ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌺
ఉపనిషత్ గంగ - 5
ధర్మం యొక్కమూలవేదం.
-----------------------
చాందోక్య ఉపనిషత్ యొక్క ఘోషణ ఏమిటంటే... జ్ఞానాన్ని తెలుసుకునే ముందు దాన్ని మూలం వరకు మనం చేరుకోవాలి. దానినే వేదం అంటారు. అందువలన వేదం భారతీయ చింతన, మరియు దర్శనం యొక్క ఆధారం. అందువలన ఉపనిషత్తుల యొక్క యాత్రకి ముందు మనం వేదం మరియు భారతీయ జీవనానికి ఆధార స్తంభమైన నాలుగు పురుషోర్ధాలు, నాలుగు ఆశ్రమాలు, నాలుగు వర్ణాలను తెలుసుకోవాలి. మనం వేదాల నుండి ఎప్పుడైతే ఉపనిషత్తులు యాత్ర వరకు చేరుకుంటామో... అప్పుడే జ్ఞానం పై పడిన అంధకారం అనే తెర తొలగిపోతూ ఉంటుంది.
మొగల్ సల్తనత్ కి కాబోయే షాజహాన్ పెద్ద కుమారుడు ధారాశిఖోను అతని చిన్న సోదరుడు కారాగారంలో బంధిస్తాడు. రాజ్యకాంక్ష, ప్రతీకారంతో అతని బంధించడమే కాకుండా అతనికి మరణశిక్ష కూడా విధిస్తాడు ధారాశిఖో సోదరుడు.
కారాగారంలో ఉన్న దారాశిఖో కుమారుడు తండ్రికి విధించిన మరణశిక్షను విని దుఃఖిస్తూ ఉంటాడు. అప్పుడు దారాశిఖో కొడుకుతో ఇలా అంటున్నాడు.....
నాయనా! ఎవరైతే నేను చంపేవాడిని, నేను చచ్చేవాడిని అనుకుంటారో వారు ఎవరూ చంపరు, ఎవరు చావరు అని తెలుసుకోలేరు . అతను జన్మించడు మరియు మరణించడు. శరీరం చనిపోతే అతను చనిపోడు. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి పాత బట్టలను విడిచి కొత్త బట్టలను ధరిస్తాడో అదే విధంగా జీవుడు తన పాత శరీరము విడిచి క్రొత్త శరీరాన్ని ధారణ చేస్తాడు.
కానీ ఈ సమయంలో కూడా మీరు ఇంత శాంతిగా ఎలా ఉండగలుగుతున్నారు అని తండ్రిని అడుగుతాడు అతని కుమారుడు ఇక్కడ మృత్యువు మనిద్దరి మధ్య నిల్చొనుంది అయినా మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు?
మృత్యువే ఆఖరి ప్రశాంతత నాయనా. మా ఉస్తాద్ (గురువు) చెప్తారు మృత్యు సమయంలోనే ప్రియునితో కలిసిన అనుభవం కలుగుతుంది అంటారు. ఇప్పుడు నువ్వు చిన్నవాడివి. నీకు అర్థం కాదు. ఒకవేళ నీకు ఆ పైవాడు సమయం ఇస్తే వేదం తప్పకుండా చదువు. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు చనిపోవడం అంటే బాక్స్ లో బంధించడం కాదు స్వేచ్ఛను పొందడం అని.
కానీ నాన్నగారు మీరు బాద్షా (రాజు) అయి ఉంటే మీరు స్వతంత్రులుగా ఉండేవారు కదా?
బాబు మన జీవితం నీటి బిందువు లాంటిది. నా తలరాతలో రెండు విషయాలు రాయబడ్డాయి. బిందువు ముత్యం గా మారి కొద్ది రోజులు మెరియవచ్చు లేదా ఈ బిందువు శాశ్వతంగా సముద్ర గర్భంలో కలిసిపోవచ్చు. ఇప్పుడు చెప్పు ఈ చిన్న బిందువుకి అంత పెద్ద సముద్రంలో కలవడానికి అవకాశం దొరుకుతున్నప్పుడు ఆ బిందువు సంతోషించాలా? దుఃఖించాలా?
