🙏 *రమణోదయం* 🙏
*జనుల మానసిక పరిపక్వతను బట్టి సిద్ధాంతాలని బోధించే విధంగా వివిధ మతాలు ఏర్పడ్డాయి. అందుచేత జనులు అనుష్టించే మతాలలో దేనినీ ద్వేషించకుండా "సమబుద్ధి" కలిగి యుండటమే వివేకం.*
మనస్సును హృదయంలో లీనం చెయ్యడమే
కర్మ,భక్తి,యోగ,జ్ఞాన సాధనల సారాంశం..తేలుతున్న
వస్తువు మునగాలంటే మునిగే ఉపాయాలు
చెయ్యాలి..మనో విక్షేపాల నరికట్టడానికి
ప్రాణాయామం ఒక ఉపాయం..మనస్సుకు ప్రశాంతి
చేకూరినప్పుడైనా అప్రమత్తతతో నిర్విరామంగా
ధ్యానం కొనసాగించినప్పుడే మనస్సు హృదయంలో లీనమౌతుంది!
💐 ఓమ్ నమో భగవతే శ్రీ రమణాయ💐
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
💗(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.342)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment