*ప్రాతఃకాలంలో సూర్యాగమనంతో ప్రారంభమయ్యే రోజు అపరాహ్ణం వేళకు ఎలా తల మండించేలా తయారవుతుందో అలా బాల్య యౌవనావస్థలు దాటి నడి వయసుకు చేరేనాటికి కష్టాలు, బాధ్యతల కొలిమి వేడి భరింపరానిదవుతుంది. సాయంకాలాలు చల్లని మలయ మారుతంతో సేదదీర్చినట్లు మనిషి మలి వయసుకు చేరేనాటికి బాధ్యతలు తీరి ప్రశాంత చిత్తం సాధించగలిగితే బతుకు అర్థవంతమవుతుంది. అలా ప్రశాంత చిత్తం సంప్రాప్తించనప్పుడు ఊపిరందని స్థితిలో ప్రాణులు ఉక్కిరిబిక్కిరైనట్లు జీవితం దుర్భరమవుతుంది. భౌతికంగా మరణించడం మనిషి చేరుకోవలసిన గమ్యం కాదు. మరణించేనాటికి చిత్తం ఎప్పటికీ నిలిచే ధ్యానగత ప్రశాంతత సాధించినప్పుడు ఆత్మారాముడి అంతరలోక ప్రయాణం సుఖవంతమవుతుంది. చేయిదాటక ముందే జీవిత లక్ష్యం, జీవిత పరమార్థం ఏమిటో దర్శించగలిగినవాడు నిజానికి ధన్యజీవి.
No comments:
Post a Comment