అది విన్న చెరసాల కాపలాదారుడు యువరాజా నేను హిందువును కానీ మీకు ఈ వేదజ్ఞానం చదవవలసిన అవసరం ఎం వచ్చింది అని అడుగుతాడు.
మా తాతగారు జహంగీర్ ప్రభావం నాపై ఉంది.
మరియు నా గురువులు వేదాలు, ఉపనిషత్తుల యొక్క పరిచయం నాకు చేశారు. అంటూ దారాసిఖో తన గతాన్ని చెప్పడం మొదలుపెడతాడు....
ఒకరోజు ముస్లింల యొక్క దర్గా లో ఒక ఫకీరు జీవిత సత్యాన్ని గురించి పాడుతూ ఉంటే అక్కడ ఉన్న ధారాసిఖో అది విని అతని దగ్గరకు వెళ్తాడు. ధారాశిఖోను చూసిన ఫకీరు, షాజహాన్ యొక్క ప్రియమైన పుత్రుడు మొగల్ సామ్రాజ్యానికి కాబోయే రాజకుమారుడికి ఒక ఫకీర్తో ఏం పని పడింది? ఈ పేద ఫకీర్ దగ్గర నీకేం దొరుగుతుంది అని అడుగుతాడు.
మా ముత్తాత చెప్పేవారు రాజకుటుంబంలో జన్మించిన వారికి ఆ దర్పం రాజసం వచ్చేస్తాయి. కానీ తెలుసుకోవడం నేర్చుకోవడం లాంటి విషయాల్లో వీరు పేదవారే.
అయితే నువ్వు సరియైన వ్యక్తి దగ్గరకే వచ్చావు చెప్పు నేను నీకు ఏం సహాయం చేయగలను. బాబా! మీరు ముసల్మానులు, నమాజ్ చదువుతారు అయినా వేరే మతాలను కూడా మీరు ఎందుకు నమ్ముతారు.
ఎందుకంటే ఇక్కడ ద్వంద్వము లేదు. ఉన్నది ఒక్కడే. అన్ని బిందువులు ఆ సముద్రంలోనే ఉన్నాయి. పేరు ఏదైనా చెప్పుకో కానీ అందరూ పిలిచేది అతన్నే.
కానీ ఇన్ని రకాల మతాలు నియమాలు ఇవన్నీ అబద్ధాలా?
జాగ్రత్తగా తాల్ మూద్, అంజిల్, ఉపనిషత్, ఖురాన్ ఇవన్నీ చదివితే నీకు అర్థం అవుతుంది. అన్ని సముద్రాలు ఒక్కసారిగా కలిసిపోయాయి అని.
పారసీలో దీనిని 'మజ్ వువా ఉల్ బహరీన్' అంటారు.
వాహ్ ! చాలా బాగుంది. మీరు అనుమతి ఇస్తే హిందూ ముస్లింల ఏకత్వం గురించి నేను రాస్తున్న పుస్తకం కోసం ఈ పేరును దొంగిలించ వచ్చా అని అడుగుతాడు.
ఫకీరు దగ్గర నుండి కూడా ఏదైనా దొంగిలించవచ్చు అని నేను మొదటిసారిగా వింటున్నాను అని నవ్వుతారు ఫకీర్ బాబా.
మీరు పకీర్ కాదు మీ దగ్గర ఖజానా ఉంది.
కానీ అన్నింటికన్నా పెద్ద ఖజానా మన దగ్గర ఉంది అవి వేదములు, పురాణములు, ఉపనిషత్తులు.
నేను మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. పవిత్ర ఖురాన్ అల్లా యొక్క సందేశం. అలాగే ఈ వేదాలు కూడా ఆ పైవాడి శబ్దములే. భాష వేరు వేరు అంతే. అందుకే ఒకరికొకరు తమ భాషలో ఈ పవిత్ర గ్రంథాలను అనువాదం చేస్తే బాగుంటుంది. నువ్వు సంతులపై ఏవో పుస్తకాలు రాశావని విన్నాను అని అడుగుతారు ఫకీర్.
