ్వేతవర్ణం, నీలవర్ణం.
6. దైవ త్రయం :- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు.
7. మాతృకా త్రయం :- అకారం, ఉకారం, మకారం.
ఇలాంటి త్రయాలు చాలా ఉన్నాయి..
........................................................................
సప్త ద్వీపాలు :-
జంబూ ద్వీపం - తలలోను.
ప్లక్షద్వీపం - ఆస్తులు.
శాకద్వీపం - శిరస్సున ఉంటుంది.
శాల్మల ద్వీపం - చర్మమున ఉంటుంది.
పుష్కర ద్వీపం - గోళ్ళ యందు ఉంటుంది.
కుశ ద్వీపం - మాంసం యందు ఉంటుంది.
కౌంచ ద్వీపం - వెంట్రుకల యందు ఉంటుంది...
🌹🌹🌹🙏🙏🙏
No comments:
Post a Comment