Friday, June 28, 2024

****ఇదే లోకం తీరు

 *_జీవితంలో ఏ బంధమైనా నమ్మకమే పునాది. కానీ ఆ పునాది మీరు అనుకున్నంత స్ట్రాంగ్‌గా ఉండదు._*

*_ఎందుకంటే ఇక్కడ ఎవడి లైఫ్ వాడికే, పీకల దాగా వచ్చిందంటే... ఇంకా నీ గోల యేలా..? ఎవరైనా సరే మిమ్మల్ని ఎడారిలో వదిలేసి... నీళ్ల బాటిల్ కూడా ఇవ్వకుండా వెళ్లిపోతారు._*

*_ప్రపంచంలో ఒక్క మనిషి కూడా పర్ఫెక్ట్ అని చెప్పలేం. కచ్చితంగా కనిపించని మరో కోణం ఉంటుంది. కానీ అది నమ్మినవారు తెలుసుకోలేరు. అతి నమ్మకం ఏదో ఒకరోజు బెడిసి కొడుతుంది._*

*_మీకు నమ్మకం ఉన్న వ్యక్తులను వంద శాతం నమ్మకండి... 70, 80, 90... ఇలా లెక్కలు వేసుకోండి. ఎందుకంటే పూర్తిగా వందకు వంద శాతం నమ్మకమైన వ్యక్తులు లేరిక్కడ. మీరు పూర్తిగా నమ్మేస్తే... చివరిగా బాధపడేది మీరే._*

*_ఎందుకంటే మీకు వారిపై కొన్ని అంచనాలు ఉంటాయి. నా కష్టంలో నాకు తోడు ఉంటారు అని, మీకు పెద్ద పెద్ద ఊహలు ఉంటాయి... కానీ, కష్టం వస్తే నీ కాంపౌండ్ వాల్ కూడా తొక్కరు. గుర్తుంచుకో..._*

*_అరే... డబ్బుదేముందండి ఈరోజు వస్తుంది రేపు పోతుంది అనే సొల్లు కబుర్లు చెప్పకు. ఈరోజు బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే చెబుతున్నా నీతి వాక్యాలు ఇక మాని నువ్వు, డబ్బు సంపాదించడంలో ఆసక్తి చూపించు._*

*_డబ్బు ఉంటే చాలు, నీతి తప్పిన, తల మాసిన వెధవనైనా అందలమెక్కిస్తుంది ఈ లోకం. వాడు ఎలా సంపాదించాడు అనేది ముఖ్యం కాదు, వాడి వద్ద డబ్బులు ఉన్నయా అనేదే ముఖ్యం. ఛీ వెధవ అని               చీదరించుకున్న వారే... డబ్బులుంటే... శాలువ కప్పి సన్మానిస్తారు. ఇదే లోకం తీరు☝️_*

      *_సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌹🌹🌹 🪴🙇🏻‍♂️🪴 🌹🌹🌹

No comments:

Post a Comment