అవును బాబా కొన్ని రాయడానికి ప్రయత్నం చేశాను. కానీ ఉపనిషత్లను పారసీ భాషలోకి తర్జుమా చేసినప్పుడు మజా వస్తుంది. ఒక క్రొత్త ప్రపంచం తెరవబడుతుంది. అది మీ ఎదురుగానే కాదు మొత్తం ప్రపంచానికి ఎదురుగా కూడా తెరవబడుతుంది. అని ఫకీర్ ఉపనిషత్తులను పారసీ భాషలో తర్జుమా చేయమని చెప్తారు.
అలాగే బాబా. మీ ఆజ్ఞను శిరసావహిస్తాను. పారసీ భాషలోకి ఉపనిషత్తులను అనువాదం చేయడం శుభారంభం చేస్తాడు దారాశిఖో. అతని అభిప్రాయంలో ఉపనిషత్తులను పారసీ భాషలో అనువాదం చేయడం అంటే ఒక పెహల్వాన్ తో పోరాటం లాంటిది. అయినా మజా వస్తుంది అని ఒక పండితులతో చెప్తారు. ఆ పుస్తకానికి పేరును కూడా ఎంపిక చేసుకున్నాను అని చెప్తాడు దాని పేరు.
'sirr- e-akbar'. అంటే ఒక గొప్ప రహస్యం అని అర్థం. మరియు మా ముత్తాత జలాలుద్దీన్ అక్బర్ యొక్క పేరు కూడా కలిసినట్టుగా ఉంటుంది అంటారు ధారాశిఖో. సత్యంపై ఏదో ఒక్కమతం యొక్క హక్కు ఎప్పుడు ఉండకూడదని మా ముత్తాత అభిప్రాయం. అందుకే అతను నిజంగానే అక్బర్ (గొప్ప వ్యక్తి) అతను స్వామి తులసీదాస్ ని కలవడానికి కాశీ కూడా వెళ్లారు అని చెప్తారు ఆ పండిత్. నేను కూడా కాశీ వెళ్లాలనుకుంటున్నాను. నాకు అర్థం కాని విషయాలు ఎన్నో వేదంలో ఉన్నాయి. అంటూ దారాసిఖో కాశీకి బయలుదేరుతాడు.
ధారాశిఖో కాశీలో బాబా లాల్ దాస్ ను కలవడానికి వెళతాడు. చాలా దూరం నుండి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను బాబా లాల్దాస్ జి అంటాడు. అప్పుడు లాల్ దాస్ అంటారు చెప్పండి మేము మీకు ఏం సేవ చేయగలం.
బాబా ఇతను షహజాదా (యువరాజు) వేదాలు పురాణాలు చాలా చదివారు. కానీ ఇంకా కొన్ని ప్రశ్నలకు జవాబు దొరకలేదు అని ధారాసిఖోతో వచ్చిన పండితుడు బాబాకు చెబుతారు.
వేదాలు ఉన్నదే మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి. ఆ ప్రశ్న జీవనానికి సంబంధించినది అయినా, సమాజానికి సంబంధించినది అయినా దర్శన, ఆధ్యాత్మికతకు సంబంధించినదైన సరే. ప్రకృతి యొక్క కణకణము నుండి బ్రహ్మాండము వరకు ఏది కూడా తప్పించుకోలేదు వేదం నుండి. వేదం యొక్క శాస్త్రీయ అర్థం జ్ఞానం. సత్యాన్ని తెలుసుకుని అర్థం చేసుకుని మరియు దాన్ని పొందే విద్యనే వేదం అంటారు. కానీ ఈ జ్ఞానం సామాన్య జ్ఞానం కాదు. ఇది ఈశ్వరీయ జ్ఞానం. దానిని ఋషులు సాక్షాత్కారం గా పొందారు.
