*6టీవీ శుభోదయం*. *_జీవితంలో ఒక వ్యక్తి గొప్పవాడు అవ్వాలంటే అది పుట్టుక ద్వారా కాదు, తాను చేసే పనుల ద్వారా అవుతాడు._*
*_విజయం సాధించాలనుకునే వ్యక్తి అడ్డదారులు తొక్కడం ద్వారా గొప్పవాడు కాలేడు. కేవలం సరైన పద్ధతిలో అనుకున్న లక్ష్యాన్ని చేరితేనే గొప్పవాడు అవుతాడు._*
*_జీవితంలో దేనికి నిరాశపడకు... రెండు చేతులిచ్చాడు దేవుడు ఎంత బరువైనా మోయమని... రెండు కాళ్ళు ఇచ్చాడు మోసే చేతులకి సాయం చేయమని,_*
*_కండలు గట్టిపడుతున్నాయి నీకు కష్టం తెలియొద్దని. చర్మం చెమటను చిందిస్తుంది. అంటే నీ కష్టాన్ని గుర్తిస్తుంది. మెదడు నీకోసమే ఎప్పుడు ఆలోచిస్తుంది నువ్వు గొప్పోడివి కావాలని._*
*_కళ్ళు నీ గెలుపుని చూడాలని అనుకుంటున్నాయి. చెవులు నీకోసం కొట్టే చప్పట్లు, ఈలలు, పది మంది మాట్లాడుకునే మంచి మాటలు వినాలని అనుకుంటున్నాయి._*
*_నీకోసం ఇంత మంది ఆలోచిస్తుంటే... నీకు సాయం చేస్తుంటే... సాయం చెయ్యని స్వార్ధపు సమాజం మాటలు ఎందుకు విని నిరాశ పడుతున్నావు._*
*_నీ రక్తం ఉడుకు నీకు తెలియట్లేదా.? నీ ఊపిరి గాలికి ఉన్న శక్తి నీకు అర్ధం కావట్లేదా.? బద్దకం అనే సంకెళ్లు తెంచి ఓటమి అనే శత్రువుపైన యుద్ధం చెయ్._*
*_గెలుపు కోసమే పోరాడు, ఓడిపోతే నీ వల్ల కాదు అనే వారి మాటలను పట్టించుకోకు... నీ తోటివారు మాట్లాడుకోడానికి నీ సక్సెస్ ఒక ఉదాహరణ కావాలి అంతేకాని దేనికి నిరాశపడకు...
🌹 🪴🙇♂️🪴 🌹
No comments:
Post a Comment