వాస్తవంగా చెప్పాలంటే వేదం ఒక జీవనానికి సంబంధించిన పుస్తకం. ఈ పుస్తకం ఆ పౌరుషేయం. అంటే వేదాలను ఎవరో మనుష్యులు రాయలేదు. వేదాలను శృతి అని కూడా అంటారు. మన ఋషులు ఆ మంత్రాలను స్వయంగా విన్నారు. ఆ ఋషులు ద్వారానే ఆ మంత్రాలు అతని శిష్యుల వరకు శ్రవణం అంటే వినడం ద్వారా చేరాయి. ఋషులు విన్నది, చూసినది ఏ జ్ఞానం అయితే ఉన్నదో దానిని వేదం అన్నారు.
తరువాత ఆ సంపూర్ణమైన జ్ఞానాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. అవే నాలుగు వేదాలు అయ్యాయి. అవి ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.
బాబా! వేదాలు నాలుగు కదా మరి వేద త్రయం అంటే ఏమిటి?
వేదాలను పద్యం, గద్యం, గానం ల ఆధారంపై విభజించారు. పద్యానికి ఋగ్, గద్యానికి యజుస్ , గానానికి సామం అని పేర్లు ఇవ్వబడ్డాయి. పద్యం, గద్యం, గానాలనే వేద త్రయం అంటారు.
హిందుస్థాన్ యొక్క ప్రజలకు పెద్దపెద్ద వ్యాపారస్తులు, పెద్ద నాయకులు వీరెవరు వారికి వారి మనసుకి ఇష్టపడరు. అయితే హిందుస్థాన్ ప్రజల మనసుకు ఎవరు ఇష్టపడతారు. వారికి తమపై విజయం పొందిన జితేంద్రియలే ఆకర్షిస్తారు. వీరికి పవిత్రత ఆకర్షిస్తుంది. అందువలన హిందుస్థాన్ మనసుకు ఫకీర్ ఆకర్షిస్తాడు. అతను నిర్ధనుడు కానీ పవిత్రుడు. వీరికి సతతం ఆత్మ యొక్క ఉపాసనలో ఉండేవారే ఆకర్షిస్తారు.
నాకు ఒక విషయం అర్థం కాలేదు. యుగాల నుండి వస్తున్న పోరాటాలు, బానిసత్వం ఉన్న ఈ దేశం ఎలా కాపాడబడింది. అని అడుగుతాడు దారాశిఖో.
షహజాదా! హిందుస్థాన్ యొక్క సభ్యత, సమస్త మానవజాతి యొక్క ఆధ్యాత్మిక ఏకత్వంపై నిలబడి ఉంది. అందువలననే ఒకప్పుడు లోపల, ఒకప్పుడు బయట యుద్ధాలు జరిగినప్పటికీ ఈ దేశం జీవించి ఉంది. అంటే హిందుస్థాన్ తన ఆత్మ యొక్క అమృత సందేశము ద్వారా తరతరాలుగా జీవించి ఉంది. ఆత్మ యొక్క విజ్ఞానమే ఈ దేశం యొక్క శక్తి. ఈ దేశం యొక్క చరిత్ర. అలానే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికులు, ధార్మికులు అని చెప్పలేము కానీ ఈ దేశం యొక్క గాలి సంస్కృతిలో ఏదో ఉంది. అందుకే ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు తనను తాను నేనెవరు? అని ప్రశ్నించుకుంటాడు. నా జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి? అని ప్రశ్నించుకుంటాడు. ఒకవేళ అతను ఈ విషయాన్ని మర్చిపోయినా ఈ దేశం యొక్క ఫకీర్లు, సంతులు అతనికి ఆ విషయం గుర్తుకు వచ్చేలా చేస్తుంటారు. ఆలోచించు ఎవరు నువ్వు అని గుర్తు చేస్తుంటారు.
హరిః ఓం 🙏🏻 జై గురుదేవ 🙏🏻🌺
No comments:
Post a